స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్‌ కాంబో ‘పుష్ప’ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో నటించనున్నారు బన్నీ. అయితే ఇందులో ఈ హీరో సరసన బాలీవుడ్‌ డాల్ సయూ మంజ్రేకర్‌ నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కండల వీరుడు సల్మాన్ ఖాన్ జోడిగా ‘దబాంగ్ 3’తో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది సయూ. ప్రజెంట్ ఈ భామ అడవి శేష్‌ హీరోగా చేస్తున్న ‘మేజర్’‌ మూవీలో నటిస్తోంది.
ఇక మైత్రీ మూవీ మేకర్స్‌ నుంచి రాబోతున్న పుష్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా…సాయి పల్లవి చెల్లెలిగా నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్పపై డైరెక్టర్‌ సుక్కు ఓ రేంజ్ కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాతో పూర్తి స్థాయి మాస్ పాత్రలో కనిపించనున్నారు అల్లు అర్జున్‌.