అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ సందర్భంగా…భారతదేశం పేరును అంత‌ర్జాతీయంగా నిలబెట్టిన సైనా నెహ్వాల్ బ‌యోపిక్ మూవీ సైనా ట్రైల‌ర్ రిలీజైంది. సైనా రోల్ లో హీరోయిన్ ప‌రిణీతి చోప్రా న‌టించిన ఈ సినిమా మార్చి 26న థియేటర్లకు రానుంది. ఓ స్పోర్ట్స్ డ్రామాకు ఉండాల్సిన అన్ని రంగులతో…హంగుల‌తో సైనాను డిజైన్ చేసినట్టు మేక‌ర్స్ ఈ ట్రైలర్ తోనే చూపించారు. దారి చూప‌డం ఒకటి చూపిన దారిలో వెళ్లడం అనేది ఇంకొక‌టి.. నువ్వు ఆ రెండో దానిపై శ్రద్ధ పెట్టు అని సైనా నెహ్వాల్ కు త‌న అమ్మ చెప్పే డైలాగ్స్ తో ఈ ట్రైల‌ర్‌ను స్టార్ట్ చేసారు. సైనా పాత్ర‌ను ఓన్ చేసుకునేందుకు ప‌రిణీతి చోప్రా బాగానే క‌ష్ట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. చిన్నారి సైనాగా భయంభయంగా బ్యాడ్మింట‌న్ అకాడ‌మీలో కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఒలింపిక్స్ మెడ‌ల్ గెలుపొంది వ‌ర‌ల్డ్ టాపర్ గా ఎదిగే వరకూ సైనా జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. ఇక చైనా వాల్‌ను బ‌ద్ధ‌లు కొడ‌తానంటూ యంగ్ సైనా చెప్పే మాటలు ఈ ట్రైల‌ర్‌కు బూస్టప్ ఇచ్చాయని చెప్పొచ్చు.

Source: T Series