సారంగధరియా సాంగ్ రికార్డ్ మీద రికార్డ్స్ కొట్టేస్తుంది. ఏ ముహూర్తాన సమంతా చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ అయిందో కానీ ఇప్పట్లో ట్రెండ్ ఆగేలా లేదు. అచ్చ తెలంగాణ పదాలకి చేసిన మ్యూజిక్ మ్యాజిక్ కి తోడూ సాయి పల్లవి డాన్స్ ఫిదా చేస్తే… వివాదాల వల్ల పబ్లిసిటీ ఇంకా పెరగడంతో.. సాంగ్ ఊపందుకుంది. ఇప్పటికే 9కోట్లకు పైగా వ్యూస్ తో పాటు 10 లక్షల లైకులు అతితక్కువ టైమ్ లో సాధించిన మొదటి తెలుగుపాటగా రికార్డ్ సాధించింది.

జాంబిరెడ్డి – 2 అతిత్వరలో పట్టాలెక్కబోతుందని ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ‘జాంబిరెడ్డి’ ఫిబ్రవరి 5న థియేటర్లలో రిలీజై సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సీక్వెల్ గా ‘జాంబిరెడ్డి2’ రాబోతోంది. ఈ హాట్ న్యూస్ ను మూవీ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ స్వయంగా అనౌన్స్ చేసారు. ఆహా ఓటీటీ వేదికగా మార్చి 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా జాంబిరెడ్డి యూనిట్ విజయవాడ ప్రేక్షకులను కలిసారు. ఆ సమయంలోనే జాంబిరెడ్డి 2 గురించి మాట్లాడారు.

అయితే జాంబిరెడ్డి హిట్టైతే జాంబిరెడ్డి 2లో తాను నటిస్తానని సమంతా చెప్పినట్టు…ఓ సందర్భంలో వెల్లడించాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్న ప్రశాంత్…ఆల్రెడీ సామ్ కు కథను వినిపించాడట. ఇప్పుడెలాగూ 15కోట్లు వసూలు చేసి లాభాల బాటలో నిలిచింది జాంబిరెడ్డి. సో జాంబిరెడ్డి 2లో నటించేందుకు సామ్ ఒప్పుకునే ఛాన్స్ ఉందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం శాకుంతలం చేస్తోన్న సామ్..మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.

మహాభారత ఆదిపర్వంలోని ప్రేమకథా ఘట్టాన్ని కథాంశంగా తీసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం…శాకుంతలం. శకుంతలగా స‌మంత‌, దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ నటిస్తున్న ఈ సినిమా తాజాగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ పీరియాడిక‌ల్ మూవీని రూపొందిస్తున్న డైరెక్టర్ గుణశేఖర్..మరో అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారని సమాచారం. దుర్వాస మహామునిగా డైలాగ్ కింగ్ మోహన్ బాబుని ఫిక్స్ చేసారని చెబుతున్నారు. శకుంతలకు శాపం పెట్టే దుర్వాస మునిగా డైలాగ్ కింగ్ అయితేనే సెట్ అవుతారని భావిస్తున్నారట మేకర్స్.

తెలుగమ్మాయి ఈషా రెబ్బా సైతం శాకుంతలంలో కీ రోల్ చేస్తున్నట్టు సమాచారం. డీఆర్‌పీ-గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై అగ్ర నిర్మాత దిల్‌రాజు ప్రొడక్షన్స్ లో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. వచ్చే వారం నుంచే రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుంది శాకుంతలం. ఈ క్రమంలోనే ప్రధాన పాత్ర‌ల‌కు సంబంధించి స్టార్ న‌టీన‌టుల‌ను సెలెక్ట్ చేస్తున్న‌ారని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా శాకుంతలం థియేటర్స్ కి రానున్నట్టు తెలుస్తోంది.

శకుంతలగా సమంతా నటిస్తోన్న పౌరాణిక చిత్రం శాకుంతలం అధికారికంగా ప్రారంభమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దుశ్యంతునిగా మలయాళీ హీరో దేవ్ మోహన్ కనిపించనున్నాడు. మహాభారత గాధలోని ఆదిపర్వంలో కనిపించే ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు సమర్పణలో ప్యాన్ ఇండియా మూవీగా దీనినిన తీర్చిదిద్దుతున్నారు డైరెక్టర్ గుణశేఖర్.

తాజాగా మొదలైన శాకుంతలం సినిమాను 2022లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రంలో భాగం కావ‌డంతో.. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌నున్నారు గుణ‌శేఖ‌ర్. తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కూడా మరో లీడ్ రోల్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా ప్రారంభమైన శాకుంతలం ముహూర్తం సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విఛ్ ఆన్ చేసారు.

ఈ మధ్యే అధికారికంగా ప్రారంభమైన దృశ్యం – 2 తెలుగు రీమేక్ గురించి ఓ వార్త ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్రంలో రానా, సమంతా నటిస్తున్నారనే టాక్ నడుస్తోంది. మలయాళ ఒరిజినల్ చూసినవాళ్లకి సరిత, సాబు రోల్స్ గురించి తెలిసే ఉంటుంది. హీరో ఇంటి పక్క వాళ్లలా ఉండి అసలు నిజాన్ని రాబట్టాలనుకునే పోలీసాఫీసర్స్ వాళ్లు. ఇప్పుడా క్యారెక్టర్స్ లోనే రానా, సమంతా నటించబోతున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

వెంకీ నటించిన నారప్ప విడుదలకు సిద్ధమవుతుండగా…ఎఫ్ 3 సెట్స్ పైనుంది. కాగా మార్చి 5 నుంచి దృశ్యం -2 సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. ఇక రానా నటించిన అరణ్య ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ కలయికలో నటిస్తోన్న అయ్యప్పనున్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. అటు సమంతా విజయ్ సేతుపతి, నయనతార కాంబినేషన్లో ఓ తమిళ్ సినిమా చేస్తుండగా…త్వరలోనే శాకుంతలం చిత్రీకరణలో పాల్గొనబోతుంది. ఇక ఇప్పుడు వెంకీ, రానా, సామ్ ముగ్గురు కలిసి దృశ్యం చూపిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.

ప్రొఫెషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌ రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. మహాభారత గాదలోని ఆదిపర్వంలో కనిపించే శకుంతల, దుష్యంతుల ప్రేమకథతో ‘శాకుంతలం’ సినిమాని సృష్టిస్తున్నారు గుణశేఖర్. శకుంతలగా మొదటిసారి పౌరాణిక పాత్రలో సమంత నటించబోతున్న విషయం తెలిసిందే. అయితే శకుంతుల ప్రేమికుడిగా, భర్తగా ఇందులో ఓ మలయాళ నటుడు కనిపించనున్నాడనే వార్త ఊపందుకుంది. ఆయనెవరో కాదు దుల్కర్ సల్మాన్ అనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సినిమాకి భారీ సెట్స్ ప్లాన్ చేసారు. దానికి తగ్గట్టే ఆ వర్క్ అంతటిని దగ్గరుండి చక్కబెడుతున్నారు గుణశేఖర్. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మార్చి 20వ తేదీ నుంచి ప్రారంభిస్తారనే టాక్ నడుస్తోంది. దాని ప్రకారమే శాకుంతలం మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఈ పాన్‌ ఇండియన్ సినిమాకు సంగీతం అందిస్తుండగా… నీలిమ గుణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా సమంత, ఫాహద్‌ ఫాజిల్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ సూపర్ డీలక్స్. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను సొంతం చేసుకొన్న సిద్ధేశ్వర వైష్ణవి ఫిల్మ్స్ సంస్థ… త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఉప్పెనతో సేతుపతి పాపులారిటీ అమాంతం పెరగడం…మనకు తెలిసిన సమంతా, రమ్యకృష్ణ వాంటి వారు ఇందులో నటించడం సూపర్ డీలక్స్ కి కలిసొచ్చే అంశాలు.

ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీలో విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యారనే వార్త హల్చల్ చేస్తోంది. ముందు సునీల్ శెట్టి అనుకున్నా…చివరికి సేతుపతే కరెక్ట్ అని భావిస్తున్నారట మేకర్స్. అటు స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రామ్ చరణ్ నటించబోతున్న సినిమాపై రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా ఇందులో విలన్ గా విజయ్ సేతుపత కనపించనున్నాడనే టాక్ నడుస్తోంది.

ఆ ఇద్దరితో నటిస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉందంటున్నారు సమంతా అక్కినేని. వారేవరో కాదు నయనతార, విజయ్ సేతుపతి. అయితే సూపర్ డీలక్స్ సినిమాలో సామ్, విజయ్ సేతుపతి నటించినా వీళ్లిద్దరికీ కాంబినేషన్ సీన్స్ లేవు. దీంతో ఆ కల…కలలానే మిగిలింది. ఇప్పుడిక జాక్ పాట్ కొట్టినట్టు తన ఫేవరేట్స్ నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ఒకే సినిమాలో నటిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సమంతా.

బిజీబిజీగా అయితే ఉన్నారు కానీ పెద్దగా సినిమాలు అంగీకరించట్లేరు సామ్. ధి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం నయన్ లవర్ విఘ్నేశ్ శివన్ సినిమాతో పాటూ గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న శాకుంతలం ప్రాజెక్ట్స్ లాక్ చేసారు సామ్. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ్ మూవీలోనే పవర్ ఫుల్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతితో పాటూ నయనతారతో కలసి నటిస్తున్నారు సమంత. ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ మూవీతో తీరుతుందని అంటున్నారు.

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2 సిరీస్ తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు సమంతా. నిజానికి ఫిబ్రవరి 12వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సరికొత్త సిరీస్‌ రిలీజ్‌ కావాల్సిఉంది. అయితే నిన్నటివరకు ఎలాంటి వాయిదా లేదని ప్రకటించిన మేకర్స్…హఠాత్తుగా ఈ సిరీస్ ను సమ్మర్ కి వాయిదా వేస్తున్నట్టు చెప్పేసారు. డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే రూపొందించిన సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ మొదటిభాగంలో మనోజ్‌ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించగా…సేమ్ అదే కాంబినేషన్ సెకండ్ సీజన్ లోనూ రిపీట్ అవుతోంది. కాగా టాలీవుడ్ క్వీన్ సమంత విలన్‌ పాత్రలో టెర్రరిస్ట్ గా కనిపించబోతున్నారు.

ఇంతవరకు సామ్ కి సంబంధించిన పార్ట్ ని చాలా గోప్యంగా ఉంచింది యూనిట్. డైరెక్ట్ స్క్రీన్ మీదే సర్ప్రైజ్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇక ఈ సిరీస్ వాయిదా గురించి డైరెక్టర్స్ మాట్లాడుతూ – ‘ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని తెలుసు. మీ అందరికీ ఓ సరికొత్త అనుభూతిని అందించాలనే విడుదలను వేసవికి వాయిదా వేసాం’ అని అన్నారు. అయితే రీసెంట్ గా ఓటీటీ ప్రైమ్‌లో రిలీజైన ‘మిర్జాపూర్‌’, ‘తాండవ్‌’ సిరీస్‌లు వివాదాల్లో చిక్కుకుని…దేశవ్యాప్త చర్చని రేకెత్తించాయి. అందుకే ‘ఫ్యామిలీ మ్యాన్‌’ విషయంలో అలాంటివి ఎదురుకాకూడదనే ఆలోచనతోనే ఇలా ఫిబ్రవరి 12 నుంచి వేసవికి వాయిదా వేసారని టాక్.

ఓటీటీలు వేరైనా తీవ్రవాద నేపథ్యంలో వచ్చిన ది ఫ్యామిలిమెన్, స్పెషల్ ఓపిఎస్ వంటి సిరీస్ సూపర్ హిట్టయ్యాయి. జనాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించాయి. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు తీవ్రవాదులుగా మారుతున్నారు మన అందగత్తెలు. ఆల్రెడీ సమంతా నటించిన ‘ది ఫ్యామిలీ మెన్ -2’లో కరుడుగట్టిన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ఈ మూవీ అమెజాన్ వేదికగా ఫిబ్రవరి 12న రిలీజ్ కానుంది.
ఇక పాపులర్ ఓటీటీ సిరీస్ ‘స్పెషల్ ఓపీఎస్ 2’లో తీవ్రవాదిగా నటించేందుకు సైన్ చేసారు దీపికా పదుకోన్. నీరజ్ పాండే ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారు. కథ అందులోని మలుపులు బాగా నచ్చడంతో వెంటనే దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని… ఉగ్రవాదిగా నటించేందుకు అంగీకరించారని టాక్. సో ఇలా టీటౌన్, బిటౌన్ వయ్యారిభామలు….యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరించనున్నారన్నమాట.