క్యూట్ గర్ల్ రష్మికా మంధన్నా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో దిల్ రాజు తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా బుక్ అయినట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందట. ఇప్పటికే శంకర్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చటంతో వెంటనే ఓకే చెప్పేసినట్టు టాక్ నడుస్తోంది. అయితే మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా జూలై 15వ తేదీ నుంచి పట్టాలెక్కనుంది.

పొలిటికల్ కథాంశంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారనీ…ఒక దశలో ముఖ్యమంత్రిగా అదరగొడతారన్న న్యూస్ వైరలవుతోంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో చిరంజీవితో పాటూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. కాగా ఇప్పుడు జర్నలిస్ట్ గా రష్మికా పేరు చర్చలోకి వచ్చింది. ప్రస్తుతం రష్మిక పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు, మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో బన్నీ డిపీల హడావిడి కంటీన్యూ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ బర్త్ డేను భారీ లెవల్లో సెలబ్రేట్ చేస్తున్నారు. స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్లు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను విష్ చేస్తున్నారు. మరోవైపు బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజైన పుష్ప గ్లింప్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా ఈ మూవీ నుంచి వదిలిన టీజర్ లో తగ్గేదేలే అంటూ బన్నీ మాస్ పర్ఫామెన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అల్లు అర్జున్ ను ట్విట్టర్ లో విష్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.. పుష్ప టీజర్ చూశానన్న చిరు.. బన్నీ చాలా రియలిస్టిక్ గా చేశాడన్నారు.. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ తగ్గేదేలే హ్యాపీబర్త్ డే అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

స్టైలీష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ అని మరో బిరుదుతో సత్కరించాడు జీనియస్ డైరెక్టర్ సుకుమార్. ఏ క్యారెక్టర్ లో అయినా పరకాయ ప్రవేశం చేయగలడు.. ఆయన ఏది చేసినా యూనిక్ గా ఉంటుంది కాబట్టే బన్నీ ఐకాన్ స్టార్ అన్నారు సుకుమార్. టీజర్ రిలీజ్ వేదికపై సుకుమార్ కు బన్నీ థాంక్స్ చెప్పారు.. ఈ బర్త్ డే రెండు రకాలుగా తనకు స్పెషల్ అన్నారు బన్నీ.. ఒకటి పుష్ప టీజర్ రిలీజ్ అయితే.. రెండోది తనను సుకుమార్ ఐకాన్ స్టార్ ను చేయడం… ఈ సినిమాకు పనిచేసిన అందరికీ బన్నీ స్పెషల్ థాంక్స్ చెప్పారు.

అల్లు అభిమానులుగా ఆయన తలెల్తుకునేలా.. సర్వ శిక్షా అభియాన్‌.. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అన్నదే బన్నీ అభిమతమని చెప్పె విధంగా ప్లాన్ చేశారు ఫ్యాన్స్. గో గ్రీన్‌ విత్‌ అల్లు అర్జున్‌ అన్న హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా డీపీకి జత చేశారు. ఈ సీడీపీని సుమారు 46 మంది సెలబ్రెటీలు రిలీజ్‌ చేశారు.