ప్రభాస్ ఆదిపురుష్ కోసం భారీ గ్రీన్ మ్యాట్ సెట్స్ ని నిర్మించిన విషయం తెలిసిందే. దాదాపు 60శాతానికి పైగా షూటింగ్ ని ఈ గ్రీన్ మ్యాట్ సెట్స్ పైనే చిత్రీకరించనున్నారు. అయితే తాజాగా సహజంగా ఉండే పెద్ద ఫారెస్ట్ సెట్‌లో ప్రస్తుతం షూట్ చేస్తున్నట్టు టాక్. రామాయణంలో అడవిలోనే కీలక ఘట్టాలు సాగుతాయి. కాబట్టి అడవి కోసం అద్భుతమైన సెట్ వేసారని చెప్తున్నారు.

మరోవైపు ప్రభాస్ ను రాంబోలా చూపించేందుకు రెడీ అవుతున్నారట డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్. సిల్వస్టర్ నటించిన హాలీవుడ్ రాంబో రీమేక్ లో మొదట టైగర్ ష్రాఫ్ ను అనుకున్నా ప్రభాస్ ను ఫిక్స్ చేసారని తెలుస్తోంది. నిజానికి మూడేళ్ల క్రితమే టైగర్ హీరోగా సిద్ధార్ధ్ సినిమాను ప్రకటించాడు. కానీ టైగర్ ఎంతకీ డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడంతో ప్రభాస్ ని కలిసాడని టాక్. ప్రభాస్ కూడా రాంబో చిత్రానికి దాదాపు ఎస్ చెప్పినట్టే అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2022లో ఈ సినిమా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.