ఈ మధ్యే అధికారికంగా ప్రారంభమైన దృశ్యం – 2 తెలుగు రీమేక్ గురించి ఓ వార్త ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్రంలో రానా, సమంతా నటిస్తున్నారనే టాక్ నడుస్తోంది. మలయాళ ఒరిజినల్ చూసినవాళ్లకి సరిత, సాబు రోల్స్ గురించి తెలిసే ఉంటుంది. హీరో ఇంటి పక్క వాళ్లలా ఉండి అసలు నిజాన్ని రాబట్టాలనుకునే పోలీసాఫీసర్స్ వాళ్లు. ఇప్పుడా క్యారెక్టర్స్ లోనే రానా, సమంతా నటించబోతున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

వెంకీ నటించిన నారప్ప విడుదలకు సిద్ధమవుతుండగా…ఎఫ్ 3 సెట్స్ పైనుంది. కాగా మార్చి 5 నుంచి దృశ్యం -2 సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. ఇక రానా నటించిన అరణ్య ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ కలయికలో నటిస్తోన్న అయ్యప్పనున్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. అటు సమంతా విజయ్ సేతుపతి, నయనతార కాంబినేషన్లో ఓ తమిళ్ సినిమా చేస్తుండగా…త్వరలోనే శాకుంతలం చిత్రీకరణలో పాల్గొనబోతుంది. ఇక ఇప్పుడు వెంకీ, రానా, సామ్ ముగ్గురు కలిసి దృశ్యం చూపిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2 సిరీస్ తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు సమంతా. నిజానికి ఫిబ్రవరి 12వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సరికొత్త సిరీస్‌ రిలీజ్‌ కావాల్సిఉంది. అయితే నిన్నటివరకు ఎలాంటి వాయిదా లేదని ప్రకటించిన మేకర్స్…హఠాత్తుగా ఈ సిరీస్ ను సమ్మర్ కి వాయిదా వేస్తున్నట్టు చెప్పేసారు. డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే రూపొందించిన సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ మొదటిభాగంలో మనోజ్‌ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించగా…సేమ్ అదే కాంబినేషన్ సెకండ్ సీజన్ లోనూ రిపీట్ అవుతోంది. కాగా టాలీవుడ్ క్వీన్ సమంత విలన్‌ పాత్రలో టెర్రరిస్ట్ గా కనిపించబోతున్నారు.

ఇంతవరకు సామ్ కి సంబంధించిన పార్ట్ ని చాలా గోప్యంగా ఉంచింది యూనిట్. డైరెక్ట్ స్క్రీన్ మీదే సర్ప్రైజ్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇక ఈ సిరీస్ వాయిదా గురించి డైరెక్టర్స్ మాట్లాడుతూ – ‘ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని తెలుసు. మీ అందరికీ ఓ సరికొత్త అనుభూతిని అందించాలనే విడుదలను వేసవికి వాయిదా వేసాం’ అని అన్నారు. అయితే రీసెంట్ గా ఓటీటీ ప్రైమ్‌లో రిలీజైన ‘మిర్జాపూర్‌’, ‘తాండవ్‌’ సిరీస్‌లు వివాదాల్లో చిక్కుకుని…దేశవ్యాప్త చర్చని రేకెత్తించాయి. అందుకే ‘ఫ్యామిలీ మ్యాన్‌’ విషయంలో అలాంటివి ఎదురుకాకూడదనే ఆలోచనతోనే ఇలా ఫిబ్రవరి 12 నుంచి వేసవికి వాయిదా వేసారని టాక్.

ఓటీటీలు వేరైనా తీవ్రవాద నేపథ్యంలో వచ్చిన ది ఫ్యామిలిమెన్, స్పెషల్ ఓపిఎస్ వంటి సిరీస్ సూపర్ హిట్టయ్యాయి. జనాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించాయి. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు తీవ్రవాదులుగా మారుతున్నారు మన అందగత్తెలు. ఆల్రెడీ సమంతా నటించిన ‘ది ఫ్యామిలీ మెన్ -2’లో కరుడుగట్టిన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ఈ మూవీ అమెజాన్ వేదికగా ఫిబ్రవరి 12న రిలీజ్ కానుంది.
ఇక పాపులర్ ఓటీటీ సిరీస్ ‘స్పెషల్ ఓపీఎస్ 2’లో తీవ్రవాదిగా నటించేందుకు సైన్ చేసారు దీపికా పదుకోన్. నీరజ్ పాండే ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారు. కథ అందులోని మలుపులు బాగా నచ్చడంతో వెంటనే దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని… ఉగ్రవాదిగా నటించేందుకు అంగీకరించారని టాక్. సో ఇలా టీటౌన్, బిటౌన్ వయ్యారిభామలు….యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరించనున్నారన్నమాట.

ఎంత పని చేసావ్ సామ్…నిన్నటి నుంచి ఇలాంటి ప్రశ్నలే సమంతాకి ఎదురయ్యాయి. దీంతో పెట్టిన పోస్ట్ ను వెంటనే తీసిపారేసారు. ఇంతకు ముందు వేరు…ఇప్పుడు వేరు. అక్కినేని కోడలుగా మారాక సమంతాకు కొన్ని హద్దులున్నాయి. ఏది పడితే అది పోస్ట్ చేస్తే ఫ్యామిలీ అంగీకరించినా…అభిమానులు తట్టుకోలేరట. అందుకే విపరీతమైన ట్రోలింగ్ కి గురై ఓ ఫోటోను డిలీట్ చేసేసారు.
సమంతా తన స్టైలిస్ట్ ప్రీతమ్ ఒడిలో కాళ్లుపెట్టి చాలా క్లోజ్ గా ఓ ఫోటోను దిగారు. ఆ ఫోటోను పోస్ట్ చేసి విపరీతంగా ట్రోలింగ్ కి గురైయ్యారు. మామూలుగా అయితే సామ్ ఇలాంటివి పట్టించుకోరు. కుటుంబం నుంచి ఏమైనా అభ్యంతరం ఎదురయిందో ఏమో…ఎందుకొచ్చిన గొడవని ఆ పిక్ ని డిలీట్ చేసారు సామ్.

అక్కినేని కుటుంబానికి అసలైన కోడలుగా…మామకు తగ్గ కోడలుగా పేరు తెచ్చుకుంటున్నారు సమంతా. నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని ఫ్యామిలీలో భాగమైన సమంతా…మ్యారేజ్ తర్వాత బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఓ వైపు తన కెరీర్ కొనసాగిస్తూనే…తన ఫ్యామిలీ కోసం కావలిసినంత కష్టపడుతున్నారు. ఆస్తుల విషయంలో చైతూను మించినా..ఎన్నడూ శృతిమించలేదు. నటనతో పాటూ యాంకరింగ్, యాడ్స్, వెబ్ సిరీస్, బిజినెస్ ఇలా తనకు చేతనైనంత కూడబెట్టడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు.

ఓవైపు భర్త నాగచైతన్య విజయం కోసం శ్రమిస్తూనే…తాజాగా మరిది అఖిల్ సక్సెస్ కోసం బాధ్యతను ఎత్తుకున్నారు. అందులో భాగంగానే తాను వర్క్ చేసిన ఫ్యామిలీ మెన్ -2 డైరెక్టర్లకి అఖిల్ ని రిఫర్ చేసారని తెలుస్తోంది. తెలుగులో ఢీ ఫర్ దోపిడి సినిమా చేసి సక్సెస్ కాలేదు కానీ ఫ్యామిలీ మెన్ సిరీస్ తో ఆకట్టుకుంటున్నారు రాజ్, డికె. వీరిప్పుడు పాన్ ఇండియా వైడ్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా హీరోగా అఖిల్ అయితే బాగుంటాడని సామ్ ఒప్పించారని టాక్.

ఇక, సామ్‌… వెబ్‌ సిరీస్‌ ఫ్యామిలీ మెన్‌ -2 అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో రిలీజ్ కి రెడీఅయింది. జనవరి 19న విడుదలకాబోతున్న ట్రైలర్ కోసం జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో సామ్ విలన్ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. ఓ టెర్రరిస్ట్ గా సమంతా నటించిందని చెబుతున్నారు. అందుకే ట్రైలర్ తో పాటూ రివీల్ కాబోతున్న సామ్ లుక్ కోసం అందరిలో ఇంట్రెస్ట్ పెరిగింది