అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న త్రిపుల్ ఆర్ నుంచి వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. అందరి పుట్టినరోజులకు ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేసుకుంటూ వచ్చారు రాజమౌళి. ఇప్పుడిక అజయ్ దేవగణ్ వంతు వచ్చింది. ఏప్రిల్ 2 అజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ‘RRR’ టీమ్ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని మరో పోస్టర్ ద్వారా ప్రకటించారు రాజమౌళి. ఈ లిస్ట్ లో ఇక మిగిలింది శ్రీయ మాత్రమే. మరి ఆమె లుక్ కూడా డేట్ చూసుకొని రిలీజ్ చేస్తారో…లేదంటే డైరెక్ట్ థియేటర్ లోనే చూసుకోమంటారో చూడాలి.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ సర్‌ప్రైజ్ చేసింది. మార్చి 27న చెర్రీ బర్త్ డే కావడంతో ఒకరోజు ముందుగానే త్రిపుల్ ఆర్ టీమ్ అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ మూవీలో అల్లూరిగా చెర్రీ గర్జన ఏరకంగా ఉండబోతోందో జస్ట్ ఓ చిన్న శాంపిల్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ధైర్యం, నిజాయితీ, సమగ్రత ఈ మూడింటిని కలయికే మా అల్లురి సీతారామరాజు అంటూ ఫస్ట్ లుక్ ను పరిచయం చేసారు డైరెక్టర్ రాజమౌళి. నా అన్న రామరాజు లుక్ అంటూ అటు ఎన్టీఆర్ సైతం రామ్ చరణ్ కు విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామరాజు జోడీగా సీత పాత్రలో అలియా మెరవనుంది. 400కోట్ల భారీ బడ్జెట్ తో…పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీఅవుతోంది.

త్రిపుల్ ఆర్ సీత వచ్చేసింది. రామరాజు రాక కోసం బలమైన సంకల్పంతో సీత ఎదురుచూస్తోంది. ఆమె ఎదురుచూపులు గొప్పవంటూ సీతగా ఆలియా భట్ ను ఇంట్రడ్యూస్ చేసారు రాజమౌళి. ఈ సినిమాలో ఆలియా.. రామ్ చరణ్ సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈమధ్యే త్రిపుల్ ఆర్ లోని ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ఆలియా…త్వరలోనే మరో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొనబోతుంది.

త్రిపుల్ ఆర్ నుంచి ఒక్కొక్కరినీ తెరమీదికి తీసుకొస్తున్నారు రాజమౌళి. మొదట ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చెర్రీ రోల్ రివీల్ చేసారు. ఆపై చరణ్ వాయిస్ ఓవర్ తో కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ని పరిచయం చేసారు. రీసెంట్ గా ఎన్టీఆర్ జోడీగా నటిస్తోన్న హాలీవుడ్‌ బ్యూటీ ఒలీవియా మోరీస్‌ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా… ఇప్పుడిక ట్రెడిషనల్ లుక్ లో ఆలియాను ప్రెజెంట్ చేసారు జక్కన్న.

ఆర్ఆర్ఆర్ నుంచి లీడ్ రోల్స్ ఎంట్రీ ఇచ్చేసారు. ఇక మిగిలింది… అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రీయా శరణ్, రే స్టీవెన్ సన్ , అలిసన్ డూడీ ఫస్ట్ లుక్స్. రాజమౌళి సినిమా అంటేనే ప్రచారం ఓ రేంజ్ లో ఉంటుంది. ఇప్పటివరకూ రిలీజైనవి ఫస్ట్ లుక్స్ మాత్రమే. అక్టోబరు 13న త్రిపుల్ ఆర్ థియేటర్స్ కి వచ్చేవరకూ…రాజమౌళి ఎన్నో సర్ప్రైజెస్ ప్లాన్ చేసారని సమాచారం. 400కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ కోసం మొత్తానికి ఇలా ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు మేకర్స్.

గ్లాడియేటర్, ఎక్స్ మెన్ వంటి హాలీవుడ్ చిత్రాల యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ రంగంలోకి దిగారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో సందడి చేస్తున్నారు. నిక్ పర్యవేక్షణలో రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ నిర్విరామంగా జరుగుతోంది. ఎన్టీఆర్, చరణ్ కలిసిచేస్తోన్న ఈ పోరాటం కోసం 40మంది అమెరికన్ ఫైటర్స్ ను తీసుకొచ్చారు. అయితే ఈ హీరోల కాంబినేషన్ సీన్స్ దాదాపు గత వారాల్లోనే పూర్తయ్యాయి. కాగా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వారితో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. వారి సన్నివేషాల చిత్రీకరణ అయిపోగానే చెర్రీ, యంగ్ టైగర్ బరిలోకి దిగనున్నారు.

పెద్ద సినిమా హక్కుల కోసం ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టేందుకు పోటీపడుతున్నాయి. రీసెంట్ గా ప్రభాస్ సలార్ కోసం అమేజాన్ 100కోట్లను వెచ్చించేందుకు చూస్తుందనే వార్త రాగా…తాజాగా రాజమౌళి మూవీ త్రిపుల్ ఆర్ కోసం స్టార్‌ నెట్‌వర్క్‌ సంస్థ భారీ మొత్తాన్ని ఎరగా వేస్తుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీ ఓటీటీ రైట్స్ అక్షరాలా 200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు ఓ వార్త బాగా వైరల్‌ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటూ హిందీ హక్కులను సైతం స్టార్‌ నెట్‌వర్క్‌ సొంతం చేసుకోబోతున్నట్లు టాక్‌ నడుస్తోంది. అంటే సినిమా హాళ్లలో రచ్చ చేసిన అనంతరం ఆర్ఆర్ఆర్ నేరుగా ఓటీటీ వేదిక డిస్నీ + హాట్‌స్టార్‌లో సందడి చేస్తుందంటున్నారు. ఇక ఓన్లీ ఓటీటీ కోసమే 200 కోట్ల డీల్ జరిగితే థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందోనని నోరెళ్లబెడుతున్నారు సినీజనాలు. అయితే ఈ వార్తపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ ఇంతవరకు రాలేదు. ఇదే నిజమైతే మాత్రం ఓటీటీలో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను సుమారు పది భాషల్లో నిర్మిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకున్న విషయం తెలసిందే. ఈమధ్యే రాజమౌళి సైతం వీరులిద్దరూ కలిసి పోరాటాన్ని చేసే సమయం ఆసన్నమైందని ఓ ఫోటోను రిలీజ్ చేసారు. మరి జక్కన్న ఓ రేంజ్ లో తెరకెక్కిస్తున్న అత్యంత బీభత్స యుద్ధ సన్నివేశాల్లో పాల్గొనాలంటే అంతకుమించిన కఠినమైన కసరత్తులు చేయాల్సిందే. ప్రస్తుతం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ అదే పనిలో ఉన్నారు. యుద్ధానికి కాస్త బ్రేక్ ఇచ్చి పోరాట సన్నివేశాల గురించి మాట్లాడుకుంటూ చిల్ అవుతున్నారు. సెట్లో సందడి చేస్తున్నారు. ఆ ఫోటోలే ఇప్పుడు వైరల్ గా మారాయి.

రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తోన్న భారీ మల్టీస్టారర్‌ ప్యాన్ ఇండియన్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). కొమురం భీమ్‌ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ కనిపించనున్నారు. అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రీయ వంటి వారు వివిధ పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఆర్ఆర్ఆర్’ కి సంబంధించి నేటి మధ్యాహ్నం 2గంటలకు క్రేజీ న్యూస్ చెప్పేసారు రాజమౌళి. అందరూ అనుకున్నట్టుగానే విజయదశమి బరిలోనే ఆర్ఆర్ఆర్ ను దింపారు జక్కన్న. అయితే అక్టోబరు 8న కాకుండా ‘అక్టోబరు 13’న రిలీజ్ చేయబోతున్నారు. ఈసారి దసరా కూడా అక్టోబరు 15న రాబోతుంది. దీంతో అసలైన పండుగ జోరు 13న మొదలుకానుంది.

వచ్చే నెల ఫిబ్రవరితో ఆర్ఆర్ఆర్ లాస్ట్ షెడ్యూల్ పూర్తవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ సన్నివేషాల షూట్ దాదాపు కంప్లీట్ అయింది. మిగిలిన కొన్ని సీన్స్ చిత్రీకరణ అయిపోయాక ఫిబ్రవరి ఎండింగ్ లో గుమ్మడికాయ కొడతారు. ఆ తర్వాత దాదాపు 6నెలల పాటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటారు రాజమౌళి. గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ వంటి వాటి కోసం జక్కన్న ఎలా పరితపిస్తారో అందరికీ తెలిసిందే. అందుకే షూటింగ్ అంతా ఒక ఎత్తు, పోస్ట్ ప్రొడక్షన్ ఒక ఎత్తు. రెండింటిని సమన్వయం చేసుకుంటారు కనుకనే రాజమౌళి దర్శకధీరుడిగా రాణిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ కి సంబంధించి నేటి మధ్యాహ్నం 2గంటలకు క్రేజీ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు రాజమౌళి. కాగా ఆ విషయం ఏంటన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే జక్కన్న అనౌన్స్ చేస్తున్నది ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్. అవును విజయదశమి కానుకగా ‘2021 అక్టోబరు 8’న రిలీజ్ కానుంది ఆర్ఆర్ఆర్. దీంతో పాటూ ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక అందరూ అనుకున్నట్టుగానే దసరాకే సినిమా అని ఆల్రెడీ ఇందులో నటించే ఐరిష్ నటి పోస్ట్ చేసి డిలీట్ చేసేసింది. దీంతో ఇంక ఆలస్యం చేయకుండా రాజమౌళి నేరుగా రంగంలోకి దిగుతున్నారు.

వచ్చే నెల ఫిబ్రవరితో ఆర్ఆర్ఆర్ లాస్ట్ షెడ్యూల్ పూర్తవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ సన్నివేషాల షూట్ దాదాపు కంప్లీట్ అయింది. మిగిలిన కొన్ని సీన్స్ చిత్రీకరణ అయిపోయాక ఫిబ్రవరి ఎండింగ్ లో గుమ్మడికాయ కొడతారు. ఆ తర్వాత దాదాపు 6నెలల పాటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటారు రాజమౌళి. గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ వంటి వాటి కోసం జక్కన్న ఎలా పరితపిస్తారో అందరికీ తెలిసిందే. అందుకే షూటింగ్ అంతా ఒక ఎత్తు, పోస్ట్ ప్రొడక్షన్ ఒక ఎత్తు. రెండింటిని సమన్వయం చేసుకుంటారు కనుకనే రాజమౌళి దర్శకధీరుడిగా రాణిస్తున్నారు. సో ఏదైమైనా మధ్యాహ్నం 2గంటలకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ తో రానున్నారు రాజమౌళి.