పెద్ద హీరోలతో సినిమాలు చేస్తేనే ఇమేజ్ పెరుగుతుంది, ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండొచ్చు అనే కాన్సెప్ట్ కి చెక్ పెడుతున్నారు హీరోయిన్లు. ఒక వైపుసీనియర్లతో సినిమాలు చేస్తూనే యంగ్ హీరోలతో కూడా పెయిర్ అప్ అవుతున్నారు. లేటెస్ట్ గా లేడీ సూపర్ స్టార్, సౌత్ లోని అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో సినిమా చేస్తోంది. యు.వి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిఫరెంట్ జానర్ లో రాబోతోంది.
మరో స్టార్ తమన్నా ఒక వైపు స్టార్ హీరోస్ తోకనిపిస్తూనే నితిన్ తో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాదూన్ రీమేక్ చేస్తోంది. మరో వైపు ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో మంచి సినిమాలు చేస్తున్న యంగ్ అప్ కమింగ్ హీరో సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం ..అనే సినిమా చేస్తోంది.
సౌత్ లో సూపర్ హీరోలందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇప్పుడు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ఉప్పెన తో సూపర్ హిట్ కొట్టిన వెరీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తో జతకడుతోంది ఈ ముద్దుగుమ్మ. క్రిష్ డైరెక్షన్లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది.
సౌత్ లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన కాజల్ .. ఒక వైపుమెగాస్టార్ తో ఆచార్య, సూపర్ స్టార్ కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమాలు చేస్తూనే..మిడిల్ రేంజ్ హీరో మంచు విష్ణుతో మోసగాళ్లు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
బాలీవుడ్ లో పాటు టాలీవుడ్ లో కూడా బిజీ అయిపోయిన ముద్దుగుమ్మ పూజాహెగ్డే. స్టార్ హీరోలతోసినిమాలు చేస్తూనే యంగ్ హీరోల్ని కూడా కవర్ చేస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరో అయిన ప్రభాస్ తో రాధేశ్యామ్, సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాలీ సినిమాలు చేస్తూనే యంగ్ హీరో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేస్తోంది పూజాహెగ్డే.
అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన లావణ్య త్రిపాఠి కూడా యంగ్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ తో చావు కబురు చల్లగా సినిమా చేస్తోంది. ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.

తొలి సినిమాతోనే 100కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించిన మెగాఫ్యామిలీ స్టార్ పంజా వైష్ణవ్ తేజ్…వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ కాంబినేషన్లో చేస్తోన్న మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. అంతేకాదు వైష్ణవ్‌ తన మూడో చిత్రానికి కూడా సంతకం చేశాడాని సమాచారం. మనం ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కొత్త డైరెక్టర్ తో..ఈ హీరో నెక్ట్స్ సినిమా పట్టాలెక్కనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇవే కాదు ప్రొడ్యూసర్ బీవీ ఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించే మరో చిత్రానికి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇలా వరుస కమిటెమెంట్లతో వైష్ణవ్ ఓ పక్క బిజీగా మారుతుంటే…మరోవైపు ఈ మూవీ డైరెక్టర్, కథానాయిక కృతి శెట్టిని కూడా క్రేజీ దర్శకనిర్మాతలు సంప్రదిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.