లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది ట్రిపుల్ ఆర్ . యాక్షన్ షూట్ తోపాటు ప్యాచప్స్ కంప్లీట్ చేస్తున్న RRR సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో కంటిన్యూ అవుతోంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ,బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబయ్ సెట్స్ లో జరుగుతోంది. విజయ దేవరకొండ సైతం ఇప్పట్లో ముంబై వదిలి వచ్చేలా లేడు. లైగర్ షూటింగ్ ఇంకా ముంబైలోనే చేస్తున్నారు పూరీ జగన్నాథ్.

చెర్రీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ట్రీట్ ఇచ్చిన చిరంజీవి ఆచార్య టీమ్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉంది. ఏప్రిల్ 2 నుంచి ఆచార్య సినిమా కోకాపెట్ లో మళ్లీ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ బెల్గాం ఆశ్రమంలో జరుగుతుంటే, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున నటిస్తోన్న సినిమా గోవాలో జరుగుతుంది. ఇక రామానాయుడు స్టూడియోలో శరవేగంగా దృశ్యం -2 షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు వెంకటేశ్.

మహేశ్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ గోవాలో జరుగుతుండగా… ఇటలీలో ఖిలాడీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు రవితేజ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబో పుష్ప సీన్స్ ను టోలీచౌకిలో చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ గని సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో కొనసాగుతుంది. సాయిధరమ్ తేజ్, దేవా కట్టా సినిమా రిపబ్లిక్ షూటింగ్ కూడా హైదరాబాద్ లోకల్ లొకేషన్స్ లోనే జరుగుతుంది.

మెగాఫ్యామిలీ హీరో సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘రిపబ్లిక్‘. క్రియేటివ్ డైరెక్టర్ దేవకట్టా డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసారట. ప్రజాస్వామ్యం కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను తాజాగా మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్‘ రిలీజ్ చేశారు. మూవీ టీమ్ కు ఆల్ దీ బెస్ట్ చెప్పారు.
ప్రస్థానం తర్వాత అంతటి రేంజ్ లో దేవకట్టా నుంచి సినిమా రాలేదు. అయితే సాయి తేజ్ తో తీస్తున్న రిపబ్లిక్ అంతకంటే హైరేంజ్ ఇంటెన్స్ డ్రామాగా ఉండబోతున్నట్టు టాక్. ఇందులో రమ్యకృష్ణ సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. మరి చూడాలి..74ఏళ్లుగా ప్రభుత్వం ఉందనే భ్రమలో బతుకుతున్నాం అంటూ ముందుకొస్తున్న రిపబ్లిక్ ప్రేక్షకులని ఎంతలా అలరిస్తుందో…

బిగ్ బాస్ ఫినాలేలో మాటిచ్చినట్టుగానే ఒక్కొక్కరికి ఒక్కో అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా మెహ‌బూబ్‌కు ఆచార్య‌లో కీ రోల్ పోషించే ఛాన్స్ ఇచ్చారట చిరూ. ఇందులో జానపద నృత్యకారుడిగా..మెహబూబ్ పాత్ర ఎమోషనల్ గా ఉంటుందని టాక్. ఇంట్రవెల్ కి ముందు చనిపోయే పాత్రతో ఓ రేంజ్ ట్విస్ట్ ఇస్తాడట మెహబూబ్.

మామ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంటే…అల్లుడు స్నేహ ధర్మాన్ని పాటిస్తున్నాడు. మంచు మనోజ్ అహం బ్ర‌హ్మాస్మి సినిమాలో గెస్ట్ రోల్‌ చేసేందుకు సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పాడ‌ట‌. పాత్ర వ్య‌వ‌థి త‌క్కువే అయినా సినిమాను మ‌లుపు తిప్పే పాత్ర అని స‌మాచారం. మనోజ్, సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అందుకే ఫ్రెండ్ కోసం కాదనకుండా అహం బ్రహ్మాస్మీ అంటున్నాడు తేజ్. కాగా మంచు మనోజ్ కిది కమ్ బ్యాక్ మూవీ. అహం బ్రహ్మాస్మీ రిజల్ట్ పై మనోజ్ సినీ కెరీర్ ఆధారపడిఉంది.

మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా వకీల్ సాబ్ చిత్రం నుంచి ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. సీరియ‌స్ లుక్‌లో ప‌వన్ కనిపిస్తుడగా… వెనుక నివేథా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల నిల్చుని ఉన్నారు.


మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా విరాట ప‌ర్వం నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేక‌ర్స్. సాయిపల్లవితో పాటూ ఈ ప్రాజెక్ట్ లో మిగిలిన లేడీ లీడ్స్ ను రానా తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేసారు.


అనసూయ నటించిన థ్యాంక్యూ బ్రదర్ మూవీ నుంచి మహిళలను పరిచయం చేస్తూ ఓ ఫోటోను రిలీజ్ చేసారు. స్ట్రాంగ్ ఉమెన్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షాలంటూ కామెంట్ చేసారు.

ఉమెన్స్ డే సందర్భంగా పలువురు సెలెబ్రిటీస్ విషెస్ షేర్ చేసారు. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న త‌ల్లి, స‌తీమ‌ణి, కూతురు ఫొటోను షేర్ చేస్తూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. తన తల్లి కాళ్లు నొక్కుతున్న ఫోటోను నాగశౌర్య పంచుకోగా… అమ్మతో సరదాగా ఉన్న పిక్ ను ధరమ్ తేజ్, తన జీవితంలో ఉన్న సూపర్ ఉమెన్స్ అంటూ సామ్ ఒక ఫోటోను పోస్ట్ చేసారు.


మళ్లీ బిజీగా మారుతున్నారు రాశిఖన్నా. మారుతి రమ్మన్నా గోపీచంద్ వద్దన్నారని…ఇక రాశికి అవకాశాలు కష్టమని ఇలా నిన్నటివరకు ప్రచారం జరిగింది. అయితే ఆల్రెడీ కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న రాశిఖన్నా తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల్లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్నారు.
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ సరసన ఓ సినిమా చేసేందుకు రెడీఅయ్యారు. రాజ్ అండ్ డికె డైరెక్షన్ లో ఓ ఒరిజినల్ ఓటీటీ కోసం షాహిద్, రాశి ఖన్నా జతకడుతున్నారు.
ఇక తెలుగులో హవా తగ్గిందనుకునే టైమ్ లో మళ్లీ సాయి ధరమ్ తేజ సరసన ఛాన్స్ కొట్టేసారు రాశి ఖన్నా. సుకుమార్ శిష్యుడు డెబ్యూ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్న చిత్రంలో తేజ్ జోడిగా రాశి కనిపిస్తారట. ఇదే నిజమైతే వీరిద్దరి కాంబినేషన్ కిది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. సుప్రీం, ప్రతిరోజు పండగే సినిమాల తర్వాత ఈ సినిమా ద్వారా మెగా కంపౌండ్ లోకి రాశి మళ్లీ అడుగుపెట్టబోతుంది.