తమిళనాడు మాజీ ముఖ్యమంతి దివంగత జయలలిత బయోపిక్ అంటే… అందులో తప్పనిసరిగా ఉండాల్సిన ఇద్దరు వ్యక్తులు శశికళ, శోభన్ బాబు. ఒకరు సినిమాల ద్వారా పరిచయమై ప్రేమను పంచితే…మరొకరు రాజకీయల్లో తనకు చేదోడువాదోడుగా నిలిచారు. వీళ్లిద్దరూ కూడా జయ జీవితంలో కాంట్రవర్సీ రేకెత్తించారు. ఎప్పటికీ వీడని సస్పెన్స్ ని క్రియేట్ చేసారు. కానీ తాజాగా రిలీజైన తలైవి ట్రైలర్ లో వీరిద్దరి క్యారెక్టర్స్ కనిపించలేదు. నిజానికి అమ్మగా కంగనా రనౌత్ తన నటనతో ఆకట్టుకుంది. మొత్తం ట్రైలర్ లో కూడా ఎక్కడా వంక పెట్టలేం అయితే ఇందులో శశికళ, శోభన్ బాబుల పాత్రలను రివీల్ చేయకపోవడంతో కొత్త చర్చ మొదలైంది. కోలీవుడ్ టాక్ ప్రకారం ‘శశికళ’ పాత్రలో హీరోయిన్ ‘పూర్ణ’ నటించింది. అలాగే ‘శోభన్ బాబు’ రోల్ ను బెంగాళీ నటుడు ‘జిష్షూ సేన్ గుప్తా’ పోషించారు. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాలనే ఉద్దేశ్యంతోనే వీరిద్దరినీ ట్రైలర్ లో చూపించలేదని తెలుస్తోంది.