లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది ట్రిపుల్ ఆర్ . యాక్షన్ షూట్ తోపాటు ప్యాచప్స్ కంప్లీట్ చేస్తున్న RRR సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో కంటిన్యూ అవుతోంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ,బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబయ్ సెట్స్ లో జరుగుతోంది. విజయ దేవరకొండ సైతం ఇప్పట్లో ముంబై వదిలి వచ్చేలా లేడు. లైగర్ షూటింగ్ ఇంకా ముంబైలోనే చేస్తున్నారు పూరీ జగన్నాథ్.

చెర్రీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ట్రీట్ ఇచ్చిన చిరంజీవి ఆచార్య టీమ్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉంది. ఏప్రిల్ 2 నుంచి ఆచార్య సినిమా కోకాపెట్ లో మళ్లీ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ బెల్గాం ఆశ్రమంలో జరుగుతుంటే, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున నటిస్తోన్న సినిమా గోవాలో జరుగుతుంది. ఇక రామానాయుడు స్టూడియోలో శరవేగంగా దృశ్యం -2 షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు వెంకటేశ్.

మహేశ్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ గోవాలో జరుగుతుండగా… ఇటలీలో ఖిలాడీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు రవితేజ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబో పుష్ప సీన్స్ ను టోలీచౌకిలో చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ గని సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో కొనసాగుతుంది. సాయిధరమ్ తేజ్, దేవా కట్టా సినిమా రిపబ్లిక్ షూటింగ్ కూడా హైదరాబాద్ లోకల్ లొకేషన్స్ లోనే జరుగుతుంది.

సరిలేరు నీకెవ్వరూ కాంబో మహేశ్ బాబు – అనిల్ రావిపూడి… రిపీట్ కానుందని టాక్. సర్కారు వారి పాట తర్వాత వీళ్లిద్దరి కాంబినేషనే పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాతే రాజమౌళి ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తారట సూపర్ స్టార్. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు ప్రధానపాత్రల్లో నటిస్తోన్న గాలిసంపత్ సినిమా నిర్మాణంతో పాటూ దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ లతో పాటూ మహేశ్ బాబు కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట అనిల్ రావిపూడి.

పరుశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట చేస్తున్నారు మహేశ్ బాబు. దుబాయ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకొని తాజాగా గోవాకి షిఫ్ట్ సర్కారు మూవీ యూనిట్. అయితే ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్..రాజమౌళితో కలిసి వర్క్ చేస్తారని అనుకున్నారు. అయితే అనూహ్యంగా అనిల్ రావిపూడి పేరు తెరపైకొచ్చింది. జక్కన్నతో సినిమా అంటే మినిమం 2ఏళ్లు పడుతుంది. అందుకే గ్యాప్ అనే ఫీల్ రాకుండా అనిల్ రావిపూడితో శరవేగంగా ప్రాజెక్ట్ పూర్తి చేసి…రాజమౌళి సెట్ లో అడుగుపెట్టాలన్నది మహేశ్ ప్లాన్. చూద్దాం మరి..ఏం జరుగబోతుందో…

ఆహా చిత్రం తాజాగా చెప్పినట్టు పవర్ స్టార్, సూపర్ స్టార్ నడుమ పోటీ అనివార్యమైంది. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబో మూవీ 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా విడుదల గురించి ప్రకటించారు మేకర్స్. ఏ ఏం రత్నం నిర్మాణంలో ఎం ఎం కీరవాణి సంగీత అందిస్తున్న ఈ సినిమాకి హరిహర వీరమల్లు అనే టైటిల్ ఖరారయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే తొలి షెడ్యుల్ పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్ట్… హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన తాజ్ మహల్ సెట్లో రెండవ షెడ్యుల్ త్వరలో ప్రారంభంకానుంది. 17వ శతాబ్దంలో జరిగే ఈ కథాంశంలో పవన్ కళ్యాణ్ ను వజ్రాల దొంగగా చూపిస్తున్నారు క్రిష్.

ఇక వచ్చే సంక్రాంతికే రిలీజ్ డేట్ బుక్ చేసుకుంది సర్కారు వారి పాట. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ వడ్డీ వ్యాపారి పాత్రలో కనిపిస్తారని సమాచారం. అయితే ముందుగానే సంక్రాంతి సీజన్ లో కర్చీఫ్ వేసిన మహేష్ తో…తాజాగా పందెంలో దిగాడు పవన్. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు నువ్వా నేనా అనుకోనున్నారు. కత్తిపట్టిన పందెంకోళ్లలా బరిలోకి దిగనున్నారు. అవును వచ్చే సంక్రాంతికి సర్కారు వారి పాట రిలీజ్ అంటూ ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న ఈ మూవీని 2022 సంక్రాంతి బరిలో నిలిపారు. ఈమధ్యే దుబాయ్ లో రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుని గోవాకి పయనమైంది మూవీ యూనిట్. అయితే తాజాగా తెలిసిన విషయం ప్రకారం మహేశ్ కి పోటీగా రంగంలోకి దిగబోతున్నారట పవన్ కళ్యాణ్.

హరిహర వీరమల్లు అన్న టైటిల్ ప్రచారంలో ఉన్న క్రిష్, పవర్ స్టార్ కాంబోమూవీ సైతం సంక్రాంతి పండుగకే ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుందని టాక్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు క్రిష్. పవన్ కళ్యాణ్ సన్నివేశాలతో పాటూ…మిగిలిన సీన్స్ అన్నింటిని ఏకబికిన లాగించేస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన చార్మినార్, గండికోట సెట్స్ లో ఈ పీరియాడికల్ డ్రామాను అనుకున్నట్టు చిత్రీకరిస్తున్నారు. మార్చి 11న మహాశివరాత్రికి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న క్రిష్…పూర్తి సినిమాతో వజ్రాల దొంగగా పవన్ కళ్యాణ్ ను సంక్రాంతి బరిలో దింపుతున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే…వచ్చే సంక్రాంతికి పవన్, మహేశ్ ల మధ్య ఆట మామూలుగా ఉండదని…పోటీ తప్పేలా లేదని అంటున్నారు.

సర్కారు వారి పాట దుబాయ్ షెడ్యూల్ తాజాగా పూర్తి కాగా, నెక్ట్స్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేసారట. దుబాయ్ లో మొదటి రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేసి ఎట్టకేలకు పూర్తిచేసింది మూవీ యూనిట్. కాగా ఇప్పుడు గోవా సముద్ర తీరంలో చిత్రీకరణ ప్రారంభించేదుకు సన్నాహాలు చేస్తోంది. ఈ షెడ్యూల్‌లో మహేశ్ బాబుపై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట తెర‌కెక్కించ‌నున్నార‌ని స‌మాచారం.

అయితే సర్కారు వారి పాటలో లీడ్ హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటిస్తుండగా…కథను మలుపుతిప్పే కీలక పాత్ర కోసం మరో హీరోయిన్ ను సెర్చ్ చేస్తున్నారు. కాగా ఆ రోల్ లో ఓ స్టార్ హీరోయినే కనిపిస్తుందని టాక్. పాత్ర చిన్నదైనా కథపై గట్టి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది గనుక ఓ స్టార్ హీరోయిన్ అయితేనే కరెక్ట్ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మహేశ్ బాబుతో పాటూ ఆమెకు ఓ పాట కూడా ఉంటుందని సమాచారం. అందుకోసమే అనుష్క, కాజల్ వంటి వారిని సంప్రదిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారు వారి పాట వచ్చే ఏడాదికి సంక్రాంతికి సీట్ బుక్ చేసుకుంది. 2022 సంక్రాంతి పోరులో తలపడేందుకు ముందే జెండా పాతాడు మహేశ్ బాబు. నిజానికి ఈ దసరాకే ఈ సినిమా వస్తుందనుకున్నారు. కానీ 2021 డిసెంబరులో ముహూర్తం పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవలే దుబాయ్ లో తొలి షెడ్యూల్ ప్రారంభించింది. ఎంత వేగంగా చేసినా హడావుడీ అవుతుందే తప్ప అవుట్ పుట్ సరిగా రాదని భావించిన మేకర్స్ సర్కారు వారి పాటను సంక్రాంతికి వాయిదావేసినట్టు తెలుస్తోంది.

దసరాకు ఆర్ఆర్ఆర్ బరిలోకి దిగుతోంది. రీసెంట్ గా రాజమౌళి తన సినిమా అక్టోబరు 13న వస్తుందని ప్రకటించారు. దీంతో పోటీ అనవసరం అనుకొని సంక్రాంతికి వాయిదా వేసారేమో తెలియదు కానీ 2022 జనవరి వరకు తన అభిమానులను వెయిట్ చేయమంటున్నారు మహేశ్ బాబు. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోన్న సర్కారు వారి పాటను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సునీల్ శెట్టి విలన్ గా కనిపించే అవకాశం ఉంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్థిక నేరాలు, బ్యాంక్ స్కాముల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ మొదలైంది. నాలుగు రోజుల క్రితమే కుటుంబ సమేతంగా దుబాయ్ చేరుకున్న మహేష్…అక్కడే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసారు. దాదాపు నెలరోజుల పాటు దుబాయ్ లోనే మొదటి షెడ్యూల్ జరగనుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ లకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకించనున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్ కూడా దుబాయ్ రీచ్ అయ్యారు.

పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను GMB ఎంటర్ టైన్ మెంట్, మైత్రి మూవీస్, 14రీల్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను GMB ఎంటర్ టైన్ మెంట్, మైత్రి మూవీస్, 14రీల్స్ కలిసి నిర్మిస్తున్నాయి.