కరోనా కాటు తర్వాత సంక్రాంతి కానుకగా ఓ పెద్ద సినిమా రాబోతోంది అనుకుంటే…ఆదిలోనే అవాంతరం ఎదురైంది. రవితేజ క్రాక్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకి పొద్దుపొద్దున్నే నిరాశే మిగిలింది.
ఆర్థిక లావాదేవీల కారణంగా థియేటర్స్ లో క్రాక్ సినిమా పడలేదు. ప్రొడ్యూసర్ కి, చెన్నై ఫైనాన్షియర్ కి మధ్య మనీ మాటర్ ముదరటంతో వివాదం రాచుకుంది.

ప్రస్తుతం చెన్నై కోర్టు వరకు ఈ వివాదం వెళ్ళింది. ఈ గొడవల నడుమ మార్నింగ్ ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. 11గంటల నూన్ షో కూడా కాన్సిల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 12గంటల నుంచి షోలు పడతాయని నిర్మాత సన్నిహితులు చెబుతున్నారు. ఇక మార్నింగ్ షోలకు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు డబ్బులు వాపస్ ఇచ్చేశారు థియేటర్ సిబ్బంది. దీంతో ట్విట్టర్ వేదికగా తమ నిరాశను..ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆడియెన్స్.