పెళ్ళి తరువాత వచ్చిన తొలి హోళీని సంతోషంగా జరుపుకున్నారు స్టార్ హీరోయిన్ కాజల్ దంపతులు. భర్తగా కాజల్ కిచ్లూ తన జీవితంలోకి వచ్చాక ఇదే తొలి హోలీ అంటూఆ ముచ్చట్లను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. పెళ్లైన దగ్గర నుంచి ఫుల్ రొమాంటిక్ మోడ్ లో ఉన్న కాజల్…ఇక రంగుల వర్షంలో భర్తో కలిసి తడిసి ముద్దయిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి హోలీ సెలబ్రేషన్స్‌లో హల్చల్ చేసారు. ప్రియాంక చోప్రా – జోనస్, జెనీలియా- రితేష్, శిల్పాశెట్టి, కంగనారనౌత్ వంటి మరికొంతమంది సెలెబ్రిటీలు హోలీని జరుపుకున్నారు. కరోనా కారణంగా పండుగకు దూరంగా ఉన్న ఇంకొంతమంది స్టార్స్..గతంలో ఎంజాయ్ చేసిన హోలీ ఫోటోలను తిరిగి పోస్ట్ చేసారు.

మే 28న…బెల్ బాటమ్
సమ్మర్ సీజన్ లో అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ ను షెడ్యూల్ చేశారు నిర్మాతలు. రంజిత్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మే 28న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

దీపావళి పోరు…
వచ్చే దీపావళికి బాలీవుడ్ సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. షాహిద్ కపూర్ జెర్సీ, అక్షయ్ కుమార్ పృధ్వీరాజ్ సినిమాలతో పాటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆప్నే 2 కూడా అదే రోజు విడుదలకు సిద్ధమైంది.

ఆలియా కూడా…
దివాళి వేళ అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్లతో పాటూ అలియాభట్‌ కూడా రంగంలోకి దిగనుంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆమె నటిస్తోన్న ‘గంగూబాయి కతియావాడి’ సైతం దీపావళికే రిలీజ్ అంటున్నారు మేకర్స్.

ఎఫ్ఐఆర్ నమోదు…
హెల్మెట్ లేకుండా ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టిన వివేక్ ఒబేరాయ్‌పై జుహూ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఐదు వందల రూపాయ‌లు చ‌లానా కూడా విధించారు పోలీసులు.

అమ్మకాల్లో రికార్డ్…
ప్రియాంక చోప్రా స్వయంగా రాసుకున్న ‘అన్ ఫినిష్డ్’ బుక్ అమ్మకాల విషయంలో దుమ్ము రేపుతోంది. ఏకంగా.. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ లో ఆమె ఆటోబయోగ్రఫీ బుక్ స్థానం దక్కించుకుంది.

సలార్ మూవీ మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభాస్ కోసం మాత్రమే ఎక్స్ క్లూజివ్ గా రాసుకున్న సలార్ కథ అద్దిరిపోతుందని రీసెంట్ గా ప్రకటించి మరింత ఇంట్రెస్ట్ పెంచారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. గోదావరిఖని బొగ్గుగనుల్లో షూటింగ్ చేస్తున్న డార్లింగ్ ఫస్ట్ లుక్ కి సైతం విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. అటు శృతీహాసన్ సైతం ఎన్నడూ కనిపించని విధంగా ఉంటుంది నా రోల్ అంటూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతలో ప్రభాస్ సరసన గ్లోబల్ స్టార్ చిందులేస్తారనే వార్తతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు..హాలీవుడ్ లో సైతం సినిమాలు చేస్తూ ప్రపంచం చూపును తనవైపుకు తిప్పుకుంటోది ప్రియాంక చోప్రా. ఇప్పుడు ప్యాన్ ఇండియన్ మూవీ సలార్ లోనూ నటించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ప్రభాస్ సరసన ఓ స్పెషల్ సాంగ్ లో ప్రియాంక కనిపిస్తుందనే న్యూస్ వైరలవుతోంది. అయితే ఈ ట్రెండింగ్ న్యూస్ గురింటి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇదే నిజమైతే దాదాపు 9ఏళ్ల తర్వాత టాలీవుడ్ హీరో పక్కన ప్రియాంక చోప్రాను చూడొచ్చు. గతంలో రామ్ చరణ్ జంజీర్ తెలుగు తుఫాన్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది ప్రియాంక చోప్రా. ఇప్పుడు ప్రభాస్ సరసన అంటుంటే డార్లింగ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.