యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ రాసుకున్న కథతో ‘ఏక్‌ మినీ కథ’ అనే చిత్రం తెరకెక్కుతుంది. డజ్ సైజ్ మ్యాటర్? అనేది ఈ ప్రాజెక్ట్ టైటిల్ ట్యాగ్ లైన్. ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ యు.వి.క్రియేషన్స్‌ కి అనుబంధ సంస్థ యు.వి.కాన్సెప్ట్‌ బ్యానర్ పై కార్తీక్‌ రాపోలు రూపొందిస్తున్నారు. ప్రభాస్ ‘వర్షం’ డైరెక్టర్ శోభన్ కొడుకు సంతోష్‌ శోభన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈమధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా…ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని చెప్తన్నారు మేకర్స్. కాగా ఈ చిత్రానికి రవీందర్ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పనిచేస్తుండగా గోకుల్ భారతి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నాడు.