క్యూట్ గర్ల్ రష్మికా మంధన్నా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో దిల్ రాజు తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా బుక్ అయినట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందట. ఇప్పటికే శంకర్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చటంతో వెంటనే ఓకే చెప్పేసినట్టు టాక్ నడుస్తోంది. అయితే మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా జూలై 15వ తేదీ నుంచి పట్టాలెక్కనుంది.

పొలిటికల్ కథాంశంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారనీ…ఒక దశలో ముఖ్యమంత్రిగా అదరగొడతారన్న న్యూస్ వైరలవుతోంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో చిరంజీవితో పాటూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. కాగా ఇప్పుడు జర్నలిస్ట్ గా రష్మికా పేరు చర్చలోకి వచ్చింది. ప్రస్తుతం రష్మిక పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు, మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.