అమితాబ్ లాంటి గొప్ప నటుడితో కలసి నటించడం తన అదృష్టమంటోంది రష్మిక. గుడ్ బై మూవీలో అమితాబ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది రష్మిక. రీసెంట్ గా వీరిద్దరూ గుడ్ బై షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్మిక షూటింగ్ ఎక్స్ పీరియన్స్ ను పంచుకుంది.

అమితాబ్ పక్కన ఉంటే మనం ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది రష్మిక మందన్నా. గుడ్ బై షూటింగ్ లో అమితాబ్ తో జాయిన్ అయిన హీరోయిన్.. బిగ్ బీ అంతలా కంఫర్ట్ జోన్ లో వుంచుతారంటోంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం వచ్చిందని చెపుతోంది. ఇలా అమితాబ్ ను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతూ బాలీవుడ్ ఫోకస్ ని తనపై పూర్తిగా పడేలా చేస్తోంది. దీనినే కంటిన్యూ చేస్తూ సిద్దార్ద్ మల్హోత్రాతో నటిస్తున్న మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలు సక్సెస్ సాధిస్తే రష్మికను బాలీవుడ్ లో ఆపడం ఎవరితరం కాదంటున్నారు. మరి చూద్దాం బీటౌన్ లో ఎంతవరకు క్రేజ్ చూపిస్తుందో…

చబ్బిచబ్బిగా ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది రష్మిక మందన్నా. రీసెంట్ గా సుల్తాన్ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో చురుకుగా మాట్లాడి అటెక్షన్ క్రియేట్ చేసిన రష్మికా…మరో లుక్ తో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 5 రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ నుంచి ఆమె క్యూట్ లుక్ రిలీజైంది. శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల డైరెక్టర్.

చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది రష్మికా. పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు, మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ సినిమాల్లో అమితాజ్, సిద్దార్ద్ మల్హోత్రా వంటి స్టార్స్ తో చిత్రాలు చేస్తోంది. ఇలా నార్త్ టు సౌత్ ఫుల్ క్యూట్ లుక్స్ లో అలరిస్తున్న రష్మికా..ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంతో పూలు అల్లుకుంటూ కనిపిస్తోంది.

వైల్డ్ డాగ్ పుష్ అప్ ఛాలెంజ్ పేరుతో నాగార్జున సెలెబ్రిటీలకు సవాల్ విసురుతున్నారు. ఏప్రిల్ 2 వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు నాగ్. అందులో భాగంగానే పుష్ అప్ ఛాలెంజ్ ను తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన హీరోయిన్ రష్మికా కొన్ని సెకన్ల పాటూ పుష్ అప్ పొజిషన్ లో ఉండి..ఆ వీడియోను పోస్ట్ చేసింది. రష్మిక వీడియోని చూసిన నాగ్.. పుష్‌అప్‌ పొజిషన్‌లో దాదాపు 50సెకన్ల పాటూ ఉన్నారు. దాన్ని బీట్‌ చేయాలంటూ రష్మికకు మరో హార్డ్ ఛాలెంజ్‌ విసిరారు. ‘యూ నీడ్‌ టు బీట్‌ దిస్‌ డియర్’ అంటూ ఆమె ట్విట్టర్ అకౌంట్‌ని ట్యాగ్‌ చేసారు నాగార్జున.

స్టార్ హీరోయిన్ రష్మికకు ఎవరో సీక్రెట్ ఫ్రెండ్…ఓ రింగ్ ను గిఫ్ట్ గా పంపించారు. దానికి స్పందించిన రష్మిక నువ్వు పంపిన దాన్ని నేను పొందాను. నేను ఈ కానుక అందుకున్నానని, పంపిన వారు తెలుసుకోండి. నేను మీ సీక్రెట్ మెసేజ్ చదివాను. ఆ మెసేజ్ ను నేను ప్రేమిస్తున్నాను’ అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. అయితే ఇటీవలే విజయ్ దేవరకొండతో చట్టాపట్టాలేసుకుని ముంబై వీధుల్లో విహరించిన రష్మిక…ఇప్పుడిలా సీక్రెట్ ఫ్రెండ్ అంటూ ఎవరి గురించి చెప్తుందో అర్ధం కావట్లేదంటున్నారు ఆమె ఫ్యాన్స్. కాగా ఎంగేజ్ మెంట్ దాకా వెళ్లి క్యాన్సిల్ అయిన కన్నడ మాజీ లవర్ గురించి కాదుగా అని కొసరు చురకలు అంటిస్తున్నారు.

వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ.. తెలుగులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందాన . బాలీవుడ్ భామలు టాలీవుడ్ ని ఏలేస్తున్న ఈ టైమ్ లో కూడా స్టార్ హీరోలతో వరుసగా ఆఫర్లు కొట్టేస్తూ..హీరోలకు ఓన్లీ ఆప్షన్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. అక్కడి భామలు ఇక్కడ చక్రం తిప్పుతుంటే..రష్మిక కూడా నేనేం తక్కువా అంటూ బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు కొట్టేస్తోంది.

సౌత్ లో రష్మిక వరుసగా హిట్లు కొడుతూ మంచి జోష్ లో ఉంది . లాక్ డౌన్ టైమ్ లో స్క్రిప్టులు చదివానన్న రష్మిక వరుసగా సినిమాలు లైన్ లో పెట్టేస్తోంది. మిషన్ మజ్ను టైటిల్ తో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కోవర్టు ఆపరేషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్దార్ద్ మల్హోత్రా సరసన హీరోయిన్ గా నటిస్తోంది రష్మికమందాన. ఈ సినిమాకు సంబందించి అప్పుడే లక్నో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసేసుకుంది ఈ కన్నడ కస్తూరి. ఈ గ్యాప్ లోనే విజయ దేవరకొండతో కలిసి ముంబై రెస్టారెంట్స్ లో కనిపిస్తుంది.

బాలీవుడ్ ఎంట్రీ మీద సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నానని, కొత్త ఆడియన్స్ ని రీచ్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన రష్మిక .. ముంబై లో ఇల్లు కూడా కొనేసింది. బాలీవుడ్ బిగ్ బి కూతురుగా త్వరలోనే నటించబోతుంది. గుడ్ బాయ్ పేరుతో ఈ సినిమా రూపొందనుంది. అంతేకాదు ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ బాలీవుడ్ మూవీకి సైన్ చేసిందని టాక్ . మిషన్ మజ్ను కి సంబందించి షెడ్యూల్ కంప్లీట్ చేసిన రష్మిక .. ఇప్పుడు సుల్తాన్ సినిమా కోసం చెన్నై వచ్చేసింది. ఇక్కడ ఈ రిలీజ్ పనులు అయిపోగానే తన బాలీవుడ్ సెకండ్ వెంచర్ లో జాయిన్ అవుతోందని రష్మిక క్లోజ్డ్ సర్కిల్స్ లో న్యూస్ నడుస్తోంది.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో మూవీలో హీరోయిన్ రష్మికా ఫిక్సయిందని సమాచారం. పూజాహెగ్దే, కియారా, జాన్వీ కపూర్ వంటి పేర్లు వినిపించినా…చివరికి రష్మిక దగ్గర సెర్చ్ ఆగిందంటున్నారు. ఉగాది శుభ ముహూర్తాన ఏప్రిల్ 13న ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో పట్టాలెక్కనుందని సమాచారం. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ ప్రాజెక్ట్…వచ్చే సంవత్సరం ఏప్రిల్ 19న థియేటర్స్ కి రానున్నట్టు తెలుస్తోంది. అయినను పోయిరావలే హస్తినకు అన్న టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఉప్పెన ఫేం కృతిశెట్టి కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ సినిమా సంగతలా ఉంటే…ఇటు మార్చి 18న తన వైఫ్ లక్ష్మి ప్రణతి బర్త్ డే సందర్భంగా విలువైన కానుకను సమర్పించారట ఎన్టీఆర్. సిటీలో ఓ పెద్ద ఫామ్‌ హౌస్‌ను భార్య పేరిట రాయించి…అక్కడే సెలెబ్రేషన్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.

అమితాబ్ బచ్చన్, రష్మిక మంథన్న కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి గుడ్ బాయ్ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇందులో బిగ్ బీ, రష్మిక తండ్రీకూతుర్లుగా నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. అతిత్వరలో గుడ్ బాయ్ పట్టలెక్కనుంది.

మరోవైపు పాన్ ఇండియా గర్ల్ గా మారుతుంది రష్మిక. తెలుగు, తమిళ్, కన్నడతో పాటు హిందీ భాషలోనూ క్రేజీ సినిమాలు చేస్తోంది. ఇక అమితాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏజ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కాల్ షీట్స్ ఖాళీ లేకుండా గడుపుతున్నారు. మరి వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న గుడ్ బాయ్ ఎలా ఉంటుందో చూడాలి.

కోలీవుడ్‌లో ఓ సూపర్ ఆఫర్‌ అందుకున్నట్టు ఆ మధ్య రష్మికపై వార్తలొచ్చాయి. తమిళ్ ‘డాక్టర్‌’ మూవీ ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్లో స్టార్‌ హీరో విజయ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. మాస్టర్ తర్వాత విజయ్‌ 65వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో విజయ్‌ సరసన కొంతమంది హీరోయిన్స్ పేర్లు చర్చకు వచ్చినా రష్మికకే ప్రియారిటీ ఇచ్చారట దర్శకనిర్మతలు. అయితే కన్నడబ్యూటీ బిజీ షెడ్యూల్స్ కారణంగా విజయ్ సినిమాకి నో చెప్పిందని సమాచారం.

రష్మిక స్థానంలో విజయ్‌ జంటగా పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేసినట్టు చెప్తున్నారు. ఈమధ్యే విజయ్ సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసింది పూజాహెగ్దే. దీంతో మేకర్స్ పూజాహెగ్దే వైపు చూస్తున్నట్టు టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’, శర్వానంద్‌ జోడీగా ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో ‘మిషన్‌ మజ్ను’ , ‘డాడి’ సినిమాల్లో నటిస్తోంది. కాగా తమిళంలో రష్మిక నటించిన మొదటి సినిమా ‘సుల్తాన్‌’ ఏప్రిల్‌ 2న రిలీజ్ కానుంది.

నితిన్, రష్మికా జంటగా నటించిన భీష్మ చిత్రానికి జాతీయ అవార్డు పేరుతో బురిడీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల స్పందించాడు.
ఆర్గానిక్ ఫామింగ్ నేపథ్యంగా తెరకెక్కించిన భీష్మ సినిమాకు నేషనల్ అవార్డు రావడం ఖాయమని నమ్మించాడట నవీన్ అనే వ్యక్తి. దాని అప్లికేషన్ నిమ్మిత్తమై 63వేల 6వందల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని డైరెక్టర్ తెలియజేసాడు. అయితే తన వ్యక్తిగత ఖాతాకు ఆ డబ్బులు వెళ్లినట్టు గుర్తించిన వెంకీ.. ఈ మోసం అందరికీ తెలియడం కోసమే తాను పోలీస్ కంప్లయింట్ చేసానని..తన ఫ్రెండ్స్ ఈ విషయం పై లైట్ తిసుకొమ్మన్నారని కానీ ఇలాంటి మోసగాళ్లు గురించి ప్రజలకి తెలియాలనే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాలని…ఇలాంటి మోసగాళ్లతో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొచ్చారు వెంకీ కుడుముల.

రౌడీబాయ్, లేడీడాల్ కలిసి మరోసారి కనిపించబోతున్నారని టాక్. విజయ్ దేవరకొండతో కలిసి రష్మికా మందన్నా మెరవనుందని అంటున్నారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో సూపర్ పెయిర్ అనిపించుకున్న ఈ జంటను డైరెక్ట్ చేయబోయేది టాలీవుడ్ లెక్కల మాస్టారు. అవును సుకుమార్, విజయ్ కాంబోమూవీలో రష్మికాను ఫైనల్ చేసారట. ప్రస్తుతం పుష్ప కోసం కష్టపడుతోన్న రష్మిక ఎనర్జీకి ఫిదా అయిన సుకుమార్…తన నెక్ట్స్ సినిమాలో కూడా రష్మికనే తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ నెక్ట్స్ సినిమా హీరో విజయ్ దేవరకొండ కావడంతో వీరి జంట మరోసారి కలిసే అవకాశం లభించింది.

ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో లైగర్ చేస్తోన్న విజయ్ దేవరకొండ..ఆ తర్వాత నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో ఓ మూవీకి సైన్ చేసారు. ఈ ప్రాజెక్ట్ తర్వాతే సుకుమార్ బడిలో చేరనున్నాడు. ఇక అప్పుడే వీరిద్దరితో కలిసి రష్మికా కొత్త పాఠాలు నేర్చుకోనుంది. ఓ వైపు సౌత్ టు నార్త్ వరు కమిట్మెంట్లతో బిజీగా ఉంది రష్మికా. ఆమెకు కూడా కొత్త సినిమాల్లో అడుగుపెట్టడానికి మరో సంవత్సరం పడుతుంది. దీంతో వచ్చే ఏడాది సుకుమార్ దర్శకత్వంలో రౌడీబాయ్, రష్మికా కలిసి నటిస్తారామో చూడాలి.