నాగార్జునతో కలిసి నటించబోతుంది గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ తెలియజేసింది. ఈ మధ్యే పట్టాలెక్కిన నాగ్, ప్రవీణ్ సత్తారు కాంబో మూవీలో ఆమె హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇటు చిరుతో ఆచార్య కంప్లీట్ చేసిందో లేదో….మరో సీనియర్ హీరో నాగార్జునతో చేసే ఛాన్స్ దక్కించుకుంది కాజల్. చూస్తుంటే పెద్ద హీరోలకు కాజల్ మంచి అవకాశంగా మారింది. ఇక ఆమె మంచు విష్ణు అక్కగా నటించి మోసం చేసిన మోసగాళ్లు రిలీజ్ కి రెడీ అయింది. అటు తమిళంలో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా వుంది. ఇలా గౌతమ్ కిచ్లూని పెళ్ళాడాక కూడా కాజల్ సినిమాలతో దూసుకుపోతుంది…

సీనియర్ హీరోల్లో కాస్త స్లో అయ్యారనుకున్న నాగార్జున బరిలోకి దిగుతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించిన నాగ్…త్వరలోనే సోగ్గాడే చిన్నినాయన ప్రీక్వెల్ బంగార్రాజుగా నటించబోతున్నారు. ఇక తాజాగా ఆయన నటించిన వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ప్రకటించారు. నాగార్జున లీడ్ రోల్ చేసిన వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. నిజానికి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు నిర్మాతలు. దానికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసి థియేటర్ బాట పట్టారు. అహిషార్ సోలమన్ డైరెక్షన్లో అలీరేజా, సయామీఖేర్, దియామీర్జా వంటివారు నటించిన ఈ సినిమా చివరికి ఏప్రిల్ 2న థియేటర్స్ కే రాబోతుందన్నమాట.

మనం తాజాగా చెప్పుకున్నట్టు బాలీవుడ్ బ్రహ్మాస్త్ర షూటింగ్ కి బైబై చెప్పి…సరికొత్త చిత్రానికి వెల్కమ్ చెప్పారు నాగార్జున. అవును నాగ్ నయా మూవీ ప్రారంభమైంది. అయితే అంతా అనుకున్నట్టు బంగార్రాజుతో బిజీ కావట్లేదు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ను పట్టాలెక్కించారు నాగార్జున. తెలంగాణ కేబినేట్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ క్లాప్ కొట్టగా…ఈరోజే ముహూర్తపు షాట్ జరుపుకొంది నాగ్ – ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్.

శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ హౌజెస్ కలిసి నిర్మిస్తున్నాయి ఈ చిత్రాన్ని. నారాయణ్ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మారర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించి రెగ్యులర్ షూటింగ్ కూడా వెళ్లిపోనుంది మూవీ యూనిట్.