మహేశ్ బాబు, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ సెట్టయింది. కానీ సినిమా కోసం కాదు…ఓ పాపులర్ బ్రాండ్ యాడ్ ఫిల్మ్ కోసం వీరిద్దరూ కలిసి వర్క్ చేయనున్నారు. అవును నిన్నటివరకు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో మహేశ్ బాబు ఓ సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నది ఓ ప్రముఖ బ్రాండ్ యాడ్ కోసమని తాజాగా సీక్రెట్ రివీలైంది.

ఎప్పటినుంచో ఆ బ్రాండ్ కోసం వర్క్ చేస్తున్న మహేశ్ బాబు…కావాలనే డైరెక్టర్ గా సందీప్ రెడ్డిని రికమెండ్ చేసారట. మహేశ్ కోరికను సందీప్ కూడా కాదనకుండా ఎస్ చెప్పాడని తెలుస్తోంది. వెంటనే ఆ బ్రాండ్ ఇద్దరినీ కలిపి మాట్లాడుకోవడం కూడా జరిగినట్టు చెబుతున్నారు. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే ఓ యాడ్ ఫిల్మ్ లో మహేశ్ బాబుని…అది కూడా సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యాడ్ లో సూపర్ స్టార్ ని చూడొచ్చని సంబరపడుతున్నారు ఫ్యాన్స్.

అర్జున్ రెడ్డి…హీరో విజయ్‌ దేవరకొండకు ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా సైతం టాలీవుడ్ టు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ గా మారారు. ఇదే స్టోరితో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్‌సింగ్‌’ తీసి బాలీవుడ్ లోనూ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ప్రస్తుతం సందీప్‌… హిందీలో రణ్‌బీర్ కపూర్‌ హీరోగా ‘యానిమల్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. దీని తర్వాత విజయ్ దేవరకొండతో సందీప్ సినిమా ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది.

మరోవైపు రౌడీబాయ్.. పూరీ డైరెక్షన్ లో ప్యాన్‌ ఇండియన్ మూవీ ‘లైగర్‌’ కోస కష్టపడుతున్నాడు. దీని తర్వాత విజయ్ ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్స్ గా మారింది. అయితే సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ…ఈ క్రేజీ కాంబోను మళ్లీ కలిపేందుకు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రయత్నాలను మొదలుపెట్టిందట. ప్రజెంట్ చర్చలు నడుస్తున్నాయని, అంతా అనుకున్నట్టు జరిగితే 2022 సెకండ్ హాఫ్ లో ఈ మూవీ ప్రారంభం కావొచ్చనే వార్తలొస్తున్నాయి.