మనుషుల కంటే ఏనుగులకే తెలివెక్కువంటూ అరణ్య ట్రైలర్ తో దూసుకుపోతున్నాడు రానా దగ్గుబాటి. అంతేకాదు…ఏనులుగు చాలా ఎమోషనల్ అనీ చెప్తున్నాడు. ఆయన హీరోగా నటించిన “అరణ్య” మూవీ ట్రైలర్‌ తాజాగా రిలీజైంది. దీనికి రానా చిన్నాన్న వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. ప్రస్తుతం 10మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ట్రెండింగ్ నంబర్ 1లో ఉంది అరణ్య.
25 సంవత్సరాలుగా అడవిలో గడిపిన ఓ వ్యక్తి స్టోరీతో వస్తున్న చిత్రమిది. ఇందులో విష్ణు విశాల్‌, శ్రియా పిల్గావోంకర్‌, జోయా హుస్సేన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ డైరెక్టర్ ప్రభు సాల్మన్‌. ట్రైలర్‌లో చూస్తున్నట్టుగానే అటవీ నిర్మూలన సంక్షోభ నేఫథ్యంగా అరణ్య రాబోతుందనే విషయం అర్ధమవుతుంది. మార్చి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: Eros Now Telugu