అక్కినేని కుటుంబానికి అసలైన కోడలుగా…మామకు తగ్గ కోడలుగా పేరు తెచ్చుకుంటున్నారు సమంతా. నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని ఫ్యామిలీలో భాగమైన సమంతా…మ్యారేజ్ తర్వాత బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఓ వైపు తన కెరీర్ కొనసాగిస్తూనే…తన ఫ్యామిలీ కోసం కావలిసినంత కష్టపడుతున్నారు. ఆస్తుల విషయంలో చైతూను మించినా..ఎన్నడూ శృతిమించలేదు. నటనతో పాటూ యాంకరింగ్, యాడ్స్, వెబ్ సిరీస్, బిజినెస్ ఇలా తనకు చేతనైనంత కూడబెట్టడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు.

ఓవైపు భర్త నాగచైతన్య విజయం కోసం శ్రమిస్తూనే…తాజాగా మరిది అఖిల్ సక్సెస్ కోసం బాధ్యతను ఎత్తుకున్నారు. అందులో భాగంగానే తాను వర్క్ చేసిన ఫ్యామిలీ మెన్ -2 డైరెక్టర్లకి అఖిల్ ని రిఫర్ చేసారని తెలుస్తోంది. తెలుగులో ఢీ ఫర్ దోపిడి సినిమా చేసి సక్సెస్ కాలేదు కానీ ఫ్యామిలీ మెన్ సిరీస్ తో ఆకట్టుకుంటున్నారు రాజ్, డికె. వీరిప్పుడు పాన్ ఇండియా వైడ్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా హీరోగా అఖిల్ అయితే బాగుంటాడని సామ్ ఒప్పించారని టాక్.

ఇక, సామ్‌… వెబ్‌ సిరీస్‌ ఫ్యామిలీ మెన్‌ -2 అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో రిలీజ్ కి రెడీఅయింది. జనవరి 19న విడుదలకాబోతున్న ట్రైలర్ కోసం జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో సామ్ విలన్ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. ఓ టెర్రరిస్ట్ గా సమంతా నటించిందని చెబుతున్నారు. అందుకే ట్రైలర్ తో పాటూ రివీల్ కాబోతున్న సామ్ లుక్ కోసం అందరిలో ఇంట్రెస్ట్ పెరిగింది