రామ్ చరణ్ ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ రవితేజ చేతిలోకి వెళ్లింది. డైరెక్టర్ జూనియర్‌ లాల్ 2019లో తెరకెక్కించిన మలయాళీ సూపర్ హిట్‌ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’. ఈ మూవీ తెలుగు రీమేక్‌ రైట్స్ కొంత కాలం క్రితమే హీరో రామ్‌చరణ్‌ సొంతం చేసుకున్నారు. కాగా ఈ రీమేక్‌లో విక్టరీ వెంకటేష్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌లు నటిస్తారని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ లో రవితేజ హీరోగా కనిపించనున్నారనే టాక్‌ ప్రస్తుతం వైరల్ గా మారింది.
మాస్ రాజాతో పాటూ మరో ప్రధాన పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి నటిస్తారట. ఈ సంగతిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిఉంది. ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న ‘ఖిలాడి’ మే 28న రిలీజ్ కానుంది. ఆ తర్వాత త్రినాథ్ రావు నక్కిన తో కలిసి పనిచేయనున్నాడు. ఇందులోనే హీరోయిన్ గా జాతిరత్నాలు ఫేం ఫరియా ఎంపికైందనే వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ మొదలెట్టే ఛాన్స్ ఉంది.

ఇటలీ మిలాన్ నగరంలో అనసూయ చిల్ అవుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అనసూయ ఇటలీకి ఎందుకు చేరుకుందని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. ఆమె రవితేజ కోసం అక్కడికి వెళ్ళింది. రవితేజతో కలిసి నటిస్తున్న ఖిలాడి షూటింగ్ ఇటలీలోని మిలాన్ సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక పాటతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ అక్కడే ప్లాన్ చేశారట మేకర్స్. అనసూయ కూడా ఆ షూటింగ్ లో దాదాపు పది రోజులకు పైగా పాల్గొనబోతుంది. ఈ యాక్షన్ సన్నివేశాల్లో అనసూయ కూడా కనిపించనుందట. చూస్తుంటే అనసూయకు ఏదో క్రేజీ రోల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

శివరాత్రికి ముహూర్తం
మాస్ రాజా రవితేజ నటిస్తోన్న ఖిలాడి టీజర్ ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజ్ చేస్తున్నారు. అర్జున్, అనసూయ కీరోల్స్ ప్లే చేస్తోన్న ఖిలాడి మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హీరోయిన్ పక్కా..?
గోపీచంద్ – మారుతి పక్కా కమర్షియల్ మూవీలో హీరోయిన్ గా రాశిఖన్నా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఇందులో మరో హీరోయిన్ గా తెలుగమ్మాయి ఈశారెబ్బా కనిపించనుందట.

రామ్..ఊర మాస్
పందెంకోడి, ఆవారా సినిమాల డైరెక్టర్ లింగుస్వామితో…హీరో రామ్ తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. లింగు స్వామి చెప్పిన ఊర మాస్ స్టోరి రామ్ కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని టాక్.

పవర్ ప్లే…కమింగ్
కొండా విజయ్ కుమార్, రాజ్ తరుణ్ కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ ప్లే మూవీ మార్చి 5న రిలీజ్ కానుంది. రీసెంట్గా ఈ మూవీ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

సైజ్ జీరో అనుష్కలా…
అజయ్ దేవగణ్ సరసన ప్రణీత నటిస్తోన్న కొత్త సినిమాలో ఆమె రెండు పాత్రలు చేస్తున్నారట. ఒకటి నాజుకుగా కనబడే రోల్ కాగా మరొకటి సైజ్ జీరో అనుష్కలా భారీకాయంతో కనిపించే పాత్ర కావడం విశేషం.

ఇంతవరకు రొమాంటిక్ సీన్స్ లో అయితే నటించారు కానీ…గాడ అదర చుంబనానికి దూరంగానే ఉన్నారు రవితేజ. కానీ ఇప్పుడా హద్దును చెరిపేసారు. ఖిలాడిగా హీరోయిన్ మీనాక్షి చౌదరి లిప్ లాక్ చేసారు. క్రాక్ హిట్ తో మంచి ఊపుమీదున్న మాస్ రాజా…ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి చిత్రాన్ని చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇందులోనే హాట్ యాంకర్ అనసూయ కూడా కీ రోల్ పోషిస్తున్నారనే వార్తలొస్తున్నాయి. కాగా తాజాగా మీనాక్షి చౌదరికి… ఇంగ్లీష్ ముద్దిచ్చి హాట్ టాపిక్ గా మారారు రవితేజ.
నిజానికి రవితేజ ముద్దాటకి అంగీకరించలేదట. కానీ డైరెక్టర్ రమేశ్ వర్మ బలవంతంగా ఒప్పించి లిప్ లాక్ ఇప్పించారట. తాజాగా రెడ్ మూవీతో రామ్ కూడా లిప్ కిస్ కి తెరలేపారు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు సైతం హీరోయిన్ పెదవిని టచ్ చేసినవాళ్లే. బాలీవుడ్ లో కామన్ అయిపోయిన లిప్ లాక్…ఇప్పుడు టాలీవుడ్ లోనూ హద్దులు చెరిపేస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత జోరు మరింత పెరిగింది. ఇప్పుడిక రవితేజ కూడా లిప్ లైన్లోకి వచ్చేసారు.