15 ఏళ్ల క్రితం… కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో రిలీజయి అటు తమిళ్ లో ఇటు తెలుగులో బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అపరిచితుడు సినిమా. శంకర్ డైరెక్షన్ లో విక్రమ్ హీరోగా వచ్చిన ఈ మూవీ శంకర్ తో పాటు విక్రమ్ కెరీర్ ను కూడా పరుగులు పెట్టింది. ఈ సినిమాలో విక్రమ్ యాక్టింగ్ వేరియేషన్స్ కి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. సదాకు హీరోయిన్ గా మంచిపేరు తీసుకొచ్చింది. ఈ సినిమా ఇప్పుడు రణ్ వీర్ సింగ్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది.

బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాపై కన్నుపడింది. అంతే కాదు ఈ సినిమా ఎలా చేస్తే బాగుంటుందో తెలుసుకోవడం కోసం రణ్ వీర్ సింగ్ ఇప్పటికే శంకర్ ను కలిసి సలహాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇక ఈ హీరో సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటించనున్నట్టు తెలుస్తోంది. త్వరలో సినిమా డీటెయిల్స్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

బాలీవుడ్ లో మోస్ట్ హాట్ అండ్ లవబుల్ కపుల్ గా పేరుతెచ్చుకున్నారు దీపికా పడుకోణె, రణవీర్ సింగ్ . 6 ఏళ్లు ప్రేమించుకుని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పటికీ లవర్స్ లా ఫుల్ రొమాంటిక్ గా జాలీ గా కనిపిస్తుంటారు. ఒకే చోట ఈ ఇద్దరూ కనిపిస్తే ..కళ్లు తిప్పుకోలేనంత ఎట్రాక్ట్ చేస్తారు ఈ జంట. లేటెస్ట్ గా ఈ కపుల్ పోస్ట్ చేసిన హాట్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

బ్యాక్ లైట్ లో దీపికా, రణవీర్ రొమాంటిక్ గా సెన్సువల్ డాన్స్ మూవ్స్ చేస్తున్న వీడియో ఫ్యాన్స్ ని తెగ ఎంటర్ టైన్ చేస్తోంది. డార్క్ పింక్ కలర్ డ్రెస్ లో రణవీర్ ,లైట్ బేబీ పింక్ కలర్ సూట్ లో దీపికా కలిసి చేసిన ఈ వీడియో వేడి పుట్టిస్తోంది. అబ్బ..ఇద్దరూ ఎంత రొమాంటిక్ మూడ్ లో ఉన్నారో అనుకుంటున్నారు ఫ్యాన్స్ . కానీ అసలు విషయం ఏంటంటే..సిల్హాట్ ఛాలెంజ్ లో భాగంగా దీపికా, రణవీర్ ఈ ఛాలెంజ్ వీడియో చేశారు.

సిల్హాట్ చాలెంజ్ ఈ మద్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టే ఈ జంట ఈ సారి ఈ చాలెంజ్ వీడియో ని పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ వీడియోకి ఎక్స్ టెన్షన్ గా చేతులు పట్టుకుని రింగారింగా రోజెస్ ఆడుతున్నట్టు డార్క్ లైట్ లో చేసిన వీడియో కూడా పోస్ట్ చేసి ట్రెండ్ లో ఉన్నారు రణవీర్, దీపికా.

1983వ సంవత్సరంలో కపిల్‌దేవ్‌ నడిపించిన ఇండియన్ క్రికెట్ టీమ్ విశ్వవిజేతగా ఎదిగి దేశ క్రికెట్‌ చరిత్రలో నవ శకానికి నాంది పలికింది. ఆనాటి భారత టీమ్‌ జర్నీని వెండితెరపై చూపించాలనే సంకల్పంతో 83 మూవీని తెర‌కెక్కించాడు డైరెక్టర్ క‌బీర్ ఖాన్ . విష్ణు ఇందూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ క‌పిల్ బ‌యోపిక్‌లో హీరో ర‌ణ్‌వీర్ సింగ్… కపిల్ దేవ్ గా నటిస్తున్నాడు. ఇక ఆయ‌న భార్య పాత్రను దీపికా పదుకొనె పోషిస్తుండటం విశేషం. సునీల్‌ గవాస్కర్‌ పాత్రలో తాహీర్‌ రాజ్‌ భాసిన్, అప్పటి టీమ్ మేనేజర్‌ మాన్‌ సింగ్‌ రోల్ లో పంకజ్‌ త్రిపాఠి, క్రికెటర్స్ సందీప్‌ పాటిల్‌ గా ఆయన కుమారుడు చిరాగ్‌ పాటిల్, శ్రీకాంత్‌ క్యారెక్టర్లో తమిళ్ యాక్టర్ జీవా కనిపించబోతున్నారు. ఇక ప‌లు మార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జూన్ 4న విడుద‌ల చేయ‌నున్నారు.

ఇదిలాఉంటే బాలీవుడ్‌ భామ దీపికా పదుకోనె సర్కస్‌కి వెళ్తారని సమాచారం.. అదీ కేవలం అతిథిగా మాత్రమే. రోహిత్‌ శెట్టి డైరెక్షన్లో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కస్‌’ మూవీలో దీపికా ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. రణ్ వీర్ సరసన పూజా హెగ్డే, జాక్వెలిన్ నటిస్తున్నారు. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో భర్త కోసమే దీపికా ఈ నిర్ణయం తీసుకుందట.

రణవీర్ సింగ్, అలియా భట్ మరోసారి కలిసి నటించనున్నారు. గల్లీబాయ్ తో కలిసొచ్చిన ఈ జంటకు…ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. అయితే ఈసారి వీళ్లిద్దరినీ కలిపేది కరణ్ జోహార్. తాజాగా ఓ ప్రేమ కథను సిద్ధం చేసిన ఆయన…తన సొంత నిర్మాణంలోనే తెరకెక్కించబోతున్నారని సమాచారం. అందుకోసం ఇప్పటికే రణ్ వీర్, అలియాల అంగీకరం కూడా లభించినట్టు ముంబై టాక్.

యే దిల్ హై ముష్కిల్ సినిమా తర్వాత లస్ట్ స్టోరీస్ ఇంకా ఘోస్ట్ స్టోరీస్ లోని కొన్న ఎపిసోడ్స్ కి దర్శకత్వం వహించారు కరణ్ జోహార్. అలియా భట్ మొదటి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకు సైతం ఆయనే డైరెక్టర్. ఇక దీపికా భర్త కమ్ హీరో రణ్ వీర్ సింగ్ తో మాంచి ర్యాపో ఉంది కరణ్ జోహార్ కి. అసలు రణ్ వీర్, అలియా కాంబినేషన్లో గతంలోనే తఖ్త్ అనే ప్రాజెక్ట్ ను ప్రకటించారు. అయితే అనుకోని కారణాల వల్ల అది అటకెక్కింది. దీంతో ఈ కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నారు.