వర్సటైల్ హీరో శర్వానంద్ నటించిన తాజా సినిమా శ్రీకారం. మార్చి 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఖమ్మంలో ప్రీరిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ‌కారం బిగ్ టికెట్‌ని ఆవిష్క‌రించి శర్వాను, శ్రీకారం యూనిట్ ని అభినందించారు చిరంజీవి. రామ్ చరణ్ లాగానే శర్వానంద్ నా కొడుకుతో సమానమని చెప్పుకొచ్చారు.
ఇక తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా మరోసారి ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముస్తాబు చేస్తున్నారు. హైదరాబాద్, మాదాపూర్ లో జరగనుంది శ్రీకారం ప్రీరిలీజ్ వేడుక. వ్యవసాయం నేపథ్యంగా తెరకెక్కించిన సినిమా కావడంతో కేటీఆర్ శ్రీకారాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చారని తెలియజేస్తుంది మూవీ యూనిట్.

సినిమా ఇండస్ట్రీలో సెట్స్ మీదకెళ్లే వరకూ గ్యారంటీ ఉండదు. ఒక్కోసారి సెట్స్ మీద కూడా హీరో, హీరోయిన్లని మార్చేస్తూ ఉంటారు. రీసెంట్ గా టాలీవుడ్ అలా కొంతమంది హీరోల దగ్గరకొచ్చిన స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేస్తే..వేరే హీరోల దగ్గరకెళ్లి షూటింగ్ జరుపుకుంటోంది. సలార్ అలాంటి సినిమానే. డైరెక్రట్ ప్రశాంత్ నీల్ ఈ భారీ యాక్షన్ మూవీ సినిమాని .. యష్ కోసం రాసుకున్నాడట. అయితే యష్ అప్పట్లో కొన్ని చేంజెస్ చెప్పడం, ఈ కథ అంతగా తనకు సూట్ కాదని చెప్పడంతో ప్రశాంత్ ఆ స్టోరీని ఇప్పుడు ప్రభాస్ కి చెప్పారు. కథ విన్న వెంటనే ప్రభాస్ ఓకే చెప్పడంతో ఇప్పుడు భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది సలార్ .

prabhas prashanth neel salaar release date,

పుష్ప సినిమా కూడా ఈ లిస్ట్ లో ఉన్నదే . సుకుమార్ ..మహేష్ బాబుతో సినిమా చెయ్యాలని దాదాపు రెండేళ్ల నుంచి వెయిట్ చేశారు. కానీ పుష్ప స్టోరీ విన్న తర్వాత అంత మాస్ క్యారెక్టర్ లో మహేష్ పర్ ఫామెన్స్ డైజెస్ట్ చేస్కోవడం కష్టమని ,ఆడియన్స్ అంతగా రిసీవ్ చేస్కోరని .. క్రియేటివ్ డిఫరెన్సెస్ తో సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేశారు మహేష్. అయితే అదే సినిమాని సుకుమార్ బన్నీ తో కలిసి భారీగా తెరకెక్కిస్తున్నారు. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 13న రిలీజ్ అవుతోంది.

allu arjun latest movie updates,Pushpa movie latest movie updates,ahachitram

శ్రీకారం సినిమా కూడా అంతే .. ఓ హీరో రిజక్ట్ చేస్తే ..మరో హీరో కంప్లీట్ చేసేశాడు . ఈ నెలలోనే రిలీజ కు రెడీ అవుతున్న శ్రీకారం సినిమా కు ఫస్ట్ నాని నే హీరోగా అనుకున్నారు. కానీ రకరకాల కారణాలతో సినిమా నాని నుంచి శర్వానంద్ కి షిఫ్ట్ అయ్యింది. సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయిన సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది మార్కెట్ లో .

sreekaram first look sharwanand

నాని రిజక్ట్ చేసిన మరో స్క్రిప్ట్ ని ఓకే చేశారు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ . రీసెంట్ గా ఉప్పెన సినిమాతో 100 కోట్ల మార్కెట్ క్రియేట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ యంగ్ హీరో .. క్రిష్ తో సినిమా కంప్లీట్ చేసేశారు . మూడో సినిమా మాత్రం కొత్త డైరెక్టర్ తో బడా నిర్మాత భోగవల్లి ప్రసాద్ ప్రొడక్షన్ లో చేస్తున్నారు వైష్ణవ్ . ఈ సినిమా స్టోరీ కూడా ఫస్ట్ నాని దగ్గరకెళ్తే .. అది నాని, డిఫరెంట్ జానర్ అని రిజక్ట్ చేస్తే .. వైష్ణవ్ తేజ్ ఈ క్రేజీ సినిమాని ఓకే చెప్పారు.

సీనియర్ స్టార్ వెంకటేష్ రిజక్ట్ చేసిన సినిమా ఇప్పుడు మరో హీరో చేతిలోకి వెళ్లింది. తనదైన స్టైల్లో డిఫరెంట్ సినిమాలు చేసే నక్కిన త్రినాధ రావు .. ఓ ఇంట్రస్టింగ్ స్టోరీని వెంకటేష్ కి చెప్పారు. కానీ వెంకటేష్ ఆ సినిమా చెయ్యడానికి అంతగా ఇంట్రస్ట్ చూపించలేదు. ఇప్పుడు అదే సినిమాని రవితేజ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాని అఫీషియల్ గా స్టార్ట్ చేశారు టీమ్ .

RT 68, Ravi teja, Trinadha Rao Nakkina, peoples media factry,

తన 37వ బర్త్‌ డేను జరుపుకుంటున్నారు శర్వానంద్‌. అయితే ఈ హీరోకి ఊహించని సర్‌ప్రైజ్‌ ఎదురయ్యింది. తన బెస్ట్‌ ఫ్రెండ్‌.. రామ్‌ చరణ్‌ అర్థరాత్రి బర్త్‌ డే పార్టీ ఏర్పాటు చేసి శర్వానంద్‌ చేత కేక్‌ కట్‌ చేయించారు. ఈ ఫోటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు శర్వా.


మరోవైపు శర్వానంద్‌ బర్త్‌ డే సందర్భంగా మహా సముద్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ రిలీజయింది. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో శర్వానంద్‌ తో పాటూ సిద్ధార్ద్ కూడా నటిస్తున్నాడు. ఇక కిశోర్‌ దర్శకత్వంలో శర్వానంద్ నటించిన శ్రీకారం ట్రైలర్‌ రీసెంట్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 11న థియేటర్స్ కి రానున్న ఈ మూవీ ట్రైలర్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలాఉంటే కిషోర్ తిరుమల, శర్వానంద్ కాంబినేషన్లో రూపొందుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ పోస్టర్ విడుదలైంది. రష్మికా మంథన్నా ఇందులో లేడీ లీడ్ గా నటిస్తోంది. ఇలా వరుసగా శర్వా కొత్త సినిమాల అప్ డేట్స్ తో పుట్టినరోజును మరింత ఎగ్జైటింగ్ గా మారుస్తున్నారు మూవ మేకర్స్.

తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేసిన శర్వానంద్‌ శ్రీకారం యూట్యూబ్ ట్రెండింగ్ నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఎప్పటిలాగే ఓ డిఫరెంట్ కథాంశంగా తెరకెక్కిన శ్రీకారంతో మనమందుకు వచ్చారు శర్వానంద్. అంతేకాదు ఈ హీరో రైతుగా కనిపిస్తోన్న ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి సైతం పెద్దపీట వేసారట డైరెక్టర్ బి.కిశోర్. మార్చి 11న మహాశివరాత్రి కానుకగా విడుగలకు సిద్ధమైందీ సినిమా.

హీరోయిన్ ప్రియాంక అరుళ్‌ మోహన్ శర్వాకి జంటగా నటించింది. నరేశ్, ఆమని, సాయికుమార్, రావురమేశ్‌, మురళీశర్మ, సప్తగిరి వివిధ పాత్రల్లో నటించారు. మిక్కీ జే.మేయర్‌ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ పాటలు ఇప్పటికే పాపులరయ్యాయి. 14రీల్స్‌ ప్లస్‌ బ్యావర్ పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేసారు. భలేగుంది బాల, సందళ్లే..సందళ్లే పాటలతో పాటూ రీసెంట్ గా రిలీజైన శ్రీకారం టీజర్ సైతం ప్రేక్షకులని బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి.

Source: 14 Reels plus

ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించింది మహాసముద్రం టీమ్. శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మహాసముద్రం. ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దీనికి దర్శకుడు. డిఫరెంట్ జానర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో…అదితి రావు హైదరి, అనూ ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్.

తెలుగులో సిద్దార్థ్ కి ఈ చిత్రంతో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఇక వరుస కమిట్మెంట్స్ తో తీరిక లేకుండా దూసుకుపోతున్న శర్వానంద్ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. హీరోయిన్స్ అదితి, అనూ సైతం మంచి హోప్స్ పెట్టుకున్నారు దీనిపై. ఆర్ ఎక్స్ 100కి మించిన సూపర్ హిట్ ను టాలీవుడ్ కివ్వాలనే ఉద్దేశ్యంతో ఓ లెవెల్లో తీసుకున్నాడట అజయ్ భూపతి. మరి చూద్దాం ఆగస్టు 19న రాబోతున్న మహాసముద్రం ఏ మేరకు ఉప్పొంగుతుందో…..

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ఓ ట్రాక్ లో పడుతోంది టాలీవుడ్. డబ్బింగ్ మాస్టర్ కాకుండా ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు థియేటర్స్ లో సందడి చేసాయి. క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా…రెడ్ బ్రేక్ ఈవెన్ లోకి వెళ్లింది. ఇంక అదుర్స్ అనిపించుకోవాల్సింది అల్లుడు మాత్రమే. సరే…లాభనష్టాలు ఎలా ఉన్నా…సినిమా హాళ్లకు వచ్చేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం అర్ధమయింది. దీంతో వరుసగా థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.

ఈ క్రమంలో… మహాశివరాత్రిని టార్గెట్ చేస్తూ ఇప్పటికే కొన్ని సినిమాలు బరిలోకి దిగాయి. మార్చి 12 మహా శివరాత్రి సందర్భంగా బాక్సాఫీస్ ను హీట్ ఎక్కించేందుకు వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా మూడు సినిమాల గురించి చెప్పుకోవాలి. ఈ మూడూ కూడా శివరాత్రికి ఒకరోజు ముందు మార్చి 11న రిలీజ్ డేట్ ప్రకటించాయి. శర్వానంద్ శ్రీకారంతో…గాలి సంపత్ గా శ్రీ విష్ణు… జాతిరత్నాలు అంటూ నవీన్ పొలిశెట్టి క్యూలో నిలిచారు. కథే ప్రాధాన్యంగా సాగే ఈ మూడు సినిమాలపై గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నారు ఈ హీరోలు. అందుకే బరిలో ఎంతమందున్నా ఢీ కొట్టేందుకు సై అంటున్నారు.

నిజానికి గాలి సంపత్ మినహా.. శ్రీకారం, జాతిరత్నాలు ఎప్పుడో పూర్తయ్యాయి. 2020 వేసవిలోనే వచ్చేందుకు సిద్ధమయ్యాయి. కానీ.. కరోనా కారణంగా వాయిదా పడుతూ చివరికి శివరాత్రికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో గాలి సంపత్ తెరకెక్కగా, డైరెక్టర నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి జాతిరత్నాలు చిత్రాన్ని నిర్మించారు. అలాగే గ్రామీణ నేపథ్యంలో తీసిన శర్వానంద్ శ్రీకారం చిత్రం ఇప్పటికే సంక్రాంతి పాటతో బజ్ క్రియేట్ చేసింది. మరి చూద్దాం…ఎవరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో….