మే 28న…బెల్ బాటమ్
సమ్మర్ సీజన్ లో అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ ను షెడ్యూల్ చేశారు నిర్మాతలు. రంజిత్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మే 28న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

దీపావళి పోరు…
వచ్చే దీపావళికి బాలీవుడ్ సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. షాహిద్ కపూర్ జెర్సీ, అక్షయ్ కుమార్ పృధ్వీరాజ్ సినిమాలతో పాటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆప్నే 2 కూడా అదే రోజు విడుదలకు సిద్ధమైంది.

ఆలియా కూడా…
దివాళి వేళ అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్లతో పాటూ అలియాభట్‌ కూడా రంగంలోకి దిగనుంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆమె నటిస్తోన్న ‘గంగూబాయి కతియావాడి’ సైతం దీపావళికే రిలీజ్ అంటున్నారు మేకర్స్.

ఎఫ్ఐఆర్ నమోదు…
హెల్మెట్ లేకుండా ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టిన వివేక్ ఒబేరాయ్‌పై జుహూ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఐదు వందల రూపాయ‌లు చ‌లానా కూడా విధించారు పోలీసులు.

అమ్మకాల్లో రికార్డ్…
ప్రియాంక చోప్రా స్వయంగా రాసుకున్న ‘అన్ ఫినిష్డ్’ బుక్ అమ్మకాల విషయంలో దుమ్ము రేపుతోంది. ఏకంగా.. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ లో ఆమె ఆటోబయోగ్రఫీ బుక్ స్థానం దక్కించుకుంది.

మళ్లీ బిజీగా మారుతున్నారు రాశిఖన్నా. మారుతి రమ్మన్నా గోపీచంద్ వద్దన్నారని…ఇక రాశికి అవకాశాలు కష్టమని ఇలా నిన్నటివరకు ప్రచారం జరిగింది. అయితే ఆల్రెడీ కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న రాశిఖన్నా తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల్లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్నారు.
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ సరసన ఓ సినిమా చేసేందుకు రెడీఅయ్యారు. రాజ్ అండ్ డికె డైరెక్షన్ లో ఓ ఒరిజినల్ ఓటీటీ కోసం షాహిద్, రాశి ఖన్నా జతకడుతున్నారు.
ఇక తెలుగులో హవా తగ్గిందనుకునే టైమ్ లో మళ్లీ సాయి ధరమ్ తేజ సరసన ఛాన్స్ కొట్టేసారు రాశి ఖన్నా. సుకుమార్ శిష్యుడు డెబ్యూ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్న చిత్రంలో తేజ్ జోడిగా రాశి కనిపిస్తారట. ఇదే నిజమైతే వీరిద్దరి కాంబినేషన్ కిది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. సుప్రీం, ప్రతిరోజు పండగే సినిమాల తర్వాత ఈ సినిమా ద్వారా మెగా కంపౌండ్ లోకి రాశి మళ్లీ అడుగుపెట్టబోతుంది.