ఈమధ్య సరైన అవకాశాలు లేక తెలుగమ్మాయిలు…తమిళ బాట పడుతున్న వార్తలు చూస్తున్నాం. అక్కడ కొంతమంది బాగా పేరు తెచ్చుకుంటున్నారు కూడా. అయితే తాజాగా రీజన్ తెలియదు కానీ రాజశేఖర్‌ – జీవితల కుమార్తె శివాత్మిక కూడా కోలీవుడ్ పయనమయ్యారు. ఓ తమిళ సినిమాకి ఆమె సైన్ చేసారు. బైబై టాలీవుడ్ అనలేదు కానీ ఛలో కోలీవుడ్‌ అంటున్నారు. కథ బాగా నచ్చటంతో గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాలో నటించేందుకు అంగీకరించారట. నందా పెరియసామి డైరెక్ట్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ మార్చి నెలలో సెట్స్‌ పైకి వెళ్లనుంది. గ్రామీణ నేపథ్యంలో ఓ ఫ్యామిలీ డ్రామాగా సాగే ఈ చిత్రంలో శివాత్మిక… టీవీ యాంకర్‌గా కనిపించనున్నారు. హీరోయిన్ గా ఆమెకిది మూడో సినిమా. ‘దొరసాని’తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన శివాత్మిక, అదిత్‌ అరుణ్‌ జోడీగా మరో మూవీ చేస్తున్నారు.