తెలుగులో పెద్దగా ట్రెండ్ లో లేదు కానీ హాట్ ఫోటోషూట్స్ తో హార్ట్ బీట్ పెంచేస్తుంది రాశీఖన్నా. తాజాగా ఓవైపు తన అందంతో కట్టిపడేస్తూనే కిల్లర్ లుక్స్ తో రచ్చచేస్తుంది. మరో రోజు…మరో హత్య..క్స్ అంటూ కామెంట్ ను కూడా అటాచ్ చేసిందీ ఫోటోలతో. #BetweenTheShorts క్యాప్షన్ తో షేర్ చేసిన కిల్లింగ్ ఫోటోస్ ప్రెజెంట్ వైరలయ్యాయి. ప్రస్తుతం ఈ బొద్దుగుమ్మ ది ఫ్యామిలిమెన్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డికేలతో వెబ్ సిరీస్ చేస్తోంది. అందులోనే హాట్ కిల్లర్ పాత్రలో నటిస్తుందనే హింట్ ఇస్తోంది.
తెలుగులో ఒకే ఒక్క సినిమాలో రాశీ పేరు వినిపిస్తోంది. మారుతి డైరెక్షన్లో గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ చేస్తోంది. తమిళ్ లో మాత్రం మూడు చిత్రాలకు కమిటైంది. తుగ్లక్ దర్బార్, అరణ్మనై-3, మేథావి సినిమాల్లో లేడీ లీడ్ గా కనిపించనుంది. అంతేకాదు అటు మలయాళంలోనూ భ్రమం అనే ప్రాజెక్ట్ కు సైన్ చేసింది.

ప్రారంభం కూడా అవకముందే రిలీజ్ డేట్ ప్రకటించి వహ్వా అనిపించిన కాంబో గోపీచంద్ – మారుతి. అక్టోబరు 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ ఎంత డిఫరెంట్ గా ప్లాన్ చేసాడో…డైరెక్టర్ మారుతి టైటిల్ ని సైతం అంతే విభిన్నంగా ఫిక్స్ చేశాడు. అవును ఈ చిత్రానికి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టేనని టాక్.

కోర్ట్ బ్యాక్ డ్రాప్ లో గోపీంచంద్ నటించబోయే ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా బ్యూటీ గర్ల్ రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నాడు మారుతి. వీరి కాంబినేషన్లో హిట్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’ చ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే జిల్, ఆక్సిజన్ తర్వాత ముచ్చటగా మూడోసారి గోపీచంద్ సరసన నటించబోతుంది రాశీ ఖన్నా.

నిజానికి ఈ స్టోరీని మొదట రవితేజతో తీయాలని మారుతి అనుకున్నప్పటికీ.. ఆఖరికి గోపిచంద్ ను ఫిక్స్ చేసారట మేకర్స్! ఇంక చాలా రోజుల నుంతి తర్జనభర్జన పడుతున్న మూవీ యూనిట్ కి హీరోయిన్ కూడా సెట్ కావడంతో ‘పక్కా కమర్షియల్’ అవాంతరాలన్నీ తొలిగినట్టే. అతిత్వరలో సెట్స్ పైకెళ్లనున్న ఈ మూవీని చాలా వైవిధ్యంగా జనాల్లోకి తీసుకొస్తుంది మారుతి టీమ్. బన్నీ వాసుతో పాటూ యువి క్రియేషన్స్ వంశీ ప్రమోద్, విక్రమ్ కలిసి ఈ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్… గీతా ఆర్ట్స్ పతాకంపై సమర్పిస్తున్నారు.

మళ్లీ బిజీగా మారుతున్నారు రాశిఖన్నా. మారుతి రమ్మన్నా గోపీచంద్ వద్దన్నారని…ఇక రాశికి అవకాశాలు కష్టమని ఇలా నిన్నటివరకు ప్రచారం జరిగింది. అయితే ఆల్రెడీ కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న రాశిఖన్నా తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల్లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్నారు.
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ సరసన ఓ సినిమా చేసేందుకు రెడీఅయ్యారు. రాజ్ అండ్ డికె డైరెక్షన్ లో ఓ ఒరిజినల్ ఓటీటీ కోసం షాహిద్, రాశి ఖన్నా జతకడుతున్నారు.
ఇక తెలుగులో హవా తగ్గిందనుకునే టైమ్ లో మళ్లీ సాయి ధరమ్ తేజ సరసన ఛాన్స్ కొట్టేసారు రాశి ఖన్నా. సుకుమార్ శిష్యుడు డెబ్యూ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్న చిత్రంలో తేజ్ జోడిగా రాశి కనిపిస్తారట. ఇదే నిజమైతే వీరిద్దరి కాంబినేషన్ కిది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. సుప్రీం, ప్రతిరోజు పండగే సినిమాల తర్వాత ఈ సినిమా ద్వారా మెగా కంపౌండ్ లోకి రాశి మళ్లీ అడుగుపెట్టబోతుంది.