రీసెంట్గా వకీల్ సాబ్ షూట్ కంప్లీట్ చేసుకున్న పవర్ స్టార్ గత కొన్ని రోజులుగా రాజకీయంగా బిజీగా మారారు. అందులో భాగంగానే తిరుపతిలో పొలిటికల్ మంతనాలు జరుపుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం తిరుమల వెంకన్న దర్శనం చేసుకొని తరించారు. ఆలయం నుంచి బయటికొస్తున్న పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ చేస్తున్నాయి. కాషాయ దుస్తుల్లో పవర్ స్టార్ ను చూసిన అభిమానులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు.
క్రిష్, పవన్ కళ్యాణ్ కాంబో మూవీ జనవరి చివర్లో మొదలుకానున్నట్టు సమాచారం. అయితే ఎప్పుడు స్టార్ట్ చేసినా కేవలం నెలరోజుల్లోనే సినిమా పూర్తి చేయాలని టార్లెట్ ఫిక్స్ చేసారట. ఆపై మలయాళ రీమేక్ అయ్యప్పయుమ్ కోషియుమ్ చిత్రీకరణలో పాల్గొంటారు. రానాతో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ రీమేక్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండేళ్లుగా సినిమా లేకపోయినా ఇప్పుడు వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక వకీల్ సాబ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ప్రేక్షకులు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ న్యూస్ వచ్చేసింది. వకీల్ సాబ్ కి సంబంధించి కొత్త అప్డేట్ ప్రకటించింది మూవీ యూనిట్. సంక్రాంతి కానుకగా జనవరి 14 సాయంత్రం 6.03 గంటలకు టీజర్ తో రానున్నాడు వకీల్.
లాస్ట్ ఇయర్ షూటింగ్ అప్డేట్స్ తో మాత్రమే ఇచ్చి సోషల్ మీడియాలో టాప్ పొజిషన్ దక్కించుకున్న ఈ మూవీ…ఇప్పుడీ టీజర్ తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఉగాదికి లేదంటే వేసవిలో విడుదల ముహూర్తం పెట్టుకున్నట్టు తెలుస్తున్న వకీల్ సాబ్ సంక్రాంతి రోజున ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి.