1990 మే 9న జగదేకవీరుడు అతిలోకసుందరి విడుదలై ఎన్నో ప్రభంజనం సృష్టించింది ఆ రోజుల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చూడని వాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు అన్న మాట అతిశయోక్తి కాదు అశ్వినీ దత్ అప్పటికే గొప్ప నిర్మాత ఎన్టీఆర్ జగదేకవీరుని కథ లాంటి ఫాంటసి స్క్రిప్ట్ చేయాలని అశ్వినీ దత్ కి కోరిక ఉండేది అది కూడా చిరంజీవి గారితో చేయాలనుకున్నారు తను బావా అని పిలుచుకునే రాఘవేంద్రరావుగారు అయితేనే ఇలాంటి కథకి న్యాయం చేయగలరని ఎప్పటినుంచో అనుకుంటూ ఉండే వారు ఆఖరి పోరాటం తర్వాత చిరంజీవి గారితో సినిమా అనుకున్నారు అశ్వినీదత్ అశ్వినీ దత్ గారికి క్లోజ్ ఫ్రెండ్ అయినా రచయిత మరియు సహ దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తిని రాఘవేంద్ర రావు గారితో తిరుమలకు పంపించారు అశ్వినీదత్ గారు సరిగ్గా ఇద్దరు తిరుమల కొండ పైన ఉండగా అశ్వినీదత్ గారి మనసు తెలిసిన శ్రీనివాస్ చక్రవర్తి దేవకన్య భూమి మీదకు వచ్చినప్పుడు ఆమె ఉంగరం పడిపోయింది అది చిరంజీవి గారికి దొరికింది అని ఒక చిన్న లైన్ చెప్పారు అది రాఘవేంద్ర రావు గారికి బాగా నచ్చేసింది దత్త గారి కల కు దగ్గరగా ఉండడంతో దత్తు గారు కూడా బాగానే చేసింది రచయిత శ్రీనివాస చక్రవర్తి ఇచ్చిన చిన్న ఐడియా నీ పట్టుకుని యండమూరి వీరేంద్రనాథ్ గారు జంధ్యాల గారు సత్య మూర్తి గారు దివాకర్ బాబు గారు క్రేజీ మోహన్ గారు తదితర దిగ్గజాలు అందరూ కలిసి ఒక మంచి బౌండ్ స్క్రిప్ట్తో రెడీ చేశారు చిరు కూడా తనకి సమయం దొరికినప్పుడల్లా తనదైన సజెషన్స్ ఇస్తూ ఉండేవాడు మరి జగదేకవీరుడు కి జోడిగా అతిలోక సుందరి ఎవరు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో పడింది అప్పుడు అందరి మదిలో మెదిలింది వైజయంతి బ్యానర్ ఆస్థాన కథానాయిక శ్రీదేవి గారే అందరి మదిలో మెదిలే రు శ్రీదేవి గారికి కథ చెప్పారు ఆవిడ కూడా ఓకే క్రేజీ కాంబినేషన్ సెట్ అయిపోయింది ఈ ఫిలిం స్టార్ట్ చేసే టైం కి చిరంజీవి గారు విపరీతమైన ఫామ్లో ఉన్నారు కానీ రాఘవేంద్రరావు గారు మాత్రం ఫ్లాపుల్లో ఉన్నారు నాగార్జున అగ్ని వెంకటేష్ ఒంటరి పోరాటం రెండు ఫ్లాపులు చిరంజీవి గారికి రుద్రనేత్ర యుద్ధభూమి ఇలాంటి ఎన్నో ఫ్లాపులు ఇచ్చారు ఇండస్ట్రీ జనాలు మొత్తం అశ్వినీదత్ గారిని చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నామని అందరూ హెచ్చరించారు కానీ అడవి రాముడు వంటి ఇ ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చి గ్లామర్ నేర్పించిన గురువు మీద అప్ప నమ్మకమా ఛాన్సే లేదు చాలా ధైర్యంగా దత్తు గారు ముందుకు పసిడి పోయారు స్క్రీన్ ప్లే మొత్తం రాశాక అసలు కథ మొదలైంది అదే సెట్లు స్పెషల్ గా ఈ సినిమా కోసం ఏడు సెట్లు వేశారు ఈ కథ కోసం ఈ కథలో ఏం తేడా కొట్టిన దత్త గారి కెరియర్ అతలాకుతలం అయిపోతుంది తన కెరియర్ మళ్లీ నీ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అయినా తగ్గించేశారు ఈ ఫిలిం కోసం తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా హిమాలయ సెక్స్ వేశారు ఆ టైంలో ఇటువంటి షర్ట్ సినీ చరిత్రలో ఎవరూ వేయలేదు అదే టైంలో దర్శక నిర్మాత అయిన నాగిరెడ్డి గారు అక్కడికి వచ్చి ఆ సెట్ లో చూసి ఆశ్చర్యపోయారు అశ్వినీదత్ ని పిలిచి నీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే నేను నేను సెట్ సూపర్వైజర్ చేస్తాను నీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పు అన్నారు దత్తు గారు చాలా ఆనందపడ్డారు అటు కాస్ట్యూమ్స్ కూడా చాలా కేర్ తీసుకోవాలి ఎందుకంటే చిరంజీవి గారు ఒక సాధారణ వ్యక్తిగా చూపిస్తూనే ప్రజలకు కావాల్సిన ఎలివేషన్స్ చూపించాలి బొంబాయిలో లో స్వయంగా డిజైన్ చేయించుకుంటున్నారు శ్రీదేవి గారు తను కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు


విలన్ గా అమ్రిష్ పురి ఫిక్స్ చేశారు కన్నడ నుంచి ప్రభాకర్ గారు తెలుగు గురించి అంకుశం రామిరెడ్డి గారు తనికెళ్ల భరణి గారు ఇంకా విలన్ గ్యాంగ్ భారీగా సెట్ చేశారు కామెడీ ట్రాక్ కోసం ప్రత్యేకంగా తమిళం నుంచి జనక రాజు గారిని తీసుకొచ్చి అల్లు రామలింగయ్య బ్రహ్మానందం గార్లకు జోడించి కామెడీ ట్రాక్ రాసుకున్నారు దిన కు తా సాంగ్లో 103 జ్వరంతో చిరంజీవి గారు డాన్స్ చేసి సాంగ్ అయిపోయాక మూడు రోజులు ఆసుపత్రిలో ఉన్నారు అంత డెడికేటెడ్ గా టీమ్ మొత్తం వర్క్ చేశారు
1990 మే 9 వచ్చేసింది ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే చాలు అనుకున్నా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకి డిస్టింక్షన్ మార్కులు ఇచ్చేశారు అయితే ఈ సినిమాకు మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చింది ఎవరైనా నమ్ముతారా నమ్మాలి ఎందుకంటే భారీ వర్షాలతో కూడిన తుఫాను రాష్ట్రాలన్నీ ముంచేసింది ఆ టైంలో వర్షాల వల్ల కొన్ని థియేటర్లలో ప్రింట్లు ఆలస్యంగా చేరుకున్నాయి ఇప్పట్లా డిజిటల్ టైం కాదు కదా ప్రతి బాక్స్ ఆలస్యంగా చేరుకున్నాయి రైల్వే ట్రాక్ లు పాడైపోయిన చోట రైళ్లు ఆలస్యంగా బయలుదేరాయి ఇటుపక్క డిస్ట్రిబ్యూటర్లు కంగారులో ఉన్నారు కొన్ని ఊర్లోఆటలు మొదలై పోయాయి ఇంకొన్ని చోట్ల మధ్యాహ్నం నుంచి అని బొట్లు పెట్టేశారు మొదటి మూడు రోజులు ఫ్లాప్ టాక్ తో స్టార్ట్ అయ్యే నాలుగో రోజు నుంచి జగదేకవీరుడు ప్రభంజనం మొదలైంది అది ఎలాంటి ప్రపంచం అంటే శ్రీకాకుళంలోని థియేటర్లో జనాలు ఒక వైపు నుంచి సినిమా చూస్తూ ఉంటే గొడుగు పట్టుకుని అక్కడ పడుతున్న వర్షానికి ఒక వైపు నుంచి ఫైరింజన్ తో ఆ లోపల ఉన్న నీళ్లను తోడంట అంత అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు ఇళయరాజా సాంగ్స్ మెగాస్టార్ పర్ఫామెన్స్ సూపర్ శ్రీదేవి అందంతో మెస్మరైజ్ చేసింది ప్రొడ్యూసర్ గా అశ్వినీ దత్ ఎప్పుడు చూడని కలెక్షన్ చూసాడు ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి స్టార్స్ తిరిగిపోయాయి అలా నేటికి కూడా జగదేకవీరుడు అతిలోకసుందరి అంటే అదే ఉత్సాహాన్ని అభిమానులు చూపిస్తారు

అబ్బే నాగార్జున గారికి ఏమైందండీ నిన్నే పెళ్ళాడతా లాంటి బ్లాక్బస్టర్ లు సాధించాక ఈ భక్తి చిత్రాలు అవసరమా…
ఇదేమైనా ఎన్టీఆర్ కాలమా…
కొడుక్కి నాన్న భక్త తుకారాం ఏమైనా గుర్తుకు వచ్చిందేమో 😀…
ఇంత అందగాడైన నాగార్జునతో కమర్షియల్ ఫిలిం చేయకుండా రాఘవేంద్ర రావు గారు ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నట్టు…… పెళ్లి సందడి తో వచ్చిన పేరుని రిస్క్ లో పెడుతున్నట్టు ఉన్నారు… దొరసాని రాజుగారుకి ఎంత వెంకన్న మీద భక్తి ఉంటే మాత్రం ఇలాంటి సాహసానికి పూనుకుంటారు

అన్నమయ్య సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఫస్ట్ కాపీ వచ్చే వరకు ఇండస్ట్రీలో ఇలాంటి కామెంట్స్ చాలానే వినిపించాయి…. అందులో నిజం లేకపోలేదు

ప్రేమ దేశం లాంటి ట్రెండ్ లవ్ స్టోరీస్ ఒకవైపు ప్రేమాలయం లాంటి కుటుంబ కథా చిత్రాలు ఒకవైపు ఉదృతంగా సాగుతున్న టైం లో ఇలాంటి ప్రయత్నం అంటే ఎవరికైనా సవాలక్ష అనుమానాలు వస్తాయి దీనికి కూడా అదే జరిగింది పైగా అన్నమయ్య రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు ఇందులో ఆయనకు మీసాల పెడుతున్నారు జనం ఒప్పుకుంటారా అప్పటిదాకా ఇలాంటి వేషభాషలకు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కేరాఫ్ అడ్రస్గా నిలిచారు బ్లాక్ అండ్ వైట్ జమానా ముగిశాక నాగేశ్వరరావు గారు సైతం ఒకటి రెండు తప్ప ఇలాంటి భక్తిరస చిత్రాలు చేయడం మానేశారు అలాంటి సమయంలో అన్నమయ్య అనే మహా యజ్ఞానికి పూనుకున్నారు దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు.
రచయిత జై కె భారవి ఎన్నో ఏళ్ళు తపస్సు లాగా స్వీకరించి తాళ్ళపాక అన్నమయ్య గురించి సేకరించిన గాధలు పుస్తకాలు వివరాలు తదితరాలు ఎన్నింటి ను ఆధారంగా చేసుకుని ఈ స్క్రిప్ట్ను రాసుకున్నారు తొలుత కొన్ని ప్రయత్నాలు చేసినా కానీ అంత సేపు తల ఊపిన కొందరు నిర్మాతలు తీరా హీరో బడ్జెట్ లాంటి లెక్కల దగ్గరికి వచ్చేసరికి భయపడి వెనకడుగు వేశారు…

News18 Telugu - నాగార్జున అక్కినేని కే రాఘవేంద్ర రావు కాంబినేషన్‌‌లో వచ్చిన  సినిమాలు ఇవే.. | Tollywood hero Nagarjuna Akkineni director k raghavendra  rao super hit combination in telugu film ...


నాగార్జున కథ విన్నారు అప్పటికే ప్రయోగ అర్జునుడిగా పేరున్న ఆయనకు అన్నమయ్య బ్రహ్మాండంగా నచ్చేసింది ఎటొచ్చి రాఘవేంద్ర రావు గారు మాత్రమే కొంచెం టెన్షన్ గా ఉన్నారు గొప్ప పేరు తీసుకొస్తుంది కానీ అంత డబ్బు తీసుకువస్తుందా అన్న భయం …. దానికి నాగార్జున అభయమిచ్చారు ఇది డబ్బులు కూడా తీసుకొస్తుంది మీరు నమ్మండి అన్నారు ఏం భయం లేకుండా ముందుకు వెళ్దాం అని ప్రోత్సహించారు… నాన్న ఏఎన్నార్ తో కూడా చర్చించి ఆయన సానుకూలంగా స్పందించక నిర్ణయం తీసుకున్నారు గ్లామర్ హీరోయిన్ గా అంత ఎత్తుకు ఎదిగిన రమ్యకృష్ణని పెద్దగా స్టార్డం లేని కస్తూరిని నాగార్జున సరసన తీసుకున్నారు తన ఆస్థాన విద్వాంసులు ఎం ఎం కీరవాణి మీద తప్ప రాఘవేంద్ర రావు గారికి ఇంకా ఎవరి మీద నమ్మకం లేదు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు కొన్ని వందల కీర్తనలలో ఏది తీసుకోవాలో తెలియని సందిగ్ధం. జనంలో అప్పటికే బాగా నాటుకుపోయిన అన్నమాచార్య కీర్తనలునే ట్యూన్ల గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కీలకమైన శాలువా నరసింహారావు పాత్రకు మోహన్ బాబు సరే అన్నారు. కాస్టింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అందరు సీనియర్లనే తీసుకున్నారు. చిన్న పెద్ద అన్ని కీర్తనలు పాటలు కలిసి 20 ట్రాక్ అయ్యాయి ఏది తీసేయ్ కూడదని ముందే అనుకున్నారు ఆడియో హక్కులు కొన్నా టి సిరీస్ కంపెనీ క్యాసెట్లను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు .
షూటింగ్ మొదలైంది నాగార్జున ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని కమర్షియల్ సన్నివేశాలను జోడించక తప్పలేదు అందులో భాగంగానే ఇద్దరు మరదళ్లతో డ్యూయెట్ పాట ఫస్టాఫ్లో పెట్టేశారు… మోహన్ బాబు అభిమానుల కోసం జోడిగా నటించిన రోజాతో ఒక యుగళగీతం రెండో సగంలో పెట్టుకుంటారు నిర్విరామంగా షూటింగ్ సాగిపోయింది…. అలా అని కామెంట్లు ఆగిపోలేదు కమర్షియల్ సినిమాకు స
సెట్ చేసుకున్నట్టు ఏంటి ఇ కాంబినేషన్ అన్న వాళ్లు లేకపోలేదు..
వర్కింగ్ స్టిల్స్ నాగార్జున గెటప్ మీద చాలా విమర్శలు వచ్చాయి చరిత్రను వక్రీకరిస్తున్నారని కొందరు గగ్గోలు పెట్టారు ఇవన్నీ పట్టించుకోకుండా సినిమా మీదే దృష్టిపెట్టారు యూనిట్ సభ్యులంతా..
నిర్మాత దొరస్వామిరాజు గారు లెక్కకు మించి ఖర్చు పెడుతున్నారు అయినా భయపడటం లేదు నమ్మిన వెంకన్న… నమ్మించిన రాఘవేంద్రరావు… మీద నమ్మకంతో ముందుకు పోతున్నారు
టి సిరీస్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి వెళ్ళింది….. బాగానే అమ్ముడుపోతున్నాయి

Source: Volga

కమర్షియల్ సినిమా కానందున బయ్యర్లు ఈ సినిమాని భారీ మొత్తంలో కొనుక్కోవడానికి సిద్ధపడలేదు…. నిర్మాత అతిగా ఆశపడే లేదు స్వతహాగా పెద్ద డిస్ట్రిబ్యూటర్ కావడంతో పంపిణీ నీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నమయ్య థియేటర్లలో విడుదలైంది
మొదటి రెండు రోజులు మిక్స్ డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత సాధారణ ప్రేక్షకులు అన్నమయ్య సినిమా చూడడానికి రావడం మొదలు పెట్టారు చాలా కాలం తర్వాత సినిమా హాల్లో భక్తి పారవశ్యాన్ని అనుభవించడం చవిచూశారు

తెలుగువారికి అమిత ప్రీతిపాత్రుడైన వెంకటేశ్వర స్వామి మీద ఓ భక్తుడు చేసిన సంతకాన్ని చూసి తనివితీరా పునీతులయ్యారు ప్రేక్షకులు…..

థియేటర్ దగ్గరికి కుటుంబాలు తరలి వస్తున్నాయి టిక్కెట్ల కోసం బారులు తీరుతున్నారు జనాలు హౌస్ఫుల్ బోర్డ్ లకు నిరంతరం పని పడింది….

ఆడియో రేట్లు కోరుకున్న టి సిరీస్ కంపెనీ 10 లక్షల ఆడియో క్యాసెట్ లను అందింది ఆశ్చర్యపోయారు టి సిరీస్ అధినేతలు ఇళ్లల్లో గుళ్ళల్లో ఆఖరికి టీ కుట్లు లో కూడా ఇవే పాటలు…

నాగార్జునకి ఈ సినిమా ద్వారా ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డు తన నటనకి చిన్నదే అవుతుందన్న మాట అతిశయోక్తి కాదు

మాస్ మసాలా సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో అన్నమయ్య లాంటి చిత్రం 42 కేంద్రాల్లో వంద రోజులు రెండు సెంటర్లో సిల్వర్ జూబ్లీ ఆగడం చరిత్రను తిరగరాసింది….