ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి మరోసారి ఎనర్జిటిక్ మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ గీతాలున్నాయి. వీరి కలయికలో గతంలో ఆరు సినిమాలొచ్చాయి. జగడం నుంచి మొదలెడితే రెడీ, శివం, ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ, హలో గురు ప్రేమకోసమే.. చిత్రాలు రామ్ హీరోగా, దేవీశ్రీ సంగీతంలో వచ్చాయి. వీటిలో జగడం, రెడీ, ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ వంటివి సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ గా పేరుతెచ్చుకున్నాయి. కాగా వీరిద్దరి కాంబోలో ఏడో సినిమా రానుంది. హీరో రామ్‌ నటించబోయే 19వ సినిమాని లింగుస్వామి డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ సరసన బేబమ్మ కృతిశెట్టి కనిపించనుంది. ఈ సినిమాకే డీఎస్పీ స్వరాలు అందించనున్నారు. శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.

ఇస్మార్ట్ శంకర్ తో స్మార్ట్ మాస్ హీరోగా సెటిలయిన హీరో రామ్ మరో మాస్ సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి కాంబోలో రామ్ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కృతిశెట్టిని ఫైనల్ చేసారు. అతిత్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుగబోతుంది. కాగా తాజాగా బాలయ్య హిట్ కాంబో డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో రామ్ మూవీ చేయనున్నాడనే వార్త జోరందుకుంది. బాలకృష్ణతో ప్రస్తుతం బోయపాటి చేస్తోన్న మూవీ కాగానే…రామ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అంటున్నారు.