‘ఆర్ఆర్ఆర్’ కి సంబంధించి నేటి మధ్యాహ్నం 2గంటలకు క్రేజీ న్యూస్ చెప్పేసారు రాజమౌళి. అందరూ అనుకున్నట్టుగానే విజయదశమి బరిలోనే ఆర్ఆర్ఆర్ ను దింపారు జక్కన్న. అయితే అక్టోబరు 8న కాకుండా ‘అక్టోబరు 13’న రిలీజ్ చేయబోతున్నారు. ఈసారి దసరా కూడా అక్టోబరు 15న రాబోతుంది. దీంతో అసలైన పండుగ జోరు 13న మొదలుకానుంది.

వచ్చే నెల ఫిబ్రవరితో ఆర్ఆర్ఆర్ లాస్ట్ షెడ్యూల్ పూర్తవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ సన్నివేషాల షూట్ దాదాపు కంప్లీట్ అయింది. మిగిలిన కొన్ని సీన్స్ చిత్రీకరణ అయిపోయాక ఫిబ్రవరి ఎండింగ్ లో గుమ్మడికాయ కొడతారు. ఆ తర్వాత దాదాపు 6నెలల పాటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటారు రాజమౌళి. గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ వంటి వాటి కోసం జక్కన్న ఎలా పరితపిస్తారో అందరికీ తెలిసిందే. అందుకే షూటింగ్ అంతా ఒక ఎత్తు, పోస్ట్ ప్రొడక్షన్ ఒక ఎత్తు. రెండింటిని సమన్వయం చేసుకుంటారు కనుకనే రాజమౌళి దర్శకధీరుడిగా రాణిస్తున్నారు.