ఈమధ్యే పుష్పరాజ్ ఫస్ట్ గ్లింప్స్ తో అద్దరగొట్టిన బన్నీ పుష్ప…మరో సంచలనానికి వేదికకానుంది. ‘తగ్గేదే లే’ అంటూ పుష్పరాజ్ భారీ ఫైటింగ్స్ చేయనున్నాడు. మాస్ మసాలా కాన్సెప్ట్ తో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప కోసం యాక్షన్ సీన్స్ ను హై లెవెల్ లో ఫిక్స్ చేసారట. కేవలం యాక్షన్ సన్నివేషాల కోసమే 40కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ మూవీ కావడంతో నిర్మాతలు కూడా ఖర్చు విషయంలో తగ్గేదే లే అంటున్నారట.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న పుష్ప ఆగస్టు 13న రిలీజ్ కానుందని ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా కొన్ని నెలలు వెనక్కి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. గిరిజన యువతిగా రష్మిక నటిస్తోన్న ఈ ప్రాజెక్ట్ లో మలయాళీ హీరో ఫహాద్ ఫజిల్ ప్రతినాయకుడిగా రగిలిపోనున్నారు.

వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ.. తెలుగులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందాన . బాలీవుడ్ భామలు టాలీవుడ్ ని ఏలేస్తున్న ఈ టైమ్ లో కూడా స్టార్ హీరోలతో వరుసగా ఆఫర్లు కొట్టేస్తూ..హీరోలకు ఓన్లీ ఆప్షన్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. అక్కడి భామలు ఇక్కడ చక్రం తిప్పుతుంటే..రష్మిక కూడా నేనేం తక్కువా అంటూ బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు కొట్టేస్తోంది.

సౌత్ లో రష్మిక వరుసగా హిట్లు కొడుతూ మంచి జోష్ లో ఉంది . లాక్ డౌన్ టైమ్ లో స్క్రిప్టులు చదివానన్న రష్మిక వరుసగా సినిమాలు లైన్ లో పెట్టేస్తోంది. మిషన్ మజ్ను టైటిల్ తో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కోవర్టు ఆపరేషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్దార్ద్ మల్హోత్రా సరసన హీరోయిన్ గా నటిస్తోంది రష్మికమందాన. ఈ సినిమాకు సంబందించి అప్పుడే లక్నో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసేసుకుంది ఈ కన్నడ కస్తూరి. ఈ గ్యాప్ లోనే విజయ దేవరకొండతో కలిసి ముంబై రెస్టారెంట్స్ లో కనిపిస్తుంది.

బాలీవుడ్ ఎంట్రీ మీద సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నానని, కొత్త ఆడియన్స్ ని రీచ్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన రష్మిక .. ముంబై లో ఇల్లు కూడా కొనేసింది. బాలీవుడ్ బిగ్ బి కూతురుగా త్వరలోనే నటించబోతుంది. గుడ్ బాయ్ పేరుతో ఈ సినిమా రూపొందనుంది. అంతేకాదు ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ బాలీవుడ్ మూవీకి సైన్ చేసిందని టాక్ . మిషన్ మజ్ను కి సంబందించి షెడ్యూల్ కంప్లీట్ చేసిన రష్మిక .. ఇప్పుడు సుల్తాన్ సినిమా కోసం చెన్నై వచ్చేసింది. ఇక్కడ ఈ రిలీజ్ పనులు అయిపోగానే తన బాలీవుడ్ సెకండ్ వెంచర్ లో జాయిన్ అవుతోందని రష్మిక క్లోజ్డ్ సర్కిల్స్ లో న్యూస్ నడుస్తోంది.

ఎట్టకేలకు పుష్ప విలన్ ఫిక్సయ్యారు. నేషనల్ అవార్డ్ విన్నర్, మలయాళీ స్టార్‌ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ ‘పుష్ప’లో విలన్ గా నటించనున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఇన్నాళ్లు బన్నీకి పోటీనిచ్చే ప్రతినాయకుడు ఎవరా అన్న చర్చ విపరీతంగా జరిగింది. విజయ్ సేతుపతి నుంచి మొదలెడితే ఆర్య, మంచు మనోజ్, సునీల్ శెట్టి ఇలా చాలామంది పేర్లే వినిపించాయి. చివరికి ఫాహద్ ఫాజిల్ బన్నీని ఢీకొట్టే ఛాన్స్ దక్కించుకున్నారు.

ఫాహద్ ఫాజిల్, ఆయన భార్య నజ్రియా అంటే మలయాళంలో చాలా ఫేమస్. కేరళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లు అవుతున్నా…తెలుగులో ఇద్దరూ ఇదే సంవత్సరం ఎంట్రీ ఇస్తున్నారు. బన్నీ పుష్ప సినిమాలో ఫాహద్ విలన్ గా నటిస్తుంటే… నజ్రియా నాని సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. నాని హీరోగా నటిస్తోన్న అంటే సుందరానికి చిత్రంలో నజ్రియానే హీరోయిన్. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

అల్లు అర్జున్ పుష్ప మూవీలో విలన్ గా మంచు మనోజ్ ని సెట్ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ ఈ విషయమై మనోజ్ ని కలిసాడని టాక్. నిజానికి పుష్ప చిత్రంలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించాల్సింది. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక సేతుపత తప్పుకోవడంతో ఆ రోల్ కోసం చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఆర్య అన్నారు. ఆ తర్వాత నారా రోహిత్ తో పాటూ కొంతమంది కన్నడ నటులు వార్తల్లో నానారు. చివరికి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి..పుష్ప విలన్ గా ఫిక్స్ అయ్యారని చెప్పుకొచ్చారు. కానీ చివరికి మళ్లీ మొదటికొచ్చి మంచు మనోజ్ దగ్గర ఆగింది విలన్ టాపిక్.

ఓ వైపు విలన్ లేకుండానే పుష్ప షూటింగ్ శరవేగంగా దూసుకుపోతుంది. ఇంకా సుకుమార్ ప్రతినాయకుడి విషయంలో డైలామాలోనే ఉన్నారు. మరి మంచు మనోజ్ అయినా చివరికి సెట్ అవుతాడా అన్నది చూడాలి. బన్నీ, మనోజ్ మంచి స్నేహితులు. వేదం సినిమాలో ఇదివరకు కలిసి కనిపించారు. ఇక మనోజ్..విడాకులు వంటి వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాకు దూరమయ్యారు. తను చివరిగా నటించిన అహం బ్రహ్మాస్మి విడుదల కావాల్సిఉంది.

ప్రస్తుతం తమిళనాడులోని టెన్‌కాశీలో పుష్ప షూటింగ్ చేస్తోన్న అల్లు అర్జున్ తర్వాతి సినిమా గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. కొరటాల శివ డైరెక్షన్లో అల్లు అర్జున్ కమిటైన మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ దాదాపు ఫిక్సయినట్టే అంటున్నారు. ఇందులో బన్నీ రెండు వేరియన్స్ ఉన్న పాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఒకటి స్టూడెంట్ రోల్, మరొకటి రాజకీయ నాయకుడిగా బన్నీ కనిపిస్తారట. సినిమా ద్వితియార్ధంలో పవర్ఫుల్ రాజకీయ నాయకుడిగా బన్నీ కనిపిస్తే…ఆయన్ని ఢీకొట్టే పాత్రలో పోటాపోటిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్నట్టు టాక్.

క్రాక్, నాంది సినిమాల తర్వాత వరలక్ష్మికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్స్ ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈమధ్యే అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి సైతం వరలక్ష్మిని సంప్రదించారు. ఇప్పుడు బన్నీ మూవీ కోసం సైతం కొరటాల శివ ఆమెతో మాట్లాడినట్టు చెప్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆమె పాత్రపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

చిత్ర పరిశ్రమ చూపు గోదావరి తీరంపై పడింది. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలను షూటింగ్ స్పాట్స్ గా మారుస్తున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్ ముగిసిందో లేదో…మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడక్కడ వాలిపోయారు. ‘ఆచార్య’కు అవసరమైన కరెక్ట్ లోకేషన్స్ అవే అంటూ డైరెక్టర్ కొరటాల శివ అక్కడ స్కెచ్ వేసారు. దాదాపు పుష్ప షూటింగ్ జరిగిన ప్రాంతాల్లోనే ఆచార్య కూడా తిరగనున్నాడు.

నాగచైతన్య నటిస్తోన్న ‘థాంక్యూ’ టీమ్ రాజమండ్రి బాటపట్టింది. ఈ నెలాఖరు నుంచి తూర్పు గోదావరి జిల్లాలో 15రోజుల పాటూ చిత్రీకరణ జరుపునున్నారు డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. చైతూ, మాళవిక నాయర్లపై సీన్స్ షూట్ చేయనున్నారు. అంతేకాదు మిగిలిన నటీనటులతో కూడా థాంక్యూ మూవీ కీలక సన్నివేశాలను గోదావరి తీరంలోనే ప్లాన్ చేసారు దర్శకనిర్మాతలు.

రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి రాజమండ్రి బయల్దేరింది ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను మణిరత్నం గోదావరి నదిపై ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సింగంపల్లి నుంచి పాపికొండలు వెళ్లే మార్గంలో చిత్రీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే షూటింగ్ లో ఏ నటీనటులు పాల్గొంటారనే విషయాన్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.

పుష్ప చెల్లెలిగా…
పుష్ప మూవీలో బన్నీ చెల్లెలిగా సాయి పల్లవి కన్ఫర్మయిందనే ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం మేఘా ఆకాశ్ ఆ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సూర్య 40 షురూ
సూర్య 40 పేరుతో కొత్త సినిమా ప్రారంభమైంది. సూర్య సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాని డైరెక్టర్ పాండిరాజ్ తెరకెక్కించనున్నారు.

మోస్ట్ ట్రెండింగ్ బ్యాచిలర్…
రీసెంట్ గా రిలీజ్ చేసిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీలోని గుచ్చే గులాబీ సాంగ్ 2మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ కార్యాలయంలో సక్సెస్ సంబరాలను జరుపుకుంది మూవీ యూనిట్.

అందాల ‘నిధి’కి గుడి
తమ ఫేవరేట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కి తెలుగు తమిళ ఫ్యాన్స్… చెన్నైలో గుడి కట్టారు. వాలెంటైన్స్ డే రోజున నిధి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజలు చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గుండెల్ని పిండేస్తోంది
ఫిబ్రవరి 14న రిలీజైన ‘నీ చిత్రంచూసి’ లిరికల్సాంగ్తో మళ్లీ ట్రెండింగ్ లోకొచ్చింది శేఖర్ కమ్ముల లవ్ స్టోరి. గుండెల్ని పిండేస్తోందంటూ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు ఈ పాటకి.

అల్లు అర్జున్ పుష్ప సైతం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 13, శుక్రవారంరోజున పుష్పగా థియేటర్లలో అడుపెట్టేందుకు సిద్ధమయ్యారు బన్నీ. తెలుగుతో పాటూ తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ…మొత్తం 5భాషల్లో పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ కాబోతుంది పుష్ప. ప్రస్తుతం రాజమండ్రికి చేరువలోని మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ యూనిట్. ఆపై ఫారిన్ లోకేషన్లలో కూడా షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా చూసుకోవాలనుకుంటున్నారు డైరెక్టర్ సుకుమార్.

రష్మికా మందన్నా హీరోయిన్ కాగా…సాయి పల్లవి బన్నీ చెల్లెలిగా కనిపించనుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే సాయిపల్లవికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ మూవీలో బన్నీ, రష్మికతో పాటూ మొత్తం నటీనటులంతా చిత్తూరు యాసలోనే మాట్లాడనున్నారు. పుష్పరాజ్ పాత్రలో బన్నీని చాలా రఫ్ గా ప్రెజంట్ చేస్తున్నారు సుకుమార్. ఓ సాధారణ కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్గర్ గా హీరో ఎలా ఎదిగాడన్నదే ఈ చిత్రకథాంశంగా తెలుస్తోంది. మరి చూద్దాం మొత్తానికి ఆగస్టు 13న ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ కలిగిస్తుందో పుష్ప టీమ్.

రష్మికా మందన్నా హీరోయిన్ కాగా…సాయి పల్లవి బన్నీ చెల్లెలిగా కనిపించనుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే సాయిపల్లవికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ మూవీలో బన్నీ, రష్మికతో పాటూ మొత్తం నటీనటులంతా చిత్తూరు యాసలోనే మాట్లాడనున్నారు. పుష్పరాజ్ పాత్రలో బన్నీని చాలా రఫ్ గా ప్రెజంట్ చేస్తున్నారు సుకుమార్. ఓ సాధారణ కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్గర్ గా హీరో ఎలా ఎదిగాడన్నదే ఈ చిత్రకథాంశంగా తెలుస్తోంది. మరి చూద్దాం మొత్తానికి ఆగస్టు 13న ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ కలిగిస్తుందో పుష్ప టీమ్.

తూర్పు గోదావరి జిల్లాకు పయనమవుతుంది మెగాఫ్యామిలీ. రంపచోడవరం దగ్గర్లోని మారేడుమిల్లికి పుష్ప షూటింగ్ తో బాగా పేరొచ్చింది. దీంతో వరుస సినిమాలు అక్కడ తెరకెక్కించేందుకు క్యూ కడుతున్నారు ఫిల్మ్ మేకర్స్. అక్కడ షూటింగ్ జరుపుకున్న ‘పుష్ప’ కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో జనవరి 8 నుంచి మళ్లీ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. చిత్ర బృందంతో పాటూ అల్లు అర్జున్ మారేడుమిల్లికి బయల్దేరేందుకు రెడీ అవుతున్నారు.
‘ఆచార్య’ కోసం మెగాస్టార్ సైతం మారేడుమిల్లి అడవులకు వెళ్తున్నారట. చిరూ, చరణ్ కాంబినేషన్ సీన్లను అక్కడే చిత్రీకరిస్తారట. ఆచార్యలో తండ్రికొడుకులు నక్సలైట్లుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… కొరటాల శివ అడవుల్లో షూట్ ప్లాన్ అనడంతో అది నిజమేనన్న సంకేతాలు అందుతున్నాయి. అయితే ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్న చరణ్ పూర్తి గా కోలుకున్నాక…జనవరి నెలాఖర్లో మారేడుమిల్లికి పయనమవుతారని అంటున్నారు. చరణ్ తో పాటూ చిరంజీవి మిగిలిన చిత్రబృందం కూడా తరలివెళ్లనున్నారు.
అయితే చిరూ – చెర్రీల కంటే ముందే బన్నీ మారేడుమిల్లికి చేరుకుంటారు. ఆల్రెడీ అలవాటైన అడవుల్లోకి మామ బావలకు స్వాగతం పలుకనున్నాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టార్ సుకుమార్ హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ గురించి ప్రతిరోజూ ఏదో ఒక న్యూస్ సెన్సెషన్ కావాల్సిందే. ఇప్పుడు కొత్తగా ఇందులోని స్పెషల్ సాంగ్ గురించి రచ్చ జరుగుతుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో కథకి తగ్గట్టు ఓ ఫోక్ బీట్ తో ఐటమ్ నంబర్ ని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ పాటలో స్టెప్పులేసేందుకు బాలీవుడ్ సోయగం దిశాపటానీని సంప్రదించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఏకంగా దిశ రూ.1.5 కోట్లు డిమాండ్ చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

సుకుమార్ సినిమా అంటే దాదపు ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. అది సూపర్ హిట్ కావాల్సిందే. ఆర్యలో అ అంటే అని మొదలెట్టి రింగ రింగ, డియాలో డియాలా అనిపించిన సుక్కు…మొన్నటికి మొన్న పూజాహెగ్దేని జిగేలు రాణిగా ప్రెజెంట్ చేసాడు. ఇక ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ దిశా పటానీతో పుష్పలో డాన్స్ చేయిద్దామంటే అమ్మడు అటకెక్కి కూర్చుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడిన పుష్ప షూటింగ్…త్వరలోనే అరకులో మొదలుకానుంది. మరి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఆ ఫోక్ పెప్పీ పాటలో ఎవరు కనిపిస్తారో చూడాలి.