క్యూట్ గర్ల్ రష్మికా మంధన్నా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో దిల్ రాజు తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా బుక్ అయినట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందట. ఇప్పటికే శంకర్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చటంతో వెంటనే ఓకే చెప్పేసినట్టు టాక్ నడుస్తోంది. అయితే మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా జూలై 15వ తేదీ నుంచి పట్టాలెక్కనుంది.

పొలిటికల్ కథాంశంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారనీ…ఒక దశలో ముఖ్యమంత్రిగా అదరగొడతారన్న న్యూస్ వైరలవుతోంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో చిరంజీవితో పాటూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. కాగా ఇప్పుడు జర్నలిస్ట్ గా రష్మికా పేరు చర్చలోకి వచ్చింది. ప్రస్తుతం రష్మిక పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు, మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఎప్పటినుంచో చిరూ, చరణ్ లను ఒకే సినిమాలో చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నంబర్ 150 వంటి సినిమాల్లో ఏదో కొద్ది సేపు మాత్రమే కలిసి కనిపించారు తండ్రీకొడుకులు. అయితే ప్యాన్స్ కలను నిజం చేస్తూ తండ్రి ఆచార్యగా కనిపిస్తోన్న సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నాడు రామ్ చరణ్. అయితే అభిమానులు ఈ ఇద్దరినీ ఇంకా స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయకముందే మరో మెరుపులాంటి వార్త చక్కర్లుకొడుతుంది.

శంకర్ – చరణ్ – దిల్ రాజు కాంబినేషన్ సినిమా గురించి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్ లో చిరంజీవి కూడా భాగమవుతున్నారనే వార్త హైలైట్ గా మారింది. గతంలో శంకర్ దర్శకత్వంలో నటించాలనే కోరికను వ్యక్తం చేసారు చిరంజీవి. దానిని నిజం చేస్తూ కొడుకును డైరెక్ట్ చేస్తోన్న చిత్రంలో చిరూకి ఓ మెగా రోల్ ఆఫర్ చేసారట డైరెక్టర్ శంకర్. 100కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న దిల్ రాజు కూడా సినిమా హైప్ పెచ్చేందుకు నిజంగానే చిరూని తీసుకొచ్చినా ఆశర్చపోనవసరం లేదంటున్నారు. మరి ఏదేమైనా అధికారిక ప్రకటన వస్తే ఇక ఫ్యాన్స్ ను ఆపడం ఎవరితరం కాదు.

సెన్సేషనల్ డైరెక్టర్, మెగాపవర్ స్టార్ కాంబోమూవీపై గతకొన్నిరోజులుగా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. 100కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఫిక్సయ్యారు. అయితే తమన్ క్రేజీ మ్యూజిక్…శంకర్-రెహమాన్ కాంబోని మరిపించగలదా అన్న డౌట్స్ ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ఎందుకంటే శంకర్ సినిమాలు దాదాపు ఏ.ఆర్.రెహమాన్ సంగీతంలోనే వచ్చాయి. అపరిచితుడు, స్నేహితుడు సినిమాలో హరీష్ జైరాజ్ సంగీతంలో రాగా…ఇండియన్ 2 కోసం అనిరుథ్ రవిచంద్రన్ ను తీసుకున్నారు. ఇప్పుడిక చరణ్ మూవీకోసం తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

రెహమాన్ తో సంగీతం అంటే కాస్త టైం పడుతోంది. తనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కంపోజ్ చేస్తారు. కానీ ఇక్కడ నిర్మాత దిల్ రాజు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తమన్ అయితే బెటర్ ఆప్షన్ అని ఆలోచించారట. అందుకే శంకర్ లైన్ లోకి తమన్ వచ్చిపడ్డారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పై స్టే విధించాలని భారతీయుడు -2 నిర్మాతలు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. అయితే కోర్టు శంకర్ కు స్టే విధించకుండా సమాధానం చెప్పాలని మాత్రం ఆదేశించింది. దాదాపు 180కోట్లు ఖర్చుపెట్టి, 40కోట్లకు గానూ 16కోట్ల పారితోషికం తీసుకొని మధ్యలో భారతీయుడుని వదిలేయడం పద్ధతి కాదన్నది నిర్మాతల వాదన. మరి శంకర్ ఏం చెబుతాడో చూడాలి.

[3:41 pm, 02/04/2021] Content Water@sree Harash(Ntv: కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ నటిస్తోన్న రాజమౌళి పాన్‌ ఇండియా మూవీ ఊహించని ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది. ఓ రకంగా ఇండస్ట్రీ వర్గాల్లో ఇది షాకింగ్ విషయమే. తాజాగా అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ థియేట్రికల్‌ రైట్స్ ఏకంగా 570 కోట్ల రూపాయలు, డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్ పేరిట మరో 300 కోట్ల రూపాయలు వచ్చాయని టాక్. బాలీవుడ్‌ సంస్థ ‘పెన్ స్టూడియోస్’ ఈ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ తో పాటూ ఇండియన్ లాంగ్వేజెస్ డిజిటల్, శాటిలైట్, ఎలక్ట్రానిక్ హక్కులను దక్కించుకుంది. 400కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ…ఇప్పుడు దాని రెట్టింపుకు మించి ప్రీరిలీజ్ చేస్తుండటం అందరికీ షాక్ ఇస్తోంది.

ఆంధ్రా, నైజాం ఏరియాలో రూ. 240 కోట్లు, బాలీవుడ్ లో రూ.140 కోట్లు, కోలీవుడ్ లో రూ.48 కోట్లు, కర్ణాటక రాష్ట్రంలో రూ.45 కోట్లు, కేరళ పరిశ్రమలో రూ.15 కోట్ల వరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిందట. అటు ఓవర్సీస్‌లో ఏకంగా రూ.70 కోట్లకు త్రిపుల్ ఆర్ రైట్స్ అమ్మేసినట్టు చెప్తున్నారు. మ్యూజిక్‌ హక్కుల కోసం ఇంకా రూ.20 కోట్లు రాబట్టినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే త్రిపుల్ ఆర్ బిజినెస్‌ దాదాపు 900 కోట్ల రూపాయలను టచ్ చేసింది. గతంలో బాహుబలి బంపర్ హిట్ తర్వాత ‘బాహుబలి 2’కు రూ.500 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరగింది. ఇప్పుడా రికార్డ్ ను మళ్ల రాజమౌళి సినిమానే బ్రేక్ చేసింది. ఇంతవరకు ఏ తెలుగు సినిమాకు జరగని ప్రీ రిలీజ్ బిజినెస్ ఇది.
[3:52 pm, 02/04/2021] Content Water@sree Harash(Ntv: తలైవి గురించి సమంతా కామెంట్స్

హీరోయిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి తలైవి జయలలిత గురించి కామెంట్ చేసింది సమంతా. తాజాగా కంగనా తలైవిగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి పాటను రిలీజ్ చేసింది సామ్. టీ సిరీస్ ద్వారా హిందీ, తెలుగు, తమిళ్ మూడు భాషల్లో మూడు లింక్స్ షేర్ చేసిన సామ్…అమ్మ గ్రేస్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎవరూ మ్యాచ్ చేయలేరు. సినిమా నుంచి సిఎం దాకా ఆమె జీవితాన్ని తెలుసుకోండి అంటూ పోస్ట్ చేసింది సమంతా. కాగా కెఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 23న రిలీజ్ కానుంది.

లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది ట్రిపుల్ ఆర్ . యాక్షన్ షూట్ తోపాటు ప్యాచప్స్ కంప్లీట్ చేస్తున్న RRR సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో కంటిన్యూ అవుతోంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ,బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబయ్ సెట్స్ లో జరుగుతోంది. విజయ దేవరకొండ సైతం ఇప్పట్లో ముంబై వదిలి వచ్చేలా లేడు. లైగర్ షూటింగ్ ఇంకా ముంబైలోనే చేస్తున్నారు పూరీ జగన్నాథ్.

చెర్రీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ట్రీట్ ఇచ్చిన చిరంజీవి ఆచార్య టీమ్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉంది. ఏప్రిల్ 2 నుంచి ఆచార్య సినిమా కోకాపెట్ లో మళ్లీ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ బెల్గాం ఆశ్రమంలో జరుగుతుంటే, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున నటిస్తోన్న సినిమా గోవాలో జరుగుతుంది. ఇక రామానాయుడు స్టూడియోలో శరవేగంగా దృశ్యం -2 షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు వెంకటేశ్.

మహేశ్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ గోవాలో జరుగుతుండగా… ఇటలీలో ఖిలాడీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు రవితేజ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబో పుష్ప సీన్స్ ను టోలీచౌకిలో చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ గని సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో కొనసాగుతుంది. సాయిధరమ్ తేజ్, దేవా కట్టా సినిమా రిపబ్లిక్ షూటింగ్ కూడా హైదరాబాద్ లోకల్ లొకేషన్స్ లోనే జరుగుతుంది.

సినిమాలతోనే కాదు స్టేటస్ విషయంలోనూ పోటీపడుతున్నారు మన తెలుగు హీరోలు. మొన్నీమధ్యే లంబోర్గిని కార్ ను ఎన్టీఆర్ ఇటలీని నుంచి తెప్పించుకుంటే…దానికి మించి అన్నట్టు ప్రభాస్ మరో డూపర్ కార్ ను గ్యారేజ్ లోకి దించేసారు. రెమ్యూనిరేషన్ తోనే కాదు…కొత్త కార్ లో చక్కర్లు కొడుతూ ప్యాన్ ఇండియా స్టార్ స్టేటస్ చాటుతున్నాడు ప్రభాస్.

ప్రభాస్…ఇప్పుడు ఫస్ట్ టైమ్ 100 కోట్ల రెమ్యూనిరేషన్ అందుకుంటోన్న స్టార్ మాత్రమే కాదు…అందరికంటే ముందు లంబోర్ఘిని అల్ట్రా రిచ్ కార్ ను సొంతం చేసుకున్న హీరో కూడా. నాలుగు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఓవైపు ముంబైలో దాదాపు 50 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకుంటూనే…మరోవైపు తన గ్యారేజ్ లోకి లంబోర్ఘిని అవెన్‌టోడోర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ను తెచ్చేసారు. ఈ కార్ ఖరీదు అక్షరాల 6కోట్ల రూపాయలు.

ప్రభాస్ కి కాస్ట్ లీ కార్లపై ఉన్న ఇంట్రెస్ట్ గురించి తెలిసిందే. ఈ హీరో హోమ్ గ్యారేజీలో అత్యంత ఖరీదైన జాగ్వార్ ఎక్స్ జె ఆర్, రోల్స్ రాయస్ ఫాంటమ్ కార్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ తలదన్నే లంబోర్ఘిని అవెంటడార్ ఎస్ రోడ్ స్టర్.. అదికూడా స్టైలిష్ లుక్ లో కనిపించే అరాన్సియో అట్లాస్ షేడెడ్ వెర్షన్ ని సొంతం చేసుకున్నారు. ఇండియాలో ఈ కార్ కొన్న రెండో వ్యక్తి ప్రభాస్ కావడం విశేషం. తన తండ్రి సూర్యనారాయణరాజు జయంతి సందర్భంగా ప్రభాస్‌ ఈ కార్ ను కొన్నట్టు తెలుస్తోంది.

ఈమధ్యే ఎన్టీఆర్ లంబోర్గిని ఉరుస్ కార్ ను బుక్ చేసుకున్నారు. 5కోట్ల రూపాయల విలువ చేసే ఆ కార్ ను మించిన కాస్ట్ లీ కార్ ఇప్పుడు ప్రభాస్ సొంతమైంది. 3కోట్లు విలువ చేసే రోల్స్ రాయల్ ఫాంటమ్ కార్ ని చిరూ వాడుతుంటే…మూడున్నర కోట్లు వెచ్చించి రేంజ్ రోవర్ తీసుకున్నారు రామ్ చరణ్. రెండున్నర కోట్ల రేంజ్ రోవర్ కార్లో మహేశ్ దూసుకుపోతుంటే…అంతే విలువ చేసే బెంజ్ G63 కార్ అఖిల్ సొంతం. ఇక 2కోట్లకు మించిన మోస్ట్ స్టైలిష్ కార్స్ జాగ్వార్, రేంజ్ రోవర్ ఓనర్…అల్లు అర్జున్. ఇలా కార్స్ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరోలు చాలామందే ఉన్నారు.

మెగాపవర్ స్టార్ బర్త్ డే స్పెషల్ గా అటు త్రిపుల్ ఆర్…ఇటు ఆచార్య నుంచి ఫస్ట్ లుక్స్ వచ్చేసాయి. మెగాభిమానుల్ని రెండూ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రెండింటితో పాటూ చిరూ షేర్ చేసిన ఓ ఎమోషనల్ వీడియో ప్రెజెంట్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

ట్విటర్‌ వేదికగా విషెస్ వీడియో పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు చిరంజీవి. ‘హ్యాపీ బర్త్‌డే మై బాయ్’‌ అంటూ చిరూ షేర్ చేసిన వీడియో… మెగా అభిమానులను ఎమోషనల్ గా థ్రిల్ చేసింది. ఇక ఆచార్య నుంచి సిద్ధ ఫస్ట్ లుక్ పోస్ట్ చేస్తూ… “నీతో నటించాలన్న కోరిక నెరవేరింది నాన్న… ఇంతకు మించిన బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది” అంటూ ట్వీట్ చేసారు రామ్ చరణ్.

చిన్నప్పుడు చరణ్‌ చిరూకు గొడుగు పట్టిన పిక్ తో పాటు.. పెద్దాయ్యాక తండ్రికి గొడుగు పడుతున్న మరో రెండు ఆచార్య సెట్ లోని ఫొటోలను ఇందులో చూపించారు. ‘అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడు కేరింగ్‌ సన్‌’ అంటూ ఈ వీడియోని ఎండ్ చేసారు చిరంజీవి..

స్టార్ వారసుడైనా ఇండస్ట్రీలో తాను స్టార్ గా మారేందుకు కష్టపడ్డాడు. నటుడిగా ఎంట్రీ ఇవ్వడానికి వారసత్వం పనికొస్తుందేమో కానీ.. నటవారసుడిగా నిలబడడానికి కాదని నిరూపిస్తూ.. సొంతగా ఎదుగుతూ సత్తా చూపిస్తున్నాడు మెగా పవర్ స్టార్. యాక్టింగ్ లోనే కాదు ..ప్రొఫెషనల్ చాలా షేడ్స్ చూపిస్తున్నారు రామ్ చరణ్. అందుకే ఇప్పుడు ఆయనకి తెలుగునేల మీదే కాదు…ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ గ్రూప్స్ వెలిసాయి. బర్త్ డే ప్రత్యేకంగా న్యూయార్ టైమ్ స్వేర్స్ లోని నాస్దక్ బిల్డింగ్ పై చెర్రీ ఫోటోలను ప్రదర్శించారు.

మెగా ఫ్యామిలీ వారసుడంటే ఆషామాషీ కాదు.. అలా ,ఇలా ఉండకూడదు.. ఓ రేంజ్ లో ఉండాలి. అందుకే.. మెగాస్టార్ యాక్టింగ్ తో పాటు పవర్ స్టార్ పవర్ ను కలుపుకున్న ఈ మెగా పవర్ స్టార్ యంగ్ ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోగానే కాదు .. తండ్రితో కలిసి యాక్టింగ్ లో, డాన్స్ లో పోటీ పడుతున్నారు, ప్రొడ్యూసర్ గా కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నారు చరణ్. అంతేకాదు .. సింప్లిసిటీ మెయింటెన్ చేస్తూ.. తన ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు చరణ్. ఈ శనివారం రామ్ చరణ్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. నిన్న ఫ్యాన్స్ మీట్ లో భాగంగా చరణ్ కు విషెస్ తెలియజేసేందుకు ప్రవాహంలా అభిమానులు తరలివచ్చారు.

రామ్ చరణ్ కెరీర్ రంగస్తలం ముందు వరకూ ఒక లెక్క..రంగస్తలం తర్వాత ఒక లెక్క అన్నట్టు సినిమాల సెలక్షన్ లో వేరియేషన్ చూపిస్తున్నారు చరణ్. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ తన విశ్వరూపం చూపిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. ఇంతకుముందెన్నడూ లేనంత ఫియర్ లెస్ యాక్షన్ ఎమోషన్స్ ని చూపించబోతున్నారు.

మెగా స్టార్ వారసుడిగా డ్యాన్సులు, ఫైట్లతో చిరంజీవిని మరిపిస్తున్నాడు. తండ్రి స్టార్ డమ్ ను అందుకోవడానికి ట్రై చేస్తూ..తండ్రిని మరిపించేలా స్టెప్స్ వేస్తూ మెగా పవర్ స్టార్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఆచార్య సినిమాలో తండ్రీ కొడుకులిద్దరూ కలిసి హంగామా చెయ్యబోతున్నారు. వీళ్లిద్దరినీ ఈ సినిమాలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు అభిమానులు .

హీరోగానే కాదు, తండ్రితో పోటీపడుతూ నటిస్తున్న కో యాక్టర్ గానే కాకుండా ..ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అవుతున్నారు చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి చిరంజీవితోనే ఖైదీ నెం. 150 తో పాటు భారీ బడ్జెట్ సినిమా సైరా నర్సింహారెడ్డి చేసి సూపర్ హిట్ కొట్టారు చరణ్. ఇప్పుడు ఆచార్య సినిమాకి కూడా కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు రామ్ చరణ్. ఇక మరోవైపు నేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా అనౌన్స్ చేసి…ప్రేక్షకులకి కిక్ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు…మీతో పనిచేసేందుకు వెయిట్ చేస్తున్నామంటూ ట్వీట్ చేసారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో మరింత జోష్ నింపేలా మేకర్స్ వరుసగా సర్పైజెస్ ఇస్తున్నారు. అడ్వాన్స్ విషెస్ తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ నుంచి సీతారామరాజుగా చెర్రీని పరిచయం చేసారు రాజమౌళి. ఇక తాజాగా తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తోన్న ఆచార్య నుంచి సిద్ధగా ఎంట్రీ ఇచ్చాడు చరణ్. “నీతో నటించాలన్న కోరిక నెరవేరింది నాన్న… ఇంతకు మించిన బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది” అంటూ ట్వీట్ చేసారు రామ్ చరణ్. చిరూతో కలిసి తుపాకులతో నడుస్తోన్న ఈ ఫస్ట్ లుక్ మెగాఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. కాగా చిరూ తాజాగా లీక్ చేసినట్టు మావోయిస్తు పాత్రల్లోనే దర్శనమిచ్చారు తండ్రికొడుకులు.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ కూడా ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈమధ్యే అటు మారేడుమిల్లి అడవుల్లో…ఇటు ఇల్లందు బొగ్గుగనుల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఇక మెగాస్టార్ సరసన కాజల్ కిచ్లూ నటిస్తుంటే…మెగాపవర్ స్టార్ జోడీగా పూజా హెగ్దే మెరవనుంది. మే 13న థియేటర్స్ కు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ సర్‌ప్రైజ్ చేసింది. మార్చి 27న చెర్రీ బర్త్ డే కావడంతో ఒకరోజు ముందుగానే త్రిపుల్ ఆర్ టీమ్ అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ మూవీలో అల్లూరిగా చెర్రీ గర్జన ఏరకంగా ఉండబోతోందో జస్ట్ ఓ చిన్న శాంపిల్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ధైర్యం, నిజాయితీ, సమగ్రత ఈ మూడింటిని కలయికే మా అల్లురి సీతారామరాజు అంటూ ఫస్ట్ లుక్ ను పరిచయం చేసారు డైరెక్టర్ రాజమౌళి. నా అన్న రామరాజు లుక్ అంటూ అటు ఎన్టీఆర్ సైతం రామ్ చరణ్ కు విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామరాజు జోడీగా సీత పాత్రలో అలియా మెరవనుంది. 400కోట్ల భారీ బడ్జెట్ తో…పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీఅవుతోంది.