మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ సినిమా చేయబోతున్నారనే వార్త జోరందుకుంది. గతంలో ప్రతిబంధ్, ఆజ్ కా గుండా రాజా, ది జెంటిల్ మెన్ వంటి హిందీ చిత్రాలు చేసిన అనుభవం చిరూకుంది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత బిగ్ బి అమితాబ్ కోసం చిరంజీవి సినిమా చేస్తున్నారని సమాచారం. మెగాస్టార్ అడిగిన వెంటనే సైరా లో పాత్ర చేసిన అమితాబ్…ఇప్పుడు చిరంజీవిని రిస్వెస్ట్ చేసారని…చిరూ కూడా వెంటనే అంగీకరించారని తెలుస్తోంది. మరి ఆయన చేస్తున్నది ఫుల్ లెంత్ పాత్రా…గెస్ట్ క్యారెక్టరా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మే 13న రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతుంది. అయితే ఇందులో హీరోయిన్ రెజీనా చిరూ సరసన స్టెప్పులేసినట్టు టాక్. చిరూ, చరణ్ లపై కొరటాల శివ చిత్రీకరించిన ఓ స్పెషల్ సాంగ్ లో రెజీనా కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే దీనిపై అధికార సమాచారం రావాల్సిఉంది.

ఆ మూవీలో అంటే… ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో రెజీనా శూర్పణఖగా కనిపిస్తోందా అనుకోకుండి. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న రెజీనా కొత్త చిత్రానికి తెలుగులో ‘నేనేనా’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేయగా…తమిళ్ లో ‘శూర్పణగై’ అన్న టైటిల్ పెట్టారు. ఓ పరిశోధనాత్మక మూవీగా తెరకెక్కతుందీ ప్రాజెక్ట్. ఈ పరిశోధన దేని గురించి అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌ అంటున్నారు. తమిళ్ లో శూర్పణగైగా పేరు పెట్టడంతో మరీ.. చిత్రంలో శూర్పణఖ రెజీనానేనా? లేదా వేరే ఎవరైనా నటిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. కార్తీక్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ రీసెంట్ గా ప్రారంభమైంది. హారర్‌ కథాంశంగా సాగే ఈ సినిమాలో రెజీనా చేసే పరిశోధన అనేక మలుపులకు దారి తీస్తుందట. ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే సన్నివేషాలతో ఆద్యంతం ఆసక్తికరంగా మలుస్తున్నామని ప్రకటించింది చిత్రయూనిట్.