బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధే. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ మూవీగా ఈ ప్రాజెక్ట్ ను కొరియోగ్రాఫర్ ప్లస్ డైరెక్టర్ ప్రభుదేవా తెర‌కెక్కిస్తున్నాడు. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ హిట్స్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. నిజానికి గతేడాదే రాధే షూటింగ్ పూర్తైంది. కానీ క‌రోనా కారణంగా రిలీజ్ వాయిదా ప‌డింది. తాజాగా మూవీ మేక‌ర్స్ రాధే మూవీ విడుదల తేదీని ప్ర‌క‌టించారు. ఈద్ పండుగ సందర్భంగా మే 13న రాధేను ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్రకటించారు,
అయితే మే 13న చిరంజీవి, చరణ్ నటిస్తోన్న ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ‘రాధే’ కూడా అదే రోజున రాబోతుంది. ఆచార్య ఎలాగూ తెలుగు ప్రేక్షకుల మీదే దృష్టిసారించింది. చిరూకి ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు. ఎటొచ్చి ఇక్కడ సల్మాన్ కి చుక్కెదురయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. దిశాప‌టానీ హీరోయిన్ గా నటిస్తున్న రాధేలో ర‌ణ్ దీప్ హుడా, మేఘా ఆకాష్, జాకీ ష్రాఫ్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు.