“హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది- రామతత్త్వం! కష్టంలో కలిసి నడవాలన్నది- సీతతత్త్వం! అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ! పుణ్య దంపతులైన సీతా రాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నాను !!” అంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసారు. కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సినీకార్మికులకు, సినీ జర్నలిస్టులకు తమ సంఘం తరపున టీకా వేయిస్తామని తాజాగా ప్రకటించారు చిరంజీవి.

మరోవైపు చాలా నెమ్మదిగా ఒక్కొక్కరు తమ సినిమా కొత్త లుక్స్ తో శ్రీరామనవమి వేళ రంగంలోకి దిగుతున్నారు. నితిన్ తన కొత్త చిత్రం మ్యాస్ట్రో లుక్ తో ముందుకొచ్చాడు. స్కూటీపై నభానటేష్ తో కనిపించాడు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తోన్న మ్యాస్ట్రో నితిన్ 30వ సినిమాగా రాబోతుంది.

వరుడు కావలెను అంటూ కనిపించాడు నాగశౌర్య. వెనుక సీతారాముల ఆర్ట్ తో తాను కనిపించి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసాడు. కాగా నాగశౌర్య హీరోగా నటిస్తోన్న వరుడు కావలెను సినిమాలో హీరోయిన్ గా రీతూవర్మ కనిపించనుంది. సౌజన్య అనే లేడీ డైరెక్టర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.