కబడ్డీ కోచ్ లుగా గోపీచంద్, తమన్నా నటిస్తోన్న సీటీమార్ టీజర్ తాజాగా రిలీజైంది. స్పోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అంతకుమించి అన్నట్టగా ఉండబోతుందనేది స్పష్టమైంది. సరికొత్త కథాంశంతో మాస్ డైలాగులతో బూస్టప్ ఇచ్చి సినిమాను రెడీ చేసారు డైరెక్టర్ సంపత్ నంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం సీటీమార్ టీజ‌ర్‌లోని సీన్స్ ప్రేక్ష‌కుల‌ని బాగానే ఆక‌ట్టుకుంటున్నాయి. గోపీచంద్ మొదటిసారి నటిస్తోన్న భారీ బడ్జెట్..హై క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం ఇది. సూపర్ టెక్నిక‌ల్ వ్యాల్యూస్ తో చాలా ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని మలుస్తున్నారు సంపత్ నంది. స్వరబ్రహ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేశారు. భూమిక ప్రధానపాతర పోషిస్తుండగా…పోసాని కృష్ణముర‌ళి, దిగంగన, రావు ర‌మేష్‌, రెహ‌మాన్, బాలీవుడ్ నటుడు త‌రుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Source: Aditya Music