పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పక్కన కనిపించే చిన్న రోల్ ఆఫర్ చేసినా…ఎగిరి గంతేస్తున్నారు హీరోయిన్స్. ఇప్పుడలాగే ప్రభాస్ రాధేశ్యామ్, సలార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేసే అవకాశాన్ని దక్కించుకొని రెచ్చిపోతున్నారు. ప్రభాస్ నటిస్తోన్న సలార్ కోసం కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి రెడీ అవుతోంది. కెజీఎఫ్ లో హీరోయిన్ గా నటించినా పెద్దగా పేరు రాని శ్రీనిధి…కేజీఎఫ్ 2లో ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి. కానీ ఇంతలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అడిగిన వెంటనే ప్రభాస్ తో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఎస్ చెప్పిందట శ్రీనిధి.

ఇక దాదాపు ఎనిమిదేళ్ల బ్రేక్ తర్వాత టాలీవుడ్‌ లోకి రీఎంట్రీ ఇస్తుంది సిమ్రన్‌ కౌర్‌. ప్రభాస్ రాధేశ్యామ్ లో ఓ ప్రత్యేక పాత్రలో నటించిందట ఈ హీరోయిన్. హీరోయిన్ పూజా హెగ్దే కాకుండా రాధేశ్యామ్ లో ప్రభాస్ ఈ సుందరితో కూడా స్టెప్పులేయనున్నాడు. ఆమధ్య మంచు మనోజ్ హీరోగా వచ్చిన పోటుగాడు….సిమ్రన్ నటించిన చివరి చిత్రం. కాగా రాధేశ్యామ్ అమ్మడికి మళ్లీ గుర్తింపును తీసుకోస్తుందా అన్నది ప్రశ్నగా మారింది.

ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, శృతీ హాసన్ జంటగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం సలార్. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా అన్ని లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ అమేజాన్ ప్రైమ్ గట్టిగా ట్రై చేస్తోందట. ఎన్నడూ లేని విధంగా ఏకంగా వంద కోట్ల రూపాయల భారీమొత్తాన్ని ఆఫర్ చేసినట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్స్ నటించిన చిత్రాలకు సైతం అమేజాన్ ఓటీటీ నుంచి ఈ రేంజ్ ఆఫర్స్ ఇంతవరకు రాలేదట. అయితే ప్రభాస్‌ ఇప్పుడు సౌత్ ప్లస్ నార్త్ టోటల్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. అందుకోసమే సలార్ కోసం 100 కోట్లు పెట్టేందుకు రెడీఅవుతోందట అమేజాన్. ప్రసుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

వరుసగా తన సినిమాల రిలీజ్ డేట్స్ చెప్పేస్తున్నారు ప్రభాస్. షూటింగ్ మొదలవుతుందో లేదో ఆ వెంటనే రిలీజ్ డేట్ ప్రకటించేస్తున్నారు డార్లింగ్ దర్శకనిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన రాధేశ్యామ్ 2021 జూలై 30న రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ సరసన పూజాహెగ్దే హీరోయిన్ లీడ్ చేసిన ఈ సినిమా ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ఫిల్మ్ గా రూపొందింది. కాగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబర్ స్టార్ నటిస్తోన్న సలార్ 2022 ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్నట్టు తాజాగా అనౌన్స్ చేసారు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో వస్తోన్న ఆదిపురుష్ 2022 ఆగస్టు 11న విడుదలే చేస్తామని షూటింగ్ కి ముందే చెప్పేసారు మేకర్స్.

ఇంక డార్లింగ్ సైన్ చేసిన వాటిలో బాకీ ఉంది నాగ్ అశ్విన్ కాంబో మూవీ రిలీజ్ డేట్ మాత్రమే. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్, ప్రభాస్,దీపికా పదుకోనె నటించబోతున్న ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఇవ్వట్లేదు మేకర్స్. ఈమధ్యే జూన్ లేదంటే జూలైలో ప్రభాస్ సినిమా ప్రారంభిస్తామన్నారు నాగ్ అశ్విన్. అయితే ఇది ఓ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ అన్నట్టు మాత్రం తెలుస్తోంది. మరి ఈ మూవీ రిలీజ్ డేట్ బహుశా 2023లో ఉండొచ్చని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఎప్పుడు మొదలెడతారో…ఎప్పుడు రిలీజ్ చేస్తారో ముందు ముందు తెలుస్తుంది.

2022 ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది సలార్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , సూపర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ అంచనాలతో రూపొందుతుంది ఈ చిత్రం. అగ్ర‌ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ‘స‌లార్‌’ను నిర్మిస్తోంది. హెవీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ అంశాలతో తెరకెక్కుతున్న సలార్….ఈమధ్యే రామగుండంలో ఫస్ట్ షెడ్యుల్ ను పూర్తి చేసుకుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ కి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ప్రెజెంట్ యూత్ స్టార్ ఐకాన్ మాత్రమే కాదు ప్యాన్ ఇండియన్ రేంజ్ ప్రభాస్ సొంతం. ఇప్పుడు దేశవ్యాప్త అభిమానం డార్లింగ్ సొంతం. అందుకే అమాంతం రేటు పెంచేసారట ప్రభాస్. ఒక్క సినిమాకు 100కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. ప్రస్తుతం పీరియాడికల్ ఫిల్మ్ రాధేశ్యామ్‌, ప్రశాంత్ నీల్ సలార్‌, ఓం రౌత్ ఆదిపురుష్‌ వంటి ఈ హీరో చేస్తున్న సినిమాలన్నీ ప్యాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోయే సినిమాలే.

కథ విని నచ్చితే సైన్ చేయాలంటే…నిర్మాత ప్రభాస్ కి 100 కోట్ల రూపాయలు ముట్టజెప్పాల్సిందే అంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది దర్శకనిర్మాతలు ఖంగుతింటుంటే… మరికొంతమంది మాత్రం ప్రభాస్ కోసం కోట్లు ఇచ్చైనా బుక్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నటిస్తోన్న ఆదిపురుష్‌, సలార్‌ చిత్రాలకు నూరు కోట్లు అందుకున్నారట ప్రభాస్. టాలీవుడ్‌ పరిశ్రమలో ఇంతటి పెద్ద మొత్తం అందుకున్నది కేవలం ప్రభాస్‌ మాత్రమేనని, సౌత్ ఇండస్ట్రీల్లో ఎక్కడా ఇంత భారీ మొత్తాన్ని అందుకున్న హీరోనే లేడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఆదిపురుష్ రాముని పాత్ర కోసమే డార్లింగ్ మీసాలు పెంచుంటారని ఈ లుక్ చూస్తే అర్ధమవుతుంది. ఈమధ్యే అగ్నికి ఆహుతైన ఆదిపురుష్ సెట్ తో సంబంధం లేకుండా ప్రభాస్ పార్ట్ ను షూట్ చేయాలనుకుంటున్నారట డైరెక్టర్ ఓం రౌత్. అయితే ప్రభాస్ కి సంబంధించి ఓ పోస్ట్ వైరల్ గా మారింది. నెలకో రకంగా డార్లింగ్ కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రెండు నెలల క్రితం రాధేశ్యామ్ కోసం లవర్ బాయ్ గా….గత నెల సలార్ కోసం యోధుడిలా….ఇప్పుడిలా వీరుడిలా ప్రభాస్ లుక్స్ అలరిస్తున్నాయంటున్నారు.

ప్రభాస్ లుక్స్ విషయం అలా ఉంటే… ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబో మూవీ సలార్ కోసం 100మంది కొత్త నటీనటులని తీసుకున్నారని టాక్. హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఆమధ్య నిర్వహించిన ఆడిషన్స్ నుంచి వీళ్లని సెలెక్ట్ చేసారట. అయితే కేజీఎఫ్ మాదిరి గుంపులుగా కనిపిస్తారా…లేదంటే ప్రత్యేకంగా వారి కోసం క్యారెక్టర్స్ డిజైన్ చేసారా అన్నది తెలియాల్సిఉంది.

సలార్ మూవీ మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభాస్ కోసం మాత్రమే ఎక్స్ క్లూజివ్ గా రాసుకున్న సలార్ కథ అద్దిరిపోతుందని రీసెంట్ గా ప్రకటించి మరింత ఇంట్రెస్ట్ పెంచారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. గోదావరిఖని బొగ్గుగనుల్లో షూటింగ్ చేస్తున్న డార్లింగ్ ఫస్ట్ లుక్ కి సైతం విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. అటు శృతీహాసన్ సైతం ఎన్నడూ కనిపించని విధంగా ఉంటుంది నా రోల్ అంటూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతలో ప్రభాస్ సరసన గ్లోబల్ స్టార్ చిందులేస్తారనే వార్తతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు..హాలీవుడ్ లో సైతం సినిమాలు చేస్తూ ప్రపంచం చూపును తనవైపుకు తిప్పుకుంటోది ప్రియాంక చోప్రా. ఇప్పుడు ప్యాన్ ఇండియన్ మూవీ సలార్ లోనూ నటించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ప్రభాస్ సరసన ఓ స్పెషల్ సాంగ్ లో ప్రియాంక కనిపిస్తుందనే న్యూస్ వైరలవుతోంది. అయితే ఈ ట్రెండింగ్ న్యూస్ గురింటి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇదే నిజమైతే దాదాపు 9ఏళ్ల తర్వాత టాలీవుడ్ హీరో పక్కన ప్రియాంక చోప్రాను చూడొచ్చు. గతంలో రామ్ చరణ్ జంజీర్ తెలుగు తుఫాన్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది ప్రియాంక చోప్రా. ఇప్పుడు ప్రభాస్ సరసన అంటుంటే డార్లింగ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న శృతి హాసన్ గురించి సలార్ టీమ్ శుభవార్త ప్రకటించింది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ చిత్రంలో ప్రభాస్ జోడీగా శృతిహాసన్ నటించనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీంతో ఫస్ట్ టైం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన కనిపించబోతున్నారు శృతిహాసన్.
తక్కువ గ్యాపే ఇచ్చినా శృతికిది సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పుకోవాలి. క్రాక్ హిట్ తో శుభారంభం పలికి…వరుసగా క్రేజీ అవకాశాలను క్యాచ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన చేసిన వకీల్ సాబ్ తో త్వరలోనే థియటర్స్ కి రానున్నారు. అటు హిందీలోనూ ఈమె మంచి సినిమాలకే సైన్ చేశారు. గట్టి హిట్స్ మరో రెండు తగిలితే కమల్ తనయకిక తిరుగుండదు. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్ డే శృతీ….

మొదటిసారి ప్రభాస్ సరసన నటించబోతున్నారట శృతీహాసన్. కేజీఎఫ్ చాఫ్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్…ప్రభాస్ హీరోగా సలార్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం…పట్టాలెక్కేయడం కూడా వెంటవెంటనే జరిగిపోయాయి. సినిమాను సరికొత్తగా ప్రెజెంట్ చేసేందుకు కొత్త నటీనటులను ఎంపిక చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు.
అయితే తాజాగా కమల్ హాసన్ తనయ…ఈ ప్రాజెక్ట్ లో నటించబోతున్నారని తెలుస్తుంది. అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

మొన్నటివరకు డార్లింగ్ పక్కన బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ కనిపిస్తుందని అన్నారు. ఆ తర్వాత ఫ్రెష్ లుక్ కోసం కొత్త హీరోయిన్ నటిస్తుందని చెప్పారు. తీరా ఇప్పుడు చూస్తే శృతీ హాసన్ సంప్రదించారనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ప్రభాస్, శృతీల జోడీ ఫస్ట్ టైమ్ జతకట్టబోతుంది. శృతీ కూడా ఓ పాన్ ఇండియన్ ఫిల్మ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. దీంతో ఓ పాన్ ఇండియన్ ఫిల్మ్…అదీ ప్రభాస్ సరసన…మళ్లీ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ కావడంతో ఎగిరి గంతేసి మరీ ఓకే చెప్పినట్టు టాక్. చూద్దాం మరి ఏం జరగబోతుందో….

కేజీఎఫ్ చాప్టర్ 2 షూట్ పూర్తవడంతో ఫ్రీ బర్డ్ అయిపోయారు హీరో యష్. ఇన్నాళ్లు పడిన శ్రమను మర్చిపోయేందుకు తనకు నచ్చినచోట వాలిపోతున్నారు. చాప్టర్ 2కు ప్యాకప్ చెప్పినవెంటనే తమిళనాడులోని ప్రముఖ శనీశ్వరాలయాన్ని దర్శించారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు రమేశ్ అరవింద్ కూతురి పెళ్లికి అటెండ్ అవడమే కాదు డాన్స్ చేసి మరీ సందడి చేసారు. నెక్ట్స్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ ఓపెనింగ్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసి టీంని ఉత్సాహపరిచారు.

ఇప్పుడిక మాల్టీవుల్లో రచ్చ చేస్తున్నారు యష్. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి మాల్టీవుల విహారయాత్రకు వెళ్లారు. భార్య రాధిక పండిట్, కొడుకు, కూతురుతో కలిసి ఫోటోలు దిగుతూ…వాటిని అభిమానులతో పంచుకుంటూ ట్రెండింగ్ గా మారుతున్నారు. స్వర్గం అంటే ఇలానే ఉంటుందా అంటూ మాల్టీవుల గురించి కామెంట్ చేసి వావ్ అనిపించారు. ఇలా రాకింగ్ స్టార్ ఏది చేసినా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by Yash (@thenameisyash)