సరిలేరు నీకెవ్వరూ కాంబో మహేశ్ బాబు – అనిల్ రావిపూడి… రిపీట్ కానుందని టాక్. సర్కారు వారి పాట తర్వాత వీళ్లిద్దరి కాంబినేషనే పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాతే రాజమౌళి ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తారట సూపర్ స్టార్. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు ప్రధానపాత్రల్లో నటిస్తోన్న గాలిసంపత్ సినిమా నిర్మాణంతో పాటూ దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ లతో పాటూ మహేశ్ బాబు కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట అనిల్ రావిపూడి.

పరుశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట చేస్తున్నారు మహేశ్ బాబు. దుబాయ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకొని తాజాగా గోవాకి షిఫ్ట్ సర్కారు మూవీ యూనిట్. అయితే ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్..రాజమౌళితో కలిసి వర్క్ చేస్తారని అనుకున్నారు. అయితే అనూహ్యంగా అనిల్ రావిపూడి పేరు తెరపైకొచ్చింది. జక్కన్నతో సినిమా అంటే మినిమం 2ఏళ్లు పడుతుంది. అందుకే గ్యాప్ అనే ఫీల్ రాకుండా అనిల్ రావిపూడితో శరవేగంగా ప్రాజెక్ట్ పూర్తి చేసి…రాజమౌళి సెట్ లో అడుగుపెట్టాలన్నది మహేశ్ ప్లాన్. చూద్దాం మరి..ఏం జరుగబోతుందో…