ఇస్మార్ట్ శంకర్ తో స్మార్ట్ మాస్ హీరోగా సెటిలయిన హీరో రామ్ మరో మాస్ సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి కాంబోలో రామ్ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కృతిశెట్టిని ఫైనల్ చేసారు. అతిత్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుగబోతుంది. కాగా తాజాగా బాలయ్య హిట్ కాంబో డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో రామ్ మూవీ చేయనున్నాడనే వార్త జోరందుకుంది. బాలకృష్ణతో ప్రస్తుతం బోయపాటి చేస్తోన్న మూవీ కాగానే…రామ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అంటున్నారు.

అనుష్క సరసన నటించే ఛాన్స్ కొట్టేసాడట హీరో నవీన్ పొలిశెట్టి. డైరెక్టర్ మహేశ్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి డిఫరెంట్ లవ్ స్టోరిని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10ఏళ్ల వయసు తేడా ఉన్న ఓ ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో రారా కృష్ణయ్య ఫేం మహేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

బంపర్ ఆఫర్ అందుకున్నాడట జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్. ఓ మాస్ మసాలా కథతో హీరో రామ్ ను టెంప్ట్ చేసినట్టు టాక్. కథ విన్న రాన్ వెంటనే అనుదీప్ కి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్, స్రవంతి మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని టాక్.

భలే ఛాన్స్ కొట్టేసింది జాతిరత్నాలు ఫేం ఫ‌రియా అబ్ధుల్లా. ఇప్పటికే ఈ అమ్మాయికి వరుస ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాటయి. కాగా మాస్ రాజా రవితేజ, త్రినాథ రావు నక్కిన కాంబినేషన్ సినిమాలో ఫరియాకు ఛాన్స్ ఇస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న ఖిలాడి అయినవెంటనే పట్టాలెక్కబోతున్న త్రినథరావు చిత్రంలో ఫరియానే హీరోయిన్ గా సెట్టయ్యే అవకాశం ఉంది

పదిహేడేళ్ల కుర్రాడు… కొత్తగా గ్యాంగ్‌లో జాయిన్ అయ్యాడు. కొట్లాటకు గ్యాంగ్ సభ్యులతో కలిసి వెళ్ళాడు. ఎదురుగా పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళను చూసి కుర్రాడి గ్యాంగ్ లీడర్ భయపడ్డాడు. వెనకడుగు వేశాడు. కానీ, కుర్రాడు వేయలేదు. చురకత్తుల్లాంటి చూపులతో తనకంటే బలవంతుడిని ఢీ కొట్టాడు. ధైర్యంగా నిలబడ్డాడు. – ఈ సీన్‌కి రాజమౌళి కూడా ఫ్యాన్.

గ్యాంగ్‌కి కుర్రాడు కొత్త. కాని సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు కాదు. అప్పటికి ‘దేవదాసు’తో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అయితే, ఈ సీన్‌తో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. యాక్షన్ హీరోకి కావాల్సిన లక్షణాలు ఇతడిలో ఉన్నాయని పేరు తెచ్చుకున్నాడు. పైన చెప్పినది ‘జగడం’లో సీన్ అని గుర్తొచ్చి ఉంటుంది కదూ! ఆ ఎనర్జిటిక్ హీరోయే మన ఉస్తాద్ రామ్.

హీరోగా రామ్‌కి, దర్శకుడిగా సుకుమార్‌కీ ‘జగడం’ ఎంతో పేరు తెచ్చింది. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పైన చెప్పిన సీన్ గురించి ప్రస్తావించారంటే అందులో స్ట్రెంగ్త్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ‘జగడం (వయలెన్స్) ఈజ్ ఫ్యాషన్’, ‘5 ఫీట్ 8 ఇంచెస్ కింగు లాంటి శీనుగాడు’ పాటలు యూత్ ప్లే లిస్టులో ఉంటున్నాయి. ఓవర్ ద ఇయర్స్ ప్రేక్షకులలో అభిమానులను పెంచుకుంటూ వస్తున్న ‘జగడం’ సినిమా విడుదలై మార్చి 16కి 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ ఏట ప్రవేశిస్తోంది.ఈ సందర్భంగా సినిమా విశేషాలను, అప్పటి సంగతులను దర్శకుడు సుకుమార్ మరోసారి గుర్తు చేసుకున్నారు.

ఆ ఆలోచన నుంచి… ‘జగడం’

చిన్నప్పటి నుంచి ఒక విషయం నాకు ఇన్స్పిరేషన్ గా ఉండేది. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే… నేను వెళ్ళేసరికి ఆగిపోతుండేది. కొట్టుకుంటారేమో, కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉండేది. నేను ఎదుగుతున్న క్రమంలోనూ ఆ ఆలోచన పోలేదు. ఎక్కడైనా కొట్లాటలో వాళ్ళు కొట్టుకోలేదంటే డిజప్పాయింట్ అయ్యేవాడిని. నా స్నేహితులైనా అరుచుకుంటుంటే బాధ అనిపించేది. వీళ్ళు కొట్టుకోవడం లేదేంటి? అని! ఎక్కడో మనలో వయలెన్స్ ఉంది. వయలెన్స్ చూడాలని తపన ఉంది. ఉదాహరణకు, అడవిని తీసుకుంటే అందులో ప్రతిదీ వయలెంట్ గా ఉంటుంది. పులి-జింక తరహాలో ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. ఎక్కడ చూసినా బ్లడ్ ఉంటుంది. ‘ఆహారాన్ని సాధించే దారి అంతా వయలెన్స్ తో ఉంటుంది. అలాగే, సెక్స్ ను సాధించే దారి ప్రేమతో ఉంటుంది.’ – ఇలా ఎదో అనుకున్నాను. దాని నుంచి మొదలైన ఆలోచనే జగడం. మన చుట్టుపక్కల చూస్తే… చిన్నపిల్లలు ఎవరైనా పడిపోతే, దెబ్బ తగిలితే… ‘నిన్ను కొట్టింది ఇదే నాన్నా’ అని రెండుసార్లు కొట్టి చూపిస్తాం. ఇటువంటి విషయాలు నాలో కనెక్ట్ అయ్యి ఓ సినిమా సినిమా చేద్దామని అనుకున్నా. రివెంజ్ ఫార్ములాలో.

‘ఆర్య’ కంటే ముందే…

నిజాయతీగా చెప్పాలంటే… ‘ఆర్య’ కంటే ముందు ‘జగడం’ చేద్దామనుకున్నా. నా దగ్గర చాలా ప్రేమకథలు ఉన్నాయి. ‘ఆర్య’ తర్వాత వాటిలో ఏదైనా చేయవచ్చు. వయలెన్స్ నేపథ్యంలో కొత్తగా ఏదైనా చేద్దామని అనుకున్నా. అప్పటికి నాలో ఆలోచనలు రకరకాలుగా మారి ‘జగడం’ కథ రూపొందింది.

రామ్… అంత షార్ప్!

‘జగడం’ కథ పూర్తయిన సమయానికి ‘దేవదాసు’ విడుదలై ఏడు రోజులు అయినట్టు ఉంది. నేను సినిమా చూశా. రామ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. హుషారుగా చేస్తున్నాడు. ఎఫ‌ర్ట్‌లెస్‌గా పెర్ఫార్మన్స్ చేస్తున్నాడని అనిపించింది. రామ్‌తో ‘జగడం’ చేయాలని ‘స్రవంతి’ రవికిశోర్ గారిని అప్రోచ్ అయ్యాం. ఆయన సరే అన్నారు. అలా ‘జగడం’ మొదలైంది. అప్పుడు రామ్‌కి పదిహేడేళ్లు అనుకుంట. ఆ టైమ్‌లో ఏం చెప్పినా చేసేసేవాడు. ‘నాకు రాదు. రాలేదు. చేయలేను’ అనే మాటలు ఉండేవి కావు. చేత్తో కాయిన్ తిప్పమని అడిగితే… పక్కకి వెళ్లి పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి వచ్చి చేసేవాడు. అంత షార్ప్. నాకు తెలిసి… ఇప్పటికీ రామ్‌ని ఆ బ్రిలియన్స్ కాపాడుతుంది. దానివల్లే తను సక్సెస్ అవుతుంది. తన పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది.

రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నా

నేను ప్రతిక్షణం రామ్‌ను చూసి షాక్ అవుతూ ఉండేవాడిని. అంటే… చిన్న వయసులో ప్రతిదీ ఈజీగా చేయగలుగుతున్నాడు. వెంటనే పట్టుకుని పెర్ఫార్మన్స్ చేయగలుగుతున్నాడు. ఈ సన్నివేశంలో ఇలా కాకుండా వేరేలా చేస్తే బావుంటుందని అడిగితే… మనం కోరుకున్న దానికి తగ్గట్టు ఎక్స్‌ప్రెష‌న్స్‌ వెంటనే మార్చి చేసేవాడు. అన్ని రియాక్షన్స్ ఉండాలంటే ఎక్కువ లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉండాలి. అప్పటికి తనకు ఎటువంటి లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉన్నాయో తెలియదు కానీ… ఎటువంటి రియాక్షన్ అడిగినా చేసి చూపించేవాడు. ‘జగడం’ చేసే సమయానికి రామ్‌ను చూస్తే వండర్ బాయ్ అనిపించాడు. ఇండస్ట్రీలో రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నాను. ఈ రోజు అదే ప్రూవ్ అయ్యింది.

ప్రతి పాట హిట్టే

‘ఆర్య’తో దేవిశ్రీ ప్రసాద్‌తో నాకు అనుబంధం ఉంది. ‘జగడం’ చిత్రానికీ తనను సంగీత దర్శకుడిగా తీసుకున్నాను. ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ కాకుండా రెండు వస్తువుల మధ్య ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? – ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిందే ‘5 ఫీట్ 8 ఇంచెస్’ సాంగ్. చంద్రబోస్ గారికి నేను ఈ కథ అనుకున్నాని చెబితే వెంటనే పాట రాసిచ్చారు. దానికి దేవి ట్యూన్ చేశారు. అదే ‘వయలెన్స్ ఈజ్ ప్యాషన్’. సినిమాలో ప్రతి పాట హిట్టే. అప్పట్లో ‘జగడం’ ఆల్బమ్ సెన్సేషన్. సినిమాకి తగ్గట్టు దేవి మౌల్డ్ అవుతాడు. మంచి నేపథ్య సంగీతం ఇస్తాడు. ‘జగడం’ పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతాన్ని నేను ఇప్పటికీ హమ్ చేస్తూ ఉంటాను.

‘వయలెన్స్’ ఎందుకు ‘జగడం’గా మారిందంటే?

వయలెన్స్ ను ఎక్కువ ఎగ్జాగరేట్ చేస్తున్నారని, గ్లామరస్ గా చూపిస్తున్నారని సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అందువల్ల ‘వయలెన్స్ ఈజ్ ప్యాషన్’ పాటలో వయలెన్స్ బదులు ‘జగడం’ అని పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో సెన్సార్ లో చాలా పోయాయి. సినిమా కథనమే మిస్ అయింది. అప్పట్లో నాకు సెన్సార్ ప్రాసెస్ గురించి పూర్తిగా తేలికపోవడం వల్ల చాలా కట్స్ వచ్చాయి. కట్స్ లేకుండా సినిమా ఉంటే ఇంకా బావుండేది. సినిమాకు సరైన అప్రిసియేష‌న్‌ రాలేదేమో అని నాలో చిన్న బాధ ఉంది.

స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌… సూపర్35… సినిమాటోగ్రఫీ!

సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ ‘జగడం’ అని చెప్పొచ్చు. ఎందుకంటే… అప్పుడే chooke s4 లెన్స్ వచ్చాయి. అప్పట్లో స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ తన సినిమాలకు ఏ కెమెరా ఎక్విప్‌మెంట్ ఉపయోగించారో, మేమూ అదే ఎక్విప్‌మెంట్ ఉపయోగించాం. సూపర్ 35 ఫార్మాట్ లో షూట్ చేశాం. అప్పటివరకు మన దగ్గర ఎవరూ ఆ ఫార్మాట్ లో ఎవరూ చేయలేదు. కెమెరా యాంగిల్, లైటింగ్ మూడ్… రత్నవేలు ప్రతిదీ డిస్కస్ చేసి చేసేవారు. ప్రతిదీ పర్ఫెక్ట్ షాట్ అని చెప్పొచ్చు. ఇండియాలో సినిమాటోగ్రఫీ పరంగా చూస్తుంటే… వన్నాఫ్ ది బెస్ట్ ‘జగడం’ అని చెప్పొచ్చు. ఆ క్రెడిట్ మొత్తం రత్నవేలుగారిదే. సినిమాటోగ్రఫీనీ అప్రిషియేట్ చేయలేదు. ఆ సినిమా ఫొటోగ్రఫీ నాకు ఎంతో ఇష్టం.

ముంబైలో దర్శకుల దగ్గర… లైబ్రరీల్లో ‘జగడం’

ఎడిటింగ్ కూడా సూపర్. ఆ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ చేశారు. సినిమా విడుదలైన కొన్నాళ్లకు ఒకసారి మేమిద్దరం ఫ్లైట్‌లో కలిశాం. మాటల మధ్యలో ‘జగడం’ గురించి వచ్చింది. ‘ప్లాప్ సినిమా కదా. మాట్లాడుకోవడం ఎందుకు అండీ’ అన్నాను. అందుకు ‘అలా అనుకోవద్దు. నేను ముంబై నుంచి వస్తున్నాను. చాలామంది దర్శకుల దగ్గర, వాళ్ళ లైబ్రరీల్లో జగడం సినిమా ఉంది. నీకు అంతకన్నా ఏం కావాలి? చాలామంది నీకు ఫోనులు చేయలేకపోవచ్చు. నిన్ను కలవడం వాళ్ళకు కుదరకపోవచ్చు. కానీ, చాలా అప్రిసియేషన్ పొందిన సినిమా ఇది. టెక్నీషియన్స్ దానిని రిఫరెన్స్ గా పెట్టుకున్నారు’ అని శ్రీకర్ ప్రసాద్ గారు చెప్పారు.

నిర్మాత గురించి…

చిత్రనిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ జేడీ సోంపల్లిగారు ఎంతో మద్దతుగా నిలిచారు. వాళ్ళ అబ్బాయి ఆదిత్యబాబు తరపున ఆయన సినిమా నిర్మించారు. ఆదిత్య ఇప్పటికీ నాతో టచ్ లో ఉంటాడు. నా ఫంక్షన్లకు తనను కూడా పిలుస్తాను.

ఆరు నెలలు ఆడిషన్స్ చేశాం!

అప్పట్లో ఆర్టిస్టులు చాలా తక్కువ మంది. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. వెబ్ సిరీస్ లు వచ్చాయి. చాలామంది ఆర్టిస్టులు దొరుకుతున్నారు. అప్పుడు అలా కాదు కాబట్టి ఎక్కువ ఆడిషన్స్ చేశాం. సుమారు ఆరు నెలలు ‘జగడం’ ఆడిషన్స్ జరిగి ఉంటాయి. తాగుబోతు రమేష్, వేణు, ధనరాజ్… ఇలా ఆ సినిమా నుంచి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పటికి వాళ్ళు అదే గౌరవం, ప్రేమతో చూస్తారు.

త్వరలో రామ్‌తో సినిమా చేస్తా!

రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో మళ్ళీ తప్పకుండా చేస్తా. మరో మంచి సినిమా చేయాలి. యాక్చువల్లీ… ఇప్పటి రామ్‌తో మళ్ళీ ‘జగడం’ రీమేక్ చేయాలని ఉంది. మళ్ళీ ఇప్పటి రామ్‌తో మళ్ళీ జగడం చూసుకోవాలని ఉంది.

మార్చి 11వ తేదీ మహాశివ‌రాత్రి కానుక‌గా మూడు చిత్రాలు థియేటర్స్ కి రానున్నాయి. శర్వానంద్ శ్రీకారం, నవీన్ పొలిశెట్టి జాతి ర‌త్నాలు, శ్రీవిష్ణు గాలి సంప‌త్ సినిమాల విడుదలకు సిద్ద‌మ‌య్యాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు వీటి ప్రీ రిలీజ్ వేడుకలను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
నవీన్ పోలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రూపొందిన లేటెస్ట్ కామెడీ మూవీ జాతిరత్నాలు. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాను అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసాడు. జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం వరంగల్ లో గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఇక ఈ వేడుకకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా రానున్నార‌ని కామెడి మీమ్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు.


గాలి సంపత్…శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం. దర్శకుడు అనిష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో లవ్‌లీ సింగ్ హీరోయిన్. వీరితో పాటు తనికెళ్లభరణి, రఘుబాబు, సత్య వంటివారు మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించారు. డైరెక్టర్ అనీల్ రావిపూడి స‌మ‌ర్ప‌కుడిగా మారారు ఈ సినిమాతో. గాలి సంపత్ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం 6గంటల‌కు జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్‌ వేదికగా జ‌ర‌గ‌నుంది. అయితే దీనికి ఇస్మార్ట్ హీరో రామ్ చీఫ్ గెస్ట్‌ గా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు

టీటౌన్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్, డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్లో ఓ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా హైద‌రాబాద్‌లో ఈ సినిమా ప్రారంభ పూజా కార్య‌క్ర‌మాలు సైతం జ‌రిగాయి. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. రీసెంట్ హిట్ ఉప్పెన మూవీతో తెలుగు అడ్డాపై జెండా పాతిన కృతిశెట్టి..రామ్‌ సరసన న‌టించ‌బోతున్నట్టు టాక్ ప్రచారంలోకి వచ్చింది. రామ్ కి తగ్గట్టు స్టైలిష్ ఎలిమెంట్స్ తో ఉంటూనే ఊర‌మాస్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట లింగుస్వామి.
తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఈ ప్రాజెక్ట్ రూపొందనుండగా..కృతిశెట్టి ఈ మూవీతోనే కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే కృతిశెట్టి ఎంపికపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ తో ప్రాజెక్ట్ చేస్తోన్న డైరెక్టర్ లింగుస్వామి… పందెంకోడి, ఆవారా, వెట్టయ్ వంటి సినిమాలతో పేరుతెచ్చుకుంటే…ఈ సినిమా నిర్మాత శ్రీనివాస చిట్టూరి యూట‌ర్న్‌, బ్లాక్ రోజ్‌, సీటీమార్ వంటి వాటితో లైమ్ లైట్ లోకి వచ్చారు.

ఆహా చిత్రం ముందుగా చెప్పినట్టు రామ్..ఊర మాస్ న్యూస్ నిజమవుతుంది.
పందెంకోడి, ఆవారా సినిమాల డైరెక్టర్ లింగుస్వామితో…హీరో రామ్ తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. లింగు స్వామి చెప్పిన మాస్ స్టోరి హీరో రామ్ కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో…శ్రీనివాస్ చిత్తలూరి నిర్మిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఇతర నటీనటులను ప్రకటించి…రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నారట రామ్, లింగుస్వామి.

శివరాత్రికి ముహూర్తం
మాస్ రాజా రవితేజ నటిస్తోన్న ఖిలాడి టీజర్ ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజ్ చేస్తున్నారు. అర్జున్, అనసూయ కీరోల్స్ ప్లే చేస్తోన్న ఖిలాడి మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హీరోయిన్ పక్కా..?
గోపీచంద్ – మారుతి పక్కా కమర్షియల్ మూవీలో హీరోయిన్ గా రాశిఖన్నా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఇందులో మరో హీరోయిన్ గా తెలుగమ్మాయి ఈశారెబ్బా కనిపించనుందట.

రామ్..ఊర మాస్
పందెంకోడి, ఆవారా సినిమాల డైరెక్టర్ లింగుస్వామితో…హీరో రామ్ తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. లింగు స్వామి చెప్పిన ఊర మాస్ స్టోరి రామ్ కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని టాక్.

పవర్ ప్లే…కమింగ్
కొండా విజయ్ కుమార్, రాజ్ తరుణ్ కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ ప్లే మూవీ మార్చి 5న రిలీజ్ కానుంది. రీసెంట్గా ఈ మూవీ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

సైజ్ జీరో అనుష్కలా…
అజయ్ దేవగణ్ సరసన ప్రణీత నటిస్తోన్న కొత్త సినిమాలో ఆమె రెండు పాత్రలు చేస్తున్నారట. ఒకటి నాజుకుగా కనబడే రోల్ కాగా మరొకటి సైజ్ జీరో అనుష్కలా భారీకాయంతో కనిపించే పాత్ర కావడం విశేషం.

ఎప్పుడో ప్రారంభించాల్సిన సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజు ఎట్టకేలకు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. కింగ్ కి తోడు అటు గ్లామరస్ గా నటించేందుకు రమ్యకృష్ణ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే హీరో నాగార్జున, డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ రెడీగానే ఉన్నా…ముఖ్యపాత్రలో నటించాల్సిన నాగచైతన్య కాల్షీట్స్ ఖాళీ లేవట. దీంతో నాగశౌర్య లేదంటే రామ్ లతో ఆ ప్లేస్ రీప్లేస్ చేసి షూటింగ్ త్వరలోనే షురూ చేస్తారట మేకర్స్.

నాగశౌర్య, బాలకృష్ణ కాంబోలో మూవీ వస్తుందన్నారు కానీ ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అటు త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ తో పాటూ రామ్ నటిస్తారనే వార్త జోరందుకుంది. ఇదిలాఉంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు నాగార్జున సినిమాలో కనిపిస్తారనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి బంగార్రాజులో నాగశౌర్య, రామ్ లలో ఎవరైనా కనిపిస్తారా అన్నది తెలియాలంటే ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే ఈ మూవీ ముహూర్తం తేదీ వరకు వేచిచూడాల్సిందే.

పూరీ జగన్నాథ్ చిరకాల స్వప్నం జనగనమణ ప్రాజెక్ట్. అయితే మహేశ్ కోసం రెడీచేసిన ఈ జనగనమణ స్క్రిప్ట్ ను తాజాగా విన్నారట పవన్ కల్యాణ్. దీనికోసం ఇప్పటికే రెండుసార్లు ఆయన్ని కలిసిన పూరీ జగన్నాథ్…వర్తమాన రాజకీయాలకు అనుగుణంగా కథను మార్చే పనిలో ఉన్నారని టాక్. రాబోయే ఎన్నికల సమయానికల్లా ఈ సినిమాను సిద్ధం చేయాలని భావిస్తున్నారట.

అదలాఉంటే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్, రామ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లపై ఇండస్ట్రీలో విభిన్న టాక్స్ వినిపిస్తున్నాయి. విడివిడి సినిమాలు కాదు పవన్ కళ్యాణ్ – రామ్ కాంబినేషన్లో త్రివిక్రమ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వీళ్లిద్దరి కలయికలో పక్కా స్ట్రిప్ట్ రెడీ చేసుకున్న త్రివిక్రమ్ వచ్చే ఏడాదే ఈ కాంబోను తెరకెక్కించే అవకాశం ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ కి మల్టీస్టారర్ చేయడం కొత్తేమీ కాదు. అలానే హీరో రామ్ సైతం కథ నచ్చితే వేరే హీరోతో నటించేందుకు రెడీగానే ఉంటారు. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పుడు చర్చ నడుస్తోంది.