పవర్ స్టార్ అభిమానులకు మరో శుభవార్త. సినీ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ మూవీ నుంచి మరో అప్‌డేట్‌ చెప్పేసారు. ఈ చిత్రంలోని ‘సత్యమేవ జయతే’ అనే పాట లిరికల్ వీడియోను మార్చి 3వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ. బాలీవుడ్‌ హిట్ ‘పింక్‌’ రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు డైరెక్టర్ వేణుశ్రీరామ్. శ్రుతిహాసన్‌ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుండగా… అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్‌ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్‌ మ్యూజిక్ అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్‌ 9న విడుదలకు రెడీఅయింది. కొన్నేళ్ల విరామం అనంతరం వకీల్ సాబ్ గా రీఎంట్రీ ఇస్తున్నారు పవర్ స్టార్. మెదటిసారి తన ఫిల్మ్ కెరీర్లో లాయర్‌ రోల్ చేస్తున్నారాయన. ఇక గతేడాది రిలీజైన ‘మగువా మగువా’ అంటూ సాగే పాట ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోగా…సత్యమేవ జయతే ఎలా ఉంటుందో చూడాలి మరి.