బుల్లితెర‌పై తన స‌త్తాను చూపిస్తునే వెండితెరపై వెన్నెల కురిపిస్తోంది యాంకర్ అనసూయ. రంగస్థలం రంగమ్మత్తగా అమాంతం క్రేజ్ పెంచుకొని క్షణంతో నటిగా ప్రూవ్ చేసుకుంది. అప్పుడప్పుడు హాట్ సాంగ్స్ చేస్తూ అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా ఓ విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం రవితేజ ఖిలాడి కోసం ఇటలీ వెళ్లొచ్చిన అనసూయ తాను పవర్ స్టార్ తో కలిసి కనిపించబోతున్నానని చెప్పేసింది.
తాజాగా వ‌కీల్‌సాబ్ మూవీ రిలీజై… ప‌వ‌న్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్న సమయంలో అన‌సూయ వాళ్లకి అదిరిపోయే అప్‌డేట్ అందించింది. మీ ఫేవరేట్ హీరోతో నేను చేసే ర‌చ్చ చూసేందుకు రెడీగా ఉండండంటూ ప‌వ‌న్ అభిమానులను రెచ్చగొట్టింది. అవును అనసూయ తనకు తానే పవన్ కల్యాణ్ తో నటించబోతున్నట్టు చెప్పుకొచ్చింది. నిజానికి అత్తారింటికి దారేది చిత్రంలోనే అనసూయ ఐటమ్ సాంగ్ చేయాల్సింది. కానీ అందులో హీరోయిన్ ప్లస్ గ్రూప్ లో ఒకదానిగా కనిపించడం ఇష్టంలేని అనసూయ అవకాశాన్ని వద్దనుకుంది. ప్రజెంట్ క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న హరిహర వీరమల్లులోనే అనసూయ స్పెషల్ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు పవన్, అనసూయలపై ఓ ఫోక్ సాంగ్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం.