పూరీ తమ్ముడు సాయిరాం శంకర్ కథానాయకుడిగా 12ఏళ్ల క్రితం బంపర్ ఆఫర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కమర్షియల్ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నట్టు రీసెంట్ గా ప్రకటించిన మూవీ టీమ్…తాజాగా పట్టాలెక్కేసింది. సురేష్ విజయ ప్రొడక్షన్స్, సినిమాస్ దుకాన్ నిర్మాణ సంస్థలు కలిసి బంపర్ ఆఫర్ 2ని ప్రారంభించాయి. సురేష్ యల్లంరాజుతో పాటూ సాయి రామ్ శంకర్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. బంపర్ ఆఫర్ తెలంగాణ నేపథ్యంగా రాగా…బంపర్ ఆఫర్ 2 రాయలసీమ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఫుల్ టు బిందాస్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ రెండో భాగానికి కూడా జయ రవీంద్రనే దర్శకుడు. అశోక స్క్రిప్ట్ అందించిన ఈ మూవీ హీరో శ్రీకాంత్ గెస్ట్ గా పూజా కార్య‌క్ర‌మాలతో షురూఅయింది. కాగా రెగ్యులర్ షూటింగ్ ఉగాది శుభసమాయన ఏప్రిల్ నెలలో మెదలుపెడతారని సమాచారం.