రామ్ చరణ్ ఎవరితో నెక్ట్స్ సినిమా అనౌన్స్ చేస్తారా అని వెయిట్ చేసినవాళ్లకి ..డైరెక్టర్ శంకర్ తో అని ఎక్స్ పెక్ట్ చెయ్యని సర్ ప్రైజ్ ఇచ్చారు చరణ్ . సినిమా అనౌన్స్ అయితే చేశారుకానీ , అటు డైరెక్టర్ , ఇటు హీరో ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడప్పుడే మొదలుపెట్టరులే అనుకున్నారు అందరూ. కానీ సర్ ప్రైజింగ్ గా ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మూవీ స్పీడప్ అవుతోంది.

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ సినిమాకి బాగా టైమ్ తీసుకుంటారు, అందులోనూ భారతీయుడు 2 సగంలో ఆగిపోయింది.. సో ఇక సినిమా మొదలయ్యేది నెక్ట్స్ ఇయరే అనుకున్నారు అందరూ. కానీ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్టింగ్ వర్క్ లో బిజీగా ఉన్న శంకర్ టీమ్ .. జూన్ నుంచి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి అన్ని ప్లాన్లు వేసేసుకున్నారు. ట్రిపుల్ ఆర్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్ .. మే కి ఆ సినిమాకి సంబందించి పనులన్నీ కంప్లీట్ చేసుకుని శంకర్ మూవీకి షిఫ్ట్ అవ్వబోతున్నారు.

శంకర్ -చరణ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఎగ్జైటింగ్ గా ఉన్న ఫ్యాన్స్ కి .. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని అనౌన్స్ చెయ్యడంతో సినిమా వేరే లెవల్ కి వెళ్లిపోయింది. అంతేకాదు శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో స్టార్ కాస్ట్ గురించి ఎక్స్ పెక్టేషన్స్ హైరేంజ్ లోఉన్నాయి. మామూలుగానే స్టార్ డైరెక్టర్,ఆపై రామ్ చరణ్ అంతకుమించి ప్యాన్ ఇండియా రేంజ్, ఈ 3మ్యాచ్ అవ్వాలంటే స్టార్ కాస్ట్ అదే రేంజ్ లో ఉండాలంటున్నారు ఫ్యాన్స్ .

రామ్‌చరణ్‌ సరసన కియారా అద్వాణీ మరోసారి కనిపించనుందా? అంటే ఎస్ అంటున్నాయి చిత్రవర్గాలు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రాజెక్ట్ తర్వాత చెర్రీ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్.. జూలై నుంచి పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ కాంబోమూవీలో రామ్ చరణ్ జంటగా కనిపించే హీరోయిన్ ను ఫిక్స్ చేసేందుకు సిద్ధమైంది మూవీయూనిట్. ఈ రోల్ కోసం కొరియన్‌ గర్ల్ సుజీబేను సెలెక్ట్ చేసినట్టు నిన్నటివరకు బాగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడా అవకాశాన్ని కియారా కొట్టేసినట్టు చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందంటున్నారు. ఒకవేళ అదే జరిగితే… వీళ్లిద్దరి కాంబినేషన్లో రానున్న రెండో సినిమా అవుతుంది. గతంలో చరణ్, కియారా కలిసి ‘వినయ విధేయ రామ’లో కనిపించారు.

2021లో స్పీడ్ పెంచారు టాలీవుడ్ హీరోలు. నెమ్మదిగా కాదు…ఒక్కో సినిమాను పరుగెత్తించాలనే పథకం రచిస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఈ రేసులో వెనుకపడుతారా అన్న ప్రశ్న ఇప్పుడు అభిమానులని వెంటాడుతుంది. రాజమౌళి తర్వాత శంకర్…త్రిపుల్ ఆర్ తర్వాత చెర్రీ మూవీ కోసం మరో మూడేళ్లు వెయిట్ చేయాలా అన్న ఆందోళన మొదలైంది. మరి సంవత్సరాల తరబడి సినిమాను పొడిగించే శంకర్ లాంటి డైరెక్టర్ని ఎలా…ఎవరు లైన్ లోకి తీసుకొస్తున్నారు?

స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబో అనగానే కాస్త భయపడుతున్నారు మెగాఫ్యాన్స్. శంకర్ తో సినిమా అంటే రెండూ, మూడేళ్ల సమయం పడుతుంది. ఓవైపు మిగిలిన హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతుంటే…శంకర్ డైరెక్షన్లో చెర్రీ లాక్ అయినట్టేనా అన్న చర్చ నడుస్తోంది. ఒక్కో మూవీకి ఎక్కువ టైం తీసుకునే రాజమౌళి… త్రిపుల్ ఆర్ ను త్వరగా తీసుకొద్దామనుకున్నా…కరోనా కారణంగా అదీ వెనక్కి వెళ్లింది. ఆపై శంకర్ తో ప్రాజెక్ట్.. మరి మెగాపవర్ స్టార్ పొజిషన్ ఏంటి అన్నది హాట్ టాపిక్ గా మారింది.

చరణ్, శంకర్ ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చేస్తుంది దిల్ రాజు. మూవీ కమిటైతే చాలు… పక్కా ప్రణాళికాతో వెళ్లే నిర్మాత ఆయన. ప్రతి సినిమాను ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి చూసుకునే దిల్ రాజు… ఇదే ఫార్ములాను శంకర్‌-చెర్రీ ప్రాజెక్ట్ విషయంలోనూ పాటిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న సమయానికి చేసి తీరాల్సిందేనని పట్టుమీదున్నారు. ఇవే అంశాలను శంకర్‌ కి సైతం దిల్ రాజు కన్వే చేసారాని టాక్. సినిమా మేకింగ్‌ విషయంలో దిల్‌రాజు సూచనలను శంకర్‌ కూడా అంగీకరించినట్టు చెప్తున్నారు.

ప్రస్తుతం ఆర్ఆర్‌ఆర్‌, ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. ఇవి పూర్తయిన వెంటనే శంకర్‌తో సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు ఈ మూవీలోని విలన్ రోల్ కోసం అటు రణ్ వీర్ సింగ్ తో, ఇటు విజయ్ సేతుపతితో చర్చలు నడుస్తున్నాయి. ఎవరో ఒకరు ఫైనలయ్యాక అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. హీరోయిన్ గా రష్మిక ఫిక్స్ అయినట్టేనని టాక్. ఇలా అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎక్కడా ఆగేదేలేదంటున్నారు చెర్రీ, శంకర్, దిల్ రాజు.

భారతీయుడు-2 షూటింగ్ మళ్లీ మొదలు కానుందని టాక్. ఇప్పటికే 60 పర్సెంట్ చిత్రీకరణ పూర్తయిందని.. మిగిలిన పార్ట్ కూడా త్వరగా స్టార్ డైరెక్టర్ శంకర్ పూర్తి చేస్తారని టాక్. ఐ, రోబో 2.0 చిత్రాల తర్వాత శంకర్ కి బ్యాడ్ టైమ్ నడుస్తోందని బాగా వార్తాలొచ్చాయి. ఈ క్రమంలోనే పలు కారాణాల వల్ల వాయిదాపడుతూ వస్తోన్న భారతీయుడు 2 ఇక మళ్లీ పట్టాలెక్కే పరిస్థితి లేదనీ చెప్పుకొన్నారు. అందుకు తగ్గట్టే రామ్ చరణ్ తో తన 15వ సినిమాను ప్రకటించి వార్తల్లో నిలిచారు శంకర్.

దిల్ రాజ్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం భారతీయుడు చెక్ పెట్టడంలేదట శంకర్. మిగిలిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసి…దగ్గరుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకొని…రిలీజ్ డేట్ ప్రకటించాకే చెర్రీ మూవీ కోసం వర్క్ చేస్తారట శంకర్. కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు.

ఆహాచిత్రం తాజాగా చెప్పినట్టు క్రేజీ కాంబినేషన్ కి ముహూర్తం కుదిరింది. బ్యాడ్ టైమ్ నడుస్తుందనుకుంటున్న డైరెక్టర్ శంకర్ తో కలిసి ప్రాజెక్ట్ మొదలెట్టబోతున్నారు మెగాపవర్ స్టార్. దీంతో శంకర్ – చరణ్ కాంబో గురించి జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమేనని తేలింది. డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబో మూవీ గురించి ఎన్నోరోజులుగా ఓ వార్త చక్కర్లుకొడుతుంది. అయితే దానిని నిజం చేస్తూ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ స్కూల్ నుంచి చెర్రీ హీరోగా ఓ క్రేజీ మూవీ రావడం ఖాయమైంది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజుతో పాటూ రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించారు. ఇది దిల్ రాజు, శిరీష్ ల నిర్మాణంలో వస్తోన్న 50వ సినిమా కాగా, చెర్రీ నటిస్తోన్న 15వ సినిమా.

ప్రస్తుతం త్రిపుల్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ తో, ఆచార్యలో తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత రెండు సూపర్ ప్రాజెక్ట్స్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. అది మనం చెప్పుకున్నట్టు శంకర్‌దర్శకత్వం వహించే సినిమా కాగా మరొకటి జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించే ప్రాజెక్ట్ అని సమాచారం. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియన్ స్థాయిలో మలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తోన్న భారతీయుడు 2కి ఆది నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఓ పట్టాన ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీంతో మరో మూవీ కోసం ప్లాన్ చేస్తున్న శంకర్…రామ్ చరణ్ ను తన స్క్రిప్ట్ తో లాక్ చేసారు. హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో మల్టీస్టారర్ గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో చెర్రీతో పాటూ కేజీఎఫ్ యష్, విజయ్ సేతుపతి కూడా కనిపిస్తారని టాక్. 2022లో పట్టాలెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఈ ఫిబ్రవరి 14న ప్రకటించనున్నారు మేకర్స్.

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ స్కూల్ నుంచి ఓ క్రేజీ మూవీ రానుందట. అది కూడా స్టన్నింగ్ మల్టీస్టారర్ కావడం విశేషం. రామ్ చరణ్, యష్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట శంకర్. నిజానికి ప్రస్తుతం హీరోలందరి చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. కానీ చెర్రీ మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ తప్ప మరే చిత్రం అనౌన్స్ చేయలేదు. త్రిపుల్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ తో, ఆచార్యలో తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తున్నారు.

మరి రామ్‌చరణ్‌ ఆలోచిస్తున్న తదుపరి సినిమాలేంటీ అంటే… రెండు సూపర్ ప్రాజెక్ట్స్‌ సెట్స్ పైకి తీసుకెళ్లొచ్చనే టాక్ వినిపిస్తోంది. అది మనం చెప్పుకున్నట్టు శంకర్‌ దర్శకత్వం వహించే సినిమా కాగా మరొకటి జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించే ప్రాజెక్ట్. అయితే ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియన్ స్థాయిలో ముస్తాబవుతాయని సమాచారం. మరో విషయం ఏంటంటే…ప్రస్తుతం చెర్రీ చేస్తున్న త్రిపుల్ ఆర్, ఆచార్య రెండూ..మల్టీస్టారర్ చిత్రాలే. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో సైతం యశ్, విజయ్‌ సేతుపతితో కలిసి నటిస్తారట. ముగ్గురు మంచి ఈజ్ ఉన్న నటులే. చూడాలి మరి మాటలవరకేనా…నిజంగానే సెట్స్ పైకెళ్తారా అన్నది.

తెలుగు స్టార్ హీరో ప్లస్ కన్నడ స్టార్ హీరో కలిసి ఒకే సినిమాలో నటిస్తే…వీళ్లిద్దరితో పాటూ తమిళ్ స్టార్ హీరో కూడా కనిపిస్తే…ప్రేక్షకుల ఆనందానికి అవధులే ఉండవు. ఇప్పుడాలాంటి కలయికకు శ్రీకారం చుట్టుబోతున్నారట డైరెక్టర్ శంకర్. ‘రామ్ చరణ్’, ‘యశ్’ లతో పాటూ మరో ‘తమిళ్ హీరో’ను ఒకే సినిమాలో చూపించబోతున్నారట. ‘భారతీయుడు – 2’ తర్వాత ఓ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను తీసే ఆలోచనలో ఉన్నారట శంకర్. దీనికోసం ఇప్పటికే యశ్, చెర్రీలను సంప్రందించినట్టు తెలుస్తోంది. అలాగే ఆల్రెడీ ఓకే చెప్పిన తమిళ్ హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది.
నిన్నటివరకు పవన్ కల్యాణ్ – రాంచరణ్ కాంబినేషన్ లో శంకర్ సినిమా తీయనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ శంకర్ దృష్టిలో ఉన్నది రాంచరణ్, యశ్ అని తమిళ్ మీడియా వెల్లడించింది. ఓ చారిత్రక యుద్ధ నేపథ్యంగా శంకర్ మూవీ ప్లాన్ చేస్తున్నారట. ‘వార్ వీరులు’గా రాంచరణ్, యశ్ లను చూపించనున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2022లో పట్టాలెక్కే ఈ ప్రాజెక్ట్ 2027లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. చూద్దాం…ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడుతో బిజీగా ఉన్న శంకర్ ఏదైనా అధికారిక ప్రకటన చేస్తారేమో…