ప్రతిభావంతులైన యంగ్ టాలెంట్స్ కు శుభవార్త. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రొడక్షన్ హౌజ్ ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’… ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి.’ కలిసి కొత్త సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నాయి. త్వరలోనే సినిమా పలు విభాగాలకు సంబంధించిన వారిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ రెండు నిర్మాణ సంస్థలు సరికొత్త కథా రచయితలు, దర్శకులకు చేయూతను ఇవ్వబోతున్నాయి. పలు వేరియేషన్స్ లో ప్రాజెక్టులను డిజైన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మొత్తంగా 15సినిమాలు చేయబోతున్న ఈ నిర్మాణ సంస్థలు 6 లో బడ్జెట్ సినిమాలు… 6 మినిమం బడ్జెట్… 3 భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా హరీష్ పాయ్ కీలక బాధ్యతల్లో నిర్వహించబోతున్నారు.