సినిమాలతోనే కాదు స్టేటస్ విషయంలోనూ పోటీపడుతున్నారు మన తెలుగు హీరోలు. మొన్నీమధ్యే లంబోర్గిని కార్ ను ఎన్టీఆర్ ఇటలీని నుంచి తెప్పించుకుంటే…దానికి మించి అన్నట్టు ప్రభాస్ మరో డూపర్ కార్ ను గ్యారేజ్ లోకి దించేసారు. రెమ్యూనిరేషన్ తోనే కాదు…కొత్త కార్ లో చక్కర్లు కొడుతూ ప్యాన్ ఇండియా స్టార్ స్టేటస్ చాటుతున్నాడు ప్రభాస్.

ప్రభాస్…ఇప్పుడు ఫస్ట్ టైమ్ 100 కోట్ల రెమ్యూనిరేషన్ అందుకుంటోన్న స్టార్ మాత్రమే కాదు…అందరికంటే ముందు లంబోర్ఘిని అల్ట్రా రిచ్ కార్ ను సొంతం చేసుకున్న హీరో కూడా. నాలుగు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఓవైపు ముంబైలో దాదాపు 50 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకుంటూనే…మరోవైపు తన గ్యారేజ్ లోకి లంబోర్ఘిని అవెన్‌టోడోర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ను తెచ్చేసారు. ఈ కార్ ఖరీదు అక్షరాల 6కోట్ల రూపాయలు.

ప్రభాస్ కి కాస్ట్ లీ కార్లపై ఉన్న ఇంట్రెస్ట్ గురించి తెలిసిందే. ఈ హీరో హోమ్ గ్యారేజీలో అత్యంత ఖరీదైన జాగ్వార్ ఎక్స్ జె ఆర్, రోల్స్ రాయస్ ఫాంటమ్ కార్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ తలదన్నే లంబోర్ఘిని అవెంటడార్ ఎస్ రోడ్ స్టర్.. అదికూడా స్టైలిష్ లుక్ లో కనిపించే అరాన్సియో అట్లాస్ షేడెడ్ వెర్షన్ ని సొంతం చేసుకున్నారు. ఇండియాలో ఈ కార్ కొన్న రెండో వ్యక్తి ప్రభాస్ కావడం విశేషం. తన తండ్రి సూర్యనారాయణరాజు జయంతి సందర్భంగా ప్రభాస్‌ ఈ కార్ ను కొన్నట్టు తెలుస్తోంది.

ఈమధ్యే ఎన్టీఆర్ లంబోర్గిని ఉరుస్ కార్ ను బుక్ చేసుకున్నారు. 5కోట్ల రూపాయల విలువ చేసే ఆ కార్ ను మించిన కాస్ట్ లీ కార్ ఇప్పుడు ప్రభాస్ సొంతమైంది. 3కోట్లు విలువ చేసే రోల్స్ రాయల్ ఫాంటమ్ కార్ ని చిరూ వాడుతుంటే…మూడున్నర కోట్లు వెచ్చించి రేంజ్ రోవర్ తీసుకున్నారు రామ్ చరణ్. రెండున్నర కోట్ల రేంజ్ రోవర్ కార్లో మహేశ్ దూసుకుపోతుంటే…అంతే విలువ చేసే బెంజ్ G63 కార్ అఖిల్ సొంతం. ఇక 2కోట్లకు మించిన మోస్ట్ స్టైలిష్ కార్స్ జాగ్వార్, రేంజ్ రోవర్ ఓనర్…అల్లు అర్జున్. ఇలా కార్స్ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరోలు చాలామందే ఉన్నారు.