మొదట డ్రగ్స్ ఎలా తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డానని…కానీ ఓ నటుడు వాడకాన్ని చాలా సునాయసంగా నేర్పించాడని చెప్తోంది హీరోయిన్ పూర్ణ. ఇదంతా నిజజీవితంలో కాదు సినిమా నటనలో భాగంగా డ్రగ్స్ తీసుకునే సీన్స్ లో నటించడం గురించి వెల్లడించింది పూర్ణ. ఆమె నెగిటివ్‌ రోల్‌ పోషిస్తున్న తాజా చిత్రం పవర్ ప్లే. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ కొండ తెరకెక్కించాడు.

కాగా ఇందులో డ్రగ్‌ అడిక్ట్ గా పూర్ణ కనిపించింది. ఈరోజే రిలీజైన సినిమాలో ఆమె పాత్రను బాగానే చూపించారు మేకర్స్. అయితే డ్రగ్స్‌ ఎలా వాడాలో తనకు తెలియనుందన…చిత్రీకరణ సమయంలో ఇబ్బంది పడిందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో ముక్కు ద్వారా డ్రగ్‌ను పీల్చే సీన్స్ ఉన్నాయని, కాని వాటిని ఎలా తీసుకుంటారో తెలియకపోవడంతో ఆ పౌడర్‌ ముక్కులోనికి వెళ్లి దిమ్మతిరిగేదట. ఇక సెట్‌లో ఉన్న ఓ యాక్టర్ చాలా తేలికగా డ్రగ్‌ ఎలా పీల్చాలో నేర్పించడంతో…సన్నివేశాల్లో రెచ్చిపోయిందట పూర్ణ.