పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పక్కన కనిపించే చిన్న రోల్ ఆఫర్ చేసినా…ఎగిరి గంతేస్తున్నారు హీరోయిన్స్. ఇప్పుడలాగే ప్రభాస్ రాధేశ్యామ్, సలార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేసే అవకాశాన్ని దక్కించుకొని రెచ్చిపోతున్నారు. ప్రభాస్ నటిస్తోన్న సలార్ కోసం కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి రెడీ అవుతోంది. కెజీఎఫ్ లో హీరోయిన్ గా నటించినా పెద్దగా పేరు రాని శ్రీనిధి…కేజీఎఫ్ 2లో ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి. కానీ ఇంతలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అడిగిన వెంటనే ప్రభాస్ తో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఎస్ చెప్పిందట శ్రీనిధి.

ఇక దాదాపు ఎనిమిదేళ్ల బ్రేక్ తర్వాత టాలీవుడ్‌ లోకి రీఎంట్రీ ఇస్తుంది సిమ్రన్‌ కౌర్‌. ప్రభాస్ రాధేశ్యామ్ లో ఓ ప్రత్యేక పాత్రలో నటించిందట ఈ హీరోయిన్. హీరోయిన్ పూజా హెగ్దే కాకుండా రాధేశ్యామ్ లో ప్రభాస్ ఈ సుందరితో కూడా స్టెప్పులేయనున్నాడు. ఆమధ్య మంచు మనోజ్ హీరోగా వచ్చిన పోటుగాడు….సిమ్రన్ నటించిన చివరి చిత్రం. కాగా రాధేశ్యామ్ అమ్మడికి మళ్లీ గుర్తింపును తీసుకోస్తుందా అన్నది ప్రశ్నగా మారింది.

పిచ్చి కాదు తమది ప్రేమంటుంది పూజా హెగ్దే. ఈ లవ్ స్టోరీ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని ఆమె మాటలవర్షం కురిపిస్తుంది. డార్లింగ్ ప్రభాస్ జోడీగా ఆమె నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. జూలై 30వ తేదీన విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్‌ను మూవీయ యూనిట్ రిలీజ్ చేసింది. ‘రాధేశ్యామ్‌’ తో పాటూ వెంకీ ‘నారప్ప’తో, రవితేజ ‘ఖిలాడీ’తో హల్చల్ చేస్తున్నారు. మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. ‘అన్నం’: పరబ్రహ్మ స్వరూపం అనే పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. టక్ జగదీష్, మోసగాళ్లు, ఇదే మా కథ, గ్యాంగ్ స్టర్ గంగరాజు వంటి సినిమాల నుంచి కూడా మహాశివరాత్రి స్పెషల్ పోస్టర్స్ వచ్చేసాయి.

వరుసగా తన సినిమాల రిలీజ్ డేట్స్ చెప్పేస్తున్నారు ప్రభాస్. షూటింగ్ మొదలవుతుందో లేదో ఆ వెంటనే రిలీజ్ డేట్ ప్రకటించేస్తున్నారు డార్లింగ్ దర్శకనిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన రాధేశ్యామ్ 2021 జూలై 30న రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ సరసన పూజాహెగ్దే హీరోయిన్ లీడ్ చేసిన ఈ సినిమా ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ఫిల్మ్ గా రూపొందింది. కాగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబర్ స్టార్ నటిస్తోన్న సలార్ 2022 ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్నట్టు తాజాగా అనౌన్స్ చేసారు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో వస్తోన్న ఆదిపురుష్ 2022 ఆగస్టు 11న విడుదలే చేస్తామని షూటింగ్ కి ముందే చెప్పేసారు మేకర్స్.

ఇంక డార్లింగ్ సైన్ చేసిన వాటిలో బాకీ ఉంది నాగ్ అశ్విన్ కాంబో మూవీ రిలీజ్ డేట్ మాత్రమే. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్, ప్రభాస్,దీపికా పదుకోనె నటించబోతున్న ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఇవ్వట్లేదు మేకర్స్. ఈమధ్యే జూన్ లేదంటే జూలైలో ప్రభాస్ సినిమా ప్రారంభిస్తామన్నారు నాగ్ అశ్విన్. అయితే ఇది ఓ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ అన్నట్టు మాత్రం తెలుస్తోంది. మరి ఈ మూవీ రిలీజ్ డేట్ బహుశా 2023లో ఉండొచ్చని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఎప్పుడు మొదలెడతారో…ఎప్పుడు రిలీజ్ చేస్తారో ముందు ముందు తెలుస్తుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ కి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ప్రెజెంట్ యూత్ స్టార్ ఐకాన్ మాత్రమే కాదు ప్యాన్ ఇండియన్ రేంజ్ ప్రభాస్ సొంతం. ఇప్పుడు దేశవ్యాప్త అభిమానం డార్లింగ్ సొంతం. అందుకే అమాంతం రేటు పెంచేసారట ప్రభాస్. ఒక్క సినిమాకు 100కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. ప్రస్తుతం పీరియాడికల్ ఫిల్మ్ రాధేశ్యామ్‌, ప్రశాంత్ నీల్ సలార్‌, ఓం రౌత్ ఆదిపురుష్‌ వంటి ఈ హీరో చేస్తున్న సినిమాలన్నీ ప్యాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోయే సినిమాలే.

కథ విని నచ్చితే సైన్ చేయాలంటే…నిర్మాత ప్రభాస్ కి 100 కోట్ల రూపాయలు ముట్టజెప్పాల్సిందే అంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది దర్శకనిర్మాతలు ఖంగుతింటుంటే… మరికొంతమంది మాత్రం ప్రభాస్ కోసం కోట్లు ఇచ్చైనా బుక్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నటిస్తోన్న ఆదిపురుష్‌, సలార్‌ చిత్రాలకు నూరు కోట్లు అందుకున్నారట ప్రభాస్. టాలీవుడ్‌ పరిశ్రమలో ఇంతటి పెద్ద మొత్తం అందుకున్నది కేవలం ప్రభాస్‌ మాత్రమేనని, సౌత్ ఇండస్ట్రీల్లో ఎక్కడా ఇంత భారీ మొత్తాన్ని అందుకున్న హీరోనే లేడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజాహెగ్దే ఎలా ఉండబోతున్నారన్న సస్పెన్స్ కు ఫిబ్రవరి 14తో తెరపడనుంది. అంతేకాదు పూర్తి సినిమాతో వీళ్లిద్దరూ ఎప్పుడు వస్తున్నారో కూడా అదే రోజు తెలిసే ఛాన్స్ కూడా ఉంది. అవును దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న రాధేశ్యామ్ టీజర్ అండ్ రిలీజ్ డేట్ ఈ 14న వాలంటైన్స్ డే కానుకగా విడుదల చేయనున్నారు. రాధేశ్యామ్ మూవీ చిత్రీకరణ దాదాపు పూర్తయినా ఇంతవరకూ ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. అయితే ఈ చిత్రం పీరియాడికల్‌ లవ్‌స్టోరీ కథాంశంగా తెరకెక్కించడంతో ప్రేమికుల రోజునే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. రాధాకృష్ణ డైరెక్షన్లో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథా చిత్రం పాన్ ఇండియన్ మూవీగా 5 భాషలలో విడుదలకు రెడీఅవుతోంది.

యువీ కృష్ణంరాజు సమర్పణలో… యువి క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై వంశీ ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ లవ్ స్టోరీలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే రోల్ లో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణగా మ్యూజిక్ టీచర్‌ రోల్ చేస్తున్నారని టాక్. అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీతో పాటూ సచిన్ కేడ్కర్, సాషా ఛత్రీ, ప్రియదర్శి వంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌ సీన్స్ కోసమే దాదాపు 30 కోట్ల రూపాయల ఖర్చుతో స్పెషల్ సెట్స్‌ వేసినట్టు వార్తలొచ్చాయి. ఇక ఆస్కార్‌ సాధించిన ‘గ్లాడియేటర్‌’ మూవీకి యాక్షన్‌ కొరియోగ్రఫీ సెట్ చేసిన నిక్‌ పోవెల్‌ ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’కి సైతం పనిచేస్తుండటం మరింత ఆసక్తిని పెంచింది.