మళ్లీ బిజీగా మారుతున్నారు రాశిఖన్నా. మారుతి రమ్మన్నా గోపీచంద్ వద్దన్నారని…ఇక రాశికి అవకాశాలు కష్టమని ఇలా నిన్నటివరకు ప్రచారం జరిగింది. అయితే ఆల్రెడీ కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న రాశిఖన్నా తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల్లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్నారు.
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ సరసన ఓ సినిమా చేసేందుకు రెడీఅయ్యారు. రాజ్ అండ్ డికె డైరెక్షన్ లో ఓ ఒరిజినల్ ఓటీటీ కోసం షాహిద్, రాశి ఖన్నా జతకడుతున్నారు.
ఇక తెలుగులో హవా తగ్గిందనుకునే టైమ్ లో మళ్లీ సాయి ధరమ్ తేజ సరసన ఛాన్స్ కొట్టేసారు రాశి ఖన్నా. సుకుమార్ శిష్యుడు డెబ్యూ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్న చిత్రంలో తేజ్ జోడిగా రాశి కనిపిస్తారట. ఇదే నిజమైతే వీరిద్దరి కాంబినేషన్ కిది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. సుప్రీం, ప్రతిరోజు పండగే సినిమాల తర్వాత ఈ సినిమా ద్వారా మెగా కంపౌండ్ లోకి రాశి మళ్లీ అడుగుపెట్టబోతుంది.