ఓ వైపు 40 మిలియన్ ప్లస్ వ్యూస్ తో రాఖీ భాయ్ కేజీఎఫ్ కొత్త ట్రెండ్ సృష్టిస్తుంటే..మరోవైపు నయన తార ‘రాకీ’ అంటూ ఓ టీజర్ ను రిలీజ్ చేసారు. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలతో ఆకట్టుకున్న ఈ జంట.. తాజాగా ”రాకీ” అనే తమిల్ మూవీతో త్వరలోనే రానున్నారు. ‘తారామణి’ మూవీతో పేరు తెచ్చుకున్న వసంత్ రవి ‘రాకీ’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించాడు. వెటరన్ డైరెక్టర్ భారతీరాజా, రోహిణి, రవీనా రవి ప్రధాన తారగణంగా కనిపించనున్నారు. అరుణ్ మధేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదో రివేంజ్ యాక్షన్ డ్రామా అని విషయం ఈ టీజర్ తో తెలుస్తుంది. ‘మనిషి ఓ అత్యంత క్రూరమైన జంతువు’ అని ప్రారంభమైన ఈ టీజర్ చాలా వైలెంట్ గా ఉంది. భారతీరాజా చూస్తుండగా.. వసంత్ రవి ఒక వ్యక్తి పీకని అతి కిరాతకంగా కోయడం జుగుప్సాకరంగా ఉంది. ఆపై చనిపోయిన వ్యక్తి పేగులని తీసి అతని మెడలోనే వేయడం ద్వారా ఈ సినిమా ఎంత భయంకరంగా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. ‘తూటా’ ఫేమ్ దర్బుక శివ దీనికి మ్యూజిక్ అందించాడు. నయన తార – విఘ్నేష్ శివన్ కాంబో నిర్మాణం నుంచి ‘రాకీ’ చిత్రం త్వరలోనే థియేటర్స్ కి రానుంది.

Source: Lahai Music