అగ్ర హీరోలతో హెవీ బడ్జెట్ సినిమాలే కాదు.. యువతను, ఫ్యామిలీ ప్రేక్షకుల హృద‌యాలను తాకేలా క్యూట్ చిత్రాలను అందిస్తూ ఎన్నో బంపర్ హిట్స్ ను తమ ఖాతాలో వేసుకున్న ప్రొడక్షన్ హౌజ్… శ్రీవేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. ఓ వైపు పవన్ కల్యాణ్, రామ్ చరణ్ అంటూ సినిమాలు తెరకెక్కిస్తూనే…తాజాగా తెలుగు ఆడియెన్స్ ను మెప్పించేందుకు మ‌రో స్పెషల్ కుటుంబ కథా చిత్రం ‘షాదీ ముబారక్‌’తో త్వరలోనే రాబోతుంది.

సీరియల్స్ ఫేం వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ జంటగా నటించిన ఈ మూవీని పద్మ శ్రీ డైరెక్ట్ చేసారు. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా వ్యవహరించారు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబయింది ‘షాదీ ముబారక్‌. ఈ సంద‌ర్భంగా మూవీ యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే మొగలి రేకులు సీరియల్ తో మంచి పేరుతెచ్చుకొన్న సాగర్..ఇంతకుముందు హీరోగా ఓసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నడు. ప్రస్తుతం అగ్ర నిర్మాత దిల్ రాజు సహాయంతో మరోసారి రంగంలోకి దిగుతున్నాడు. చూద్దాం..ఈసారి సక్సెస్ సాధిస్తాడేమో